14th Week Nominations List: ఊహించని టాస్క్‌తో షాకిచ్చిన బిగ్ బాస్.. ఈ వారం ఆ కంటెస్టెంట్లు నామినేట్!

తెలుగు బుల్లితెర చరిత్రలోనే సరికొత్త చరిత్రకు శ్రీకారం చుడుతూ మొదలైంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. మొదటి సీజన్ నుంచి సక్సెస్‌ఫుల్‌ టాక్ తెచ్చుకున్న ఈ షో.. ప్రస్తుతం ప్రసారం అవుతోన్న దానికి సైతం అదే తరహా ఫలితాన్ని రాబడుతోంది. ఇక, ఈ సీజన్‌ తుది దశకు చేరుకోవడంతో మరింత రంజుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో చివరి వారం నామినేషన్ ఎలా ఉంటాయోనన్న ఆసక్తి అందరిలోనూ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో 14వ వారం నామినేషన్ అయిన కంటెస్టెంట్ల జాబితా లీక్ అయింది. అసలు ఈ వారం ఎవరు నామినేట్ అయ్యారో చూద్దాం పదండి.!

సోమవారం నుంచి మారిన టైమింగ్స్

సోమవారం నుంచి మారిన టైమింగ్స్

బిగ్ బాస్ షోపై రోజురోజుకూ ఆసక్తి పెరుగుతూనే ఉంది. అదీ కాక నాలుగో సీజన్ ఫినాలేకు దగ్గర పడుతుండడంతో నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సోమవారం నుంచి బిగ్ బాస్ షో టైమింగ్స్ మార్చేశారు. ఇప్పటి వరకు రాత్రి 9.30 గంటలకు మొదలైన ఈ షో.. నేటి నుంచి రాత్రి 10 గంటలకు ప్రారంభం కాబోతుందని ప్రకటించారు.

ఈ వారం చివరి నామినేషన్స్ ప్రక్రియ

ఈ వారం చివరి నామినేషన్స్ ప్రక్రియ

బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు రెండు వారాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ వారం మాత్రమే నామినేషన్స్ ప్రక్రియ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఆరుగురు కంటెస్టెంట్ల నుంచి 14వ వారం ఒకరు ఎలిమినేట్ అయిపోతారు. మిగిలిన ఐదుగురు సభ్యులు ఫినాలే వీక్‌కు చేరుకుంటారు. దీంతో ఈ వారం ఎవరు నామినేట్ అవుతారు.? ఎవరు ఫినాలేకు వెళ్తారు.? అన్నది ఆసక్తికరంగా మారింది.

అఖిల్ సార్థక్‌కు ఈ సారి భయం లేదు

అఖిల్ సార్థక్‌కు ఈ సారి భయం లేదు

గత వారం జరిగిన రేస్ టు ఫినాలే టాస్క్‌లో విజయం సాధించడం ద్వారా అఖిల్ సార్థక్ నేరుగా ఫినాలేలోకి అడుగు పెట్టేశాడు. ముందుగా ఫైనల్స్‌కు చేరిన అతడికి శనివారం జరిగిన ఎపిసోడ్‌లో అతడికి మెడల్ అందజేశారు. కాబట్టి 14వ వారం అంటే సోమవారం జరిగే నామినేషన్స్ ప్రక్రియలో అతడు పాలుపంచుకోడు. మిగిలిన ఐదుగురు సభ్యులు మాత్రమే ఈ ప్రక్రియలో ఉంటారు.

టాప్ -5లో ఎవరు ఉంటారో చూడాలి

టాప్ -5లో ఎవరు ఉంటారో చూడాలి

వాస్తవానికి ఎప్పటి నుంచో బిగ్ బాస్ నాలుగో సీజన్ ఫైనలిస్టుల విషయంలో ఎన్నో చర్చలు జరుగుతున్నాయి. ప్రజాదరణ ఉన్న కంటెస్టెంట్లను కాదని, ఏమాత్రం ఫాలోయింగ్ లేని కొందరిని హౌస్‌లో ఉంచుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తోన్న నేపథ్యంలో ఫినాలే వీక్‌కు ఎవరిని పంపించబోతున్నారన్న దానిపై అందరిలోనూ పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ వారం ఊహించని విధంగా టాస్క్

ఈ వారం ఊహించని విధంగా టాస్క్

14వ వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ ఎంత ముఖ్యమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ వారం సేఫ్ అయిన కంటెస్టెంట్లు నేరుగా ఫినాలే వీక్‌లో అడుగు పెడతారు. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ సరికొత్త టాస్కుతో ముందుకొచ్చాడని తెలుస్తోంది. ఈ వారం నామినేషన్ ప్రక్రియను ఊహించని విధంగా డిజైన్ చేసి కంటెస్టెంట్లు అందరికీ భారీ షాకిచ్చాడని సమాచారం.

Recommended Video

Tollywood Stars At A MB Cinemas | Filmibeat Telugu
14వ వారం నామినేషన్ జాబితా ఇదే

14వ వారం నామినేషన్ జాబితా ఇదే

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... ఈ వారం అనూహ్యం జరిగిన నామినేషన్‌ టాస్కులో ఐదుగురు కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారట. అంటే ‘రేస్ టు ఫినాలే' మెడల్ ద్వారా ఫైనల్స్‌కు చేరిన అఖిల్ సార్థక్‌ను మినహాయించి.. అభిజీత్, దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్, మోనాల్ గజ్జర్‌లు ఈ వారం నామినేషన్ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X