Bigg Boss Telugu 7: 14వ వారం ఎలిమినేట్ ఎవరు కానున్నారంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం!

బిగ్‌ బాస్ తెలుగు 7 రియాలిటీ షో సెప్టెంబర్ 3న ప్రారంభం అయి ఉల్టాపుల్టాగా ట్విస్టులు, షాకులు ఇస్తూ ఆసక్తిగా సాగుతోంది ఇక మరో వారంలో ఈ షో ముగియనుంది. గత 14వారాలుగా ఈ షో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా నాగార్జున హోస్టుగా చక్కగా ఈ రియాలిటీ షోను రసవత్తరంగా నిర్వహిస్తున్నారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక 14వ వారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్‌ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 14వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారు? అనే ప్రశ్నకు శివాజీ అని 18 శాతం మంది ఓటు వేయగా.. యావర్ కు10 శాతం మంది, అమర్ దీప్ కు 10 శాతం మంది, ప్రశాంత్ కు 9 శాతం మంది, ప్రియాంకకు 3 శాతం మంది, శోభా శెట్టి కు 47 శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ వారం నెటిజన్స్ దృష్టిలో శోభా శెట్టి ఎలిమినేట్ కానున్నట్లు తెలుస్తోంది.

14th Week Survey of Filmibeat Telugu on Bigg Boss 7 Telugu: Results are here

బిగ్‌బాస్ తెలుగు 7 ఎలా సాగుతున్నది? అనే ప్రశ్నకు బాగుంది అని 44 శాతం మందికి బాగాలేదు అని 42 శాతం మంది ఓటు వేశారు. ఏమీ చెప్పలేమని 13 శాతం మంది ఓటు వేశారు. బిగ్‌బాస్ తెలుగు 7 బాగుందని నెటిజన్స్ భావిస్తున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో ఎవరు విజేతగా నిలుస్తారని అనుకొంటున్నారు? అనే ప్రశ్నకు భారీ ఎత్తున ఓటింగ్ జరిగింది. ఇక ఈ సీజన్ విన్నర్ అని శివాజీకి 42 శాతం మంది ఓటు వేశారు. ప్రియాంక జైన్ కు 1 శాతం మంది ఓటు వేయగా.. శోభా శెట్టికి 3 శాతం ఓటు వేయగా... ప్రిన్స్ యావర్ కు 1 శాతం మంది ఓటు వేశారు. ఇక అమర్ దీప్ కు 18 శాతం మంది, పల్లవి ప్రశాంత్ 22 శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన ఈ సీజన్ విన్నర్ శివాజీ అని నెటిజన్స్ అనుకుంటున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో క్లీన్‌గా గేమ్ ఆడుతున్నది ఎవరు? అనే ప్రశ్నకు శివాజీ అని 45 శాతం మంది, ప్రియాంక జైన్ అని 5 శాతం మంది, శోభా శెట్టి అని 2 శాతం మంది, ప్రిన్స్ యావర్ అని 3 శాతం మంది, అమర్ దీప్ అని 15 శాతం మంది, పల్లవి ప్రశాంత్ అని 20 శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన క్లీన్ గేమ్ ఆడుతున్నది పల్లవి శివాజీ అని తేలింది.

14th Week Survey of Filmibeat Telugu on Bigg Boss 7 Telugu: Results are here

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో చెత్త‌గా గేమ్ ఆడుతున్నది ఎవరు? అనే ప్రశ్నకు శివాజీ అని 25 శాతం మంది, ప్రియాంక జైన్ అని 6 శాతం మంది, శోభా శెట్టి అని 23 శాతం మంది, ప్రిన్స్ యావర్ అని 5 శాతం మంది, అమర్ దీప్ అని 20 శాతం మంది, పల్లవి ప్రశాంత్ అని 13 శాతం మంది ఓటు వేశారు. అర్జున్ అంబటి 7 శాతం ఓటు వేశారు. ఈ లెక్కన ఈ సీజన్ లో చెత్తగా గేమ్ ఆడుతున్నది శివాజీ అని తేలింది.

స్పై, స్పా బ్యాచుల్లో ఎవరికి మీ సపోర్ట్ అనే ప్రశ్నకు 60శాతం మంది స్పై బ్యాచుకు, స్పా బ్యాచుకు 25శాతం మంది ఓటు వేయగా... ఎవరికి కాదని 15శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన స్పై బ్యాచుకు నెటిజన్స్ సపోర్ట్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక ఈ వారం శోభా శెట్టి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. ఇక 15వ వారంలో మిడ్ వీక్ లో యావర్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X