పల్లవి ప్రశాంత్ కేసులో మరో 16 మంది అరెస్టు... బెయిల్ పిటిషన్‌పై కోర్టు ఏం చెప్పిందంటే?

బిగ్ బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా అంటూ కొనసాగింది. అయితే ఈ సీజన్లో విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. ఇక ఆయన చేసిన పబ్లిక్ న్యూసెన్స్ వల్ల.. పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ చంచల్ గూడ జైలులో ఉన్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో 16 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలపై దాడికి పాల్పడిన వారిలో 16 మందిని గుర్తించి అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే...

బిగ్ బాస్ అంటేనే వివాదాల సుడిగుండం. ఎప్పటి నుంచో దీన్ని బ్యాన్ చేయాలంటూ ప్రముఖులు అంటునే ఉన్నారు. అయితే వినోదం.. అంటూ నిర్వహకులు షోను నడిపిస్తున్నారు. ఇక ఈ సారి సీజన్ ఉల్టా పుల్టా అంటూ సాగింది. ఇక ఉల్టా పుల్టా అన్నట్లుగానే ఈ సారి విన్నర్ గా శివాజీ అవుతారను అనుకున్నప్పటికీ కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ కు దక్కింది. ఇక రన్నరప్ గా అమర్ దీప్ నిలిచాడు. ఇక శివాజీ మూడో స్థానానికి కైవసం అయ్యాడు.

16 More Arrested in Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Case

పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయట పెద్ద విధ్వంసం చోటుచేసకుుంది. అమర్ దీప్, గీతు రాయల్, అశ్విని శ్రీ వంటి కంటెస్టెంట్స్ కార్లను పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెప్పుకుంటూ కొంత మంది ధ్వంసం చేశారు. అంతే కాదు.. సుమారు 6 ఆర్టీసీ బస్సుల అద్దాలు ధ్వంసం చేశారు. ఇక పల్లవి ప్రశాంత్ ను లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని పోలీసులు హెచ్చరించినా వినకుండా ర్యాలీ చేశాడు.

ఆ కారణం చేత పల్లవిప్రశాంత్, అతని సోదరుడిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ఇదే కేసులో పల్లవి ప్రశాంత్ ప్రయాణిస్తున్న కారును డ్రైవ్ చేసిన ఇద్దరు డ్రైవర్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే పల్లవి ప్రశాంత్ ను చంచల్ గూడ జైలుకు తరలించారు. ప్రస్తుతం అతను జైలులోనే ఉన్నాడు. ఇక పల్లవి ప్రశాంత్ ను పలువురు ప్రముఖులు సపోర్ట్ చేస్తుండగా.. మరికొంత మంది ఆయన రియల్ ఫేస్ ఇది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

16 More Arrested in Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Case

ఇక తాజాగా ఈ కేసులో ఇప్పటివరకు 16 మందిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ 16 మందిలో నలుగురు మైనర్లు ఉండగా... మిగతా 12 మంది మేజర్లుగా గుర్తించారు. వారికి వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో పోలీసులు హాజరు పరుచనున్నారు. ఇక ఇదే కేసులో ఉన్న మైనర్ లను జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరు పరచబోతున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని పల్లవి ప్రశాంత్ తరఫు లాయర్లు.. నాంపల్లి కోర్టును బెయిల్ కోసం ఆశ్రయించారు. బెయిల్ పిటిషన్ పై వాదనలు జరిపిన కోర్టు... కేసును రేపటికి వాయిదా వేసింది. మరి పల్లవి ప్రశాంత్ కు బెయిల్ వస్తుందా లేదా అనేది రేపు తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X