టీవీ నటి న్యూడ్ MMS వీడియో గుట్టురట్టు

ఎస్సెమ్మెస్‌ల్లోని మహిళ మోనా కాదని పోలీసు తేల్చారు. వేరొక మహిళ చిత్రానికి మోనా ముఖ చిత్రాన్ని వాడినట్లు చెప్పారు. ఎస్సెమ్మెస్‌లతో తనను అపఖ్యాతి పాల్జేస్తున్నారంటూ గత వారం మోనా సైబర్ క్రైం విభాగానికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ వీడియోను ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఢిల్లీ నుంచి ఎస్సెమ్మెస్ అప్‌లోడ్ చేసినట్లు తేల్చారు.
గత కొద్ది రోజులుగా... హిందీ టీవీ నటి మోనా సింగ్ న్యూడ్ ఎంఎంఎస్ క్లిప్ నెట్లో హల్ చేస్తోంది. దీంతో ఖంగు తిన్న ఆమె ముంబై సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఆ వీడియోలో ఉన్నది తాను కాదని..... తన ముఖాన్ని ఆ న్యూడ్ వీడియోకు మార్ఫింగ్ చేసి నెట్లో అప్‌లోడ్ చేసారని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ వీడియోను ఎవరు ఇంటర్నెట్లో అప్ లోడ్ చేసారనే విషయమై ఆరా తీసారు. మోనా సింగ్ పలు హిందీ రియాల్టీ షోలలో, టీవీ సీరియల్స్ లో నటించే ఓ పాపులర్ నటి. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన '3 ఇడియట్స్' చిత్రంలో కూడా ఆమె ఓ చిన్న పాత్ర పోషించారు. ఈ చిత్రంలో ఆమె కరీనా కపూర్ అక్క పాత్రలో గర్భవతిగా నటించింది.


Click it and Unblock the Notifications











