Bigg Boss Telugu 7 బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరంటే? ఉల్టా పుల్టాగా సర్వే ఫలితం!

100 రోజులకు పైగా బిగ్ బాస్ షో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక బిగ్ బాస్ తెలుగు 7 విజేత ఎవరు అనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. ఇదిలా ఉంటే ఫిల్మి బీట్ తెలుగు ప్రతివారం బిగ్ బాస్ తెలుగు 7 షోపై సర్వే నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక గత 14 వారాలుగా బిగ్ బాస్ షోపై సర్వే నిర్వహించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక 15వ వారం కూడా భారీ ఎత్తున ఓట్లు నమోదు అయ్యాయి. 15వ వారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్‌ తెలుగు పోల్ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో ఎవరు విజేతగా నిలుస్తారని అనుకుంటున్నారు అనే ప్రశ్నకు శివాజీకి 46.62 శాతం మంది ఓటు వేశారు. ప్రియాంక జైన్ కి 3.76 శాతం మంది, ప్రిన్స్ యావర్ కి 2.26 శాతం మంది, అమర్ దీప్ కి 12.03 శాతం మంది, పల్లవి ప్రశాంత్ కి 24 శాతం మంది, అర్జున్ అంబటికి 10 శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ సీజన్ విన్నర్ శివాజీ అని బిగ్ బాస్ సర్వేలో తేలింది.

 15th Week Survey of Filmibeat Telugu on Bigg Boss 7 Telugu: Results are here

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో క్లీన్‌గా గేమ్ ఆడుతున్నది ఎవరు? అనే ప్రశ్నకు శివాజీ అని 45 శాతం మంది, ప్రియాంక జైన్ అని 5 శాతం మంది, ప్రిన్స్ యావర్ అని 3 శాతం మంది, అమర్ దీప్ అని 15 శాతం మంది, పల్లవి ప్రశాంత్ అని 20 శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన క్లీన్ గేమ్ ఆడుతున్నది పల్లవి శివాజీ అని తేలింది.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో చెత్త‌గా గేమ్ ఆడుతున్నది ఎవరు? అనే ప్రశ్నకు శివాజీ అని 31 శాతం మంది, ప్రియాంక జైన్ అని 10 శాతం మంది, ప్రిన్స్ యావర్ అని 6 శాతం మంది, అమర్ దీప్ అని 37 శాతం మంది, పల్లవి ప్రశాంత్ అని 8 శాతం మంది, అర్జున్ అంబటి అని 6 శాతం మంది ఓటు వేశారు. ఈ లెక్కన చెత్తగా గేమ్ ఆడుతున్న అమర్ దీప్ అని తేలింది.

శోభా శెట్టి ఎలిమినేషన్ కరెక్ట్ అని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు అవును అని 82 శాతం మంది, కాదు అని 12 శాతం మంది, చెప్పలేం అని 6 శాతం మంది ఓటు వేశారు. ఈలెక్కన శోభా శెట్టి ఎలిమినేషన్ కరెక్ట్ అని నెటిజన్స్ భావిస్తున్నారు.

 15th Week Survey of Filmibeat Telugu on Bigg Boss 7 Telugu: Results are here

మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్‌లో కన్నింగ్ ప్లేయర్ ఎవరని మీరనుకుంటున్నారు? అనే ప్రశ్నకు శివాజీ అని 33 శాతం మంది, ప్రియాంక జైన్ అని 15 శాతం మంది, ప్రిన్స్ యావర్ అని 4 శాతం మంది, అమర్ దీప్ అని 23 శాతం మంది, పల్లవి ప్రశాంత్ అని 10 శాతం మంది, అర్జున్ అంబటికి 12 శాతం మంది ఓటు వేశారు.ఈలెక్కన మిగిలిన ఆరుగురు కంటెస్టెంట్స్‌లో కన్నింగ్ ప్లేయర్ శివాజీ అని భావిస్తున్నారు.

 15th Week Survey of Filmibeat Telugu on Bigg Boss 7 Telugu: Results are here

బిగ్ బాస్ వీరిలో ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నట్లు అనిపిస్తుందా? అనే ప్రశ్నకు శివాజీ అని 32 శాతం మంది, ప్రియాంక జైన్ అని 13 శాతం మంది, ప్రిన్స్ యావర్ అని 7 శాతం మంది, అమర్ దీప్ అని 37 శాతం మంది, పల్లవి ప్రశాంత్ అని 7 శాతం మంది, అర్జున్ అంబటి అని 3 శాతం మంది ఓటు వేశారు. ఈలెక్కన బిగ్ బాస్ అమర్ దీప్ కు సపోర్ట్ చేస్తున్నారని భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X