Bigg Boss Telugu7: బిగ్ బాస్ చరిత్రలోనే మరో సంచలనం... ఆ ముగ్గురికి భారీ షాక్... 20 లక్షల ఓట్లు తొలగింపు!

ఎన్నడూ లేనంతగా ఈసారి బిగ్ బాస్ రియాలిటీ ప్రేక్షకులను మరింత ఎక్కువగా అలరించింది. ఉల్టా పుల్టా అంటూ సాగిన ఈ సీజన్ 7.. వారానికో ట్విస్టు, షాక్ ఇస్తూ.. డబుల్ ఎంటర్టైన్మెంటును అందించింది. ఇక ఈ రియాలిటీ గేమ్ షో రేటింగ్ విషయంలో కూడా దుమ్ముదులిపింది. ఇప్పుడు మరి కొద్ది గంటల్లో విన్నర్ ఎవరో తెలియనుంది. ఇదిలా ఉండగా బిగ్ బాస్ శివాజీ, అమర్ దీప్, ప్రశాంత్ లకు ఊహించని షాక్ ఇచ్చాడు. వారికి వచ్చిన ఓట్ల నుంచి 20లక్షల ఓట్లను తొలగించనున్నారు. అదేంటో పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 గత సీజన్స్ తో పోల్చుకుంటే... ఈసారి డబుల్ ఎంటర్టైన్మెంట్, డబుల్ థ్రిల్. ఉల్టా పుల్టా అంటూ సెప్టెంబర్ 3న ప్రారంభం అయిన ఈ షో.. డిసెంబర్ 17న అంటే రేపే ముగియనుంది. ఎన్నో అంచనాలతో మొదలైన ఈ షో.. ఉల్టా పుల్టా అంటూ రసవత్తరంగా సాగింది. ఇక ఈ సీజన్ విన్నర్ ఎవరు అనేది రేపు క్లారిటీ రానుంది. ఈ సీజన్ మొత్తంలో 19 మంది కంటెస్టెంట్స్ హౌస్ లో అడుగుపెట్టగా.. చివరకు టాప్ 6 కంటెస్టెంట్స్ మిగిలారు. వీరిలో ఎవరు విజేతగా నిలుస్తారు అనేది ఆసక్తిని కలిగిస్తుంది.

20 Lakhs Fake Votes Removed From Bigg Boss Telugu 7 Voting Full Details Here

ఇక ఈ సీజన్ మొత్తంలో ఇప్పటివరకు 14 వారాలకు గానూ 13 మంది ఎలిమినేట్ అయిపోయారు. ప్రస్తుతం హౌస్ లో శివాజి, ప్రియాంక జైన్, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, అమర్‌దీప్ చౌదరి, అర్జున్‌ లు టాప్ 6 ఫైనలిస్టులుగా మిగిలారు. ఇప్పటికే వీరి జర్నీ వీడియోలను బిగ్ బాస్ చూపించి.. మరింత హైప్ ఇచ్చారు. ఒక్కోక్కరి జర్నీ వెరె లెవెల్ ఎడిటింగ్ తో ఎలివేషన్స్ ఇచ్చారు.

ఇక బిగ్ బాస్ ఫైనల్ ఓటింగ్ కూడా పూర్తి అయింది. ఈ ఫైనల్ ఓటింగ్ కు భారీగా ఓట్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. ఉన్నది ఆరుగురు కంటెస్టెంట్స్ అయినా.. మెజారిటీ ఓటింగ్ మాత్రం అమర్ దీప్, ప్రశాంత్, శివాజీలకే పడిందని సమాచారం. ఇక వీరు టాప్ 3లో ఉంటారని తెలుస్తోంది. ఇక ప్రియాంక, అర్జున్, యావర్ బాటమ్ 3లో ఉంటారని సమాచారం. మొదట ఈ ముగ్గురు ఎలిమినేట్ అయ్యాకే టాప్ 3లోంచి విన్నర్ ప్రకటిస్తారని తెలుస్తోంది.

అయితే ఓటింగ్ విషయంలో బిగ్ బాస్ ముందుగానే ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ సారి ఈ సీజన్ లో ఫేక్ ఓట్లు లెక్కించబడవు అని ముందే చెప్పుకువచ్చారు. అయితే ఈ సీజన్ లో టాప్ 3 కంటెస్టెంట్స్ కు 20లక్షల దాకా ఫేక్ ఓట్లు నమోదు అయినట్లు తెలుస్తోంది. అయితే వాటిని బిగ్ బాస్ ఫిల్టర్ చేయనున్నారట. సరయైన ఓట్లను మాత్రమే లెక్కించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ సీజన్ లో ఒక్కో కంటెస్టెంట్స్ లక్షల్లో ఓట్లు నమోదు అయ్యాయని తెలుస్తోంది.

ఫేక్ ఓట్లను తొలగించి.. అసలైన విన్నర్ కే బిగ్ బాస్ టైటిల్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఇక ఈసారి సీజన్ విన్నర్ ప్రశాంత్ లేదా శివాజీ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఉల్టా పుల్టా సీజన్ కాబట్టి.. ఏమైనా జరొగచ్చు. చివిరి మినెట్ లోఎవరికి కప్ ఇవ్వనున్నారో వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X