Bigg Boss టీమ్ సంచలన నిర్ణయం: తొలిసారి అంత మంది కంటెస్టెంట్లతో.. ఆ భయంతో ముందుగానే వాళ్లంతా!

తెలుగు బుల్లితెరపై తిరుగులేని రికార్డుతో హవాను చూపిస్తూ దూసుకుపోతోంది బిగ్ బాస్ రియాలిటీ షో. అసలేమాత్రం అంచనాలు లేకుండానే మొదలైన దీనికి తెలుగు ప్రేక్షకుల నుంచి ఓ రేంజ్‌లో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది రికార్డు స్థాయిలో రేటింగ్‌ను అందుకుంటూ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. దీంతో ఏకంగా నాలుగు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఐదోది కూడా త్వరలో ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో కొత్త సీజన్ గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సారి ఏకంగా ఎంతో మంది ఎంట్రీ ఇవ్వబోతున్నారట. ఆ వివరాలు మీకోసం!

నాలుగు కంప్లీట్.. అన్నీ రికార్డులే

నాలుగు కంప్లీట్.. అన్నీ రికార్డులే

బిగ్ బాస్ షో తెలుగులో నాలుగు సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. అందులో ఒక్కో షో ఒక్కో రేంజ్‌లో హిట్ అయింది. మొత్తానికి ప్రతీది ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా సక్సెస్ అయ్యాయి. మరీ ముఖ్యంగా రేటింగ్‌లో రికార్డులు క్రియేట్ చేశాయి. అందుకే మన బిగ్ బాస్ దేశ వ్యాప్తంగా గుర్తింపును అందుకుంది. ఈ సక్సెస్ వెనుక హోస్ట్ చేసిన స్టార్ హీరోల కృషి కూడా ఉంది.

ఐదో సీజన్‌పైన వచ్చేసిన స్పష్టత

ఐదో సీజన్‌పైన వచ్చేసిన స్పష్టత

నాలుగు సీజన్లు సూపర్ సక్సెస్ అవడంతో బిగ్ బాస్ ఐదో సీజన్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే త్వరలోనే రాబోయే దాని కోసం ప్లానింగ్ చేస్తున్నారు. ఇక, ఐదో సీజన్ సెప్టెంబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుందని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆగస్టులో దీనికి సంబంధించిన కొన్ని ప్రోమోలు, లోగో విడుదల అవుతాయనే టాక్ బాగా వినిపిస్తోంది.

కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కంప్లీట్

కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కంప్లీట్

కోవిడ్ ప్రభావం కారణంగా బిగ్ బాస్ షో ఈ ఏడాది ప్రసారం అయ్యేది కష్టమే అన్న టాక్ వినిపించింది. కానీ, దీని వెనుక గ్రౌండ్ వర్క్‌ను మాత్రం నిర్వహకులు ఎప్పుడో ప్రారంభించేశారు. ఇందులో భాగంగానే కంటెస్టెంట్ల ఎంపిక కోసం దాదాపు వంద మందితో చర్చలు జరిపారట. అందులో కొందరిని ఎంపిక చేసి జూమ్ మీటింగ్ ద్వారా వాళ్లతో ఇంటర్వ్యూలు చేసి కొందరిని ఎంపిక చేశారట.

ఈ సారి ఎంట్రీ ఇచ్చేది వీళ్లేనంటూ

ఈ సారి ఎంట్రీ ఇచ్చేది వీళ్లేనంటూ

ఐదో సీజన్‌లో పాల్గొనే కంటెస్టెంట్ల విషయంలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే చాలా మంది పేర్లు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సిరి హన్మంత్, నవ్య స్వామి, శ్రీహాన్ ఫైనల్ అయ్యారనే టాక్ వినిపిస్తోంది. వీళ్లతో పాటు షణ్ముక్ జశ్వంత్, హేమచంద్ర, మంగ్లీ, జబర్ధస్త్ నరేష్, రఘు మాస్టర్ సహా పలువురి పేర్లు ఈ సారి లిస్టులో ఉన్నట్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే.

తొలిసారి అంత మంది కంటెస్టెంట్లతో

తొలిసారి అంత మంది కంటెస్టెంట్లతో

బిగ్ బాస్ ప్రారంభం అవుతుందంటే దాని నుంచి ముందుగానే ఎన్నో విషయాలు బయటకు వస్తుంటాయి. ఈ క్రమంలోనే తాజాగా ఐదో సీజన్ గురించి ఓ న్యూస్ లీకైంది. దీని ప్రకారం.. ఈ సారి బిగ్ బాస్ హౌస్‌లోకి ఏకంగా 18 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారట. అది కూడా ప్రీమియర్ ఎపిసోడ్‌లోనే కావడం విశేషం. గతంలో ఏ సీజన్‌లోనూ ఒకేసారి ఇంత మందిని పంపించలేదు.

ఆ భయంతో ముందుగానే వాళ్లంతా!

ఆ భయంతో ముందుగానే వాళ్లంతా!

కంటెస్టెంట్ల ఎంపిక గురించి తెలిసిన తాజా సమాచారం ప్రకారం.. ఫైనల్ చేసిన 18 మందిని షో ప్రారంభం అవడానికి 20 రోజుల ముందుగానే బిగ్ బాస్ క్వారంటైన్‌లోకి పంపించబోతున్నారట. ఈ విషయాన్ని ఇప్పటికే ఆయా కంటెస్టెంట్లకు కూడా వెల్లడించినట్లు తెలిసింది. సెప్టెంబర్ 5న సీజన్ మొదలవుతుందని అంటున్నారు కాబట్టి ఆగస్టు రెండో వారంలోనే వాళ్లంతా లోపలికి వెళ్తారని టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X