షాకింగ్.. జూ.ఎన్టీఆర్‌కి 20 కోట్లు ఆఫర్.. వదిలేలా లేరుగా?

Recommended Video

Bigg Boss Telugu 3 : Unit Offering A Big Amount To NTR

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి మాస్ ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులోనూ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇక బిగ్‌బాస్ సీజన్ 3 గురించి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మొదటి రెండు సీజన్స్ సక్సెస్ కావడంతో మూడవ సీజన్ పై ఆసక్తి పెరుగుతోంది. బిగ్ బాస్ 3 ఇంకా వినోదాత్మకంగా, ఉత్కంఠ భరితంగా సాగుతుందని ప్రేక్షకులు అంచనా వేస్తున్నారు. తొలి సీజన్ కు హోస్ట్ గా వ్యవహరించి విజయవంతంగా నడిపించిన ఎన్టీఆర్ గురించి రూమర్స్ మాత్రం ఆగడం లేదు.

ఆకట్టుకున్న ఎన్టీఆర్

ఆకట్టుకున్న ఎన్టీఆర్

తొలి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి తన సమయస్ఫూర్తితో అందరిని ఆకట్టుకున్నాడు. తొలి సీజన్ సూపర్ సక్సెస్ గా నిలవడంతో ఎన్టీఆర్ కీలక పాత్ర పోషించాడు. తెలుగు ఆడియన్స్ కు బిగ్ బాస్ ఆ సమయంలో కొత్త. ఆడియన్స్ అందరిని ఆకర్షిస్తూ షోని నడిపించడంలో ఎన్టీఆర్ విజయవంతం అయ్యాడు. కంటెస్టెంట్స్ తో ఎన్టీఆర్ సంభాషణ కూడా ఆకట్టుకుంది.

 ముస్తాబవుతున్న 3వ సీజన్

ముస్తాబవుతున్న 3వ సీజన్

అదే జోరుని నాని రెండవ సీజన్ లో కూడా కొనసాగించాడు. కొన్ని వివాదాలు ఏర్పడినప్పటికీ అవి షోపై ప్రభావం చూపలేదు. కానీ అలాంటి వివాదాలు 3వ సీజన్ లో రిపీట్ కాకుండా నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారు. ఈ ఏడాది జూన్ లో ప్రారంభం కాబోయే 3వ సీజన్ కు హోస్ట్ ఎవరనే ఉత్కంఠ కొనసాగుతోంది. ఇందులో ప్రధానంగా మెగాస్టార్ చిరు, విక్టరీ వెంకటేష్, ఎన్టీఆర్ పేర్లు వినిపిస్తున్నాయి.

20 కోట్లు ఆఫర్

20 కోట్లు ఆఫర్

తాజా సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కు బిగ్ బాస్ నిర్వాహకులు 20 కోట్ల భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. నిజంగా ఇది సంచలనమే అని చెప్పొచ్చు. తెలుగులో నిర్వహించే ఓ రియాలిటీ షోకు ఈ స్థాయిలో రెమ్యునరేషన్ ఆఫర్ చేయడం మామూలు విషయం కాదు. సీజన్ 3తో బిగ్ బాస్ షోకు మళ్ళీ ఎన్టీఆర్ తిరిగివస్తే అంచనాలు మరో స్థాయిలో ఉంటాయని, షోకి మరింతగా క్రేజ్ పెరుగుతుందని నిర్వాహకులు భావిస్తున్నారు.

వదిలేలా లేరు

వదిలేలా లేరు

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ చిత్రంతో బిజీగా ఉన్నాడు. రాజమౌళి సినిమా అంటే ఎంతటి టైట్ షెడ్యూల్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ బిగ్ బాస్ షో చేయడం దాదాపుగా అసాధ్యం. అయినా కూడా ఎన్టీఆర్ ని ఎలాగైనా ఒప్పించేందుకు నిర్వాహకులు 20 కోట్ల రెమ్యునరేషన్ ఆఫర్ చేసేందుకు కూడా వెనుకాడలేదట. మొదటి సీజన్ లో ఎన్టీఆర్ 14 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. మరి ఈ బిగ్ డీల్ కు ఎన్టీఆర్ ఒకే చెబుతాడో, నో చెబుతాడో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X