2020 ఉత్తమ సీరియళ్లు ఇవే: మొదటి స్థానం ప్రేమీ విశ్వనాథ్.. సెకెండ్ ప్లేస్‌లో సినీ హీరోయిన్

కరోనా వైరస్ ప్రభావంతో 2020వ సంవత్సరంలో షూటింగులు నిలిచిపోయాయి. దీంతో సినిమా థియేటర్లు దాదాపు తొమ్మిది నెలల పాటు మూతపడ్డాయి. కానీ, బుల్లితెరపై వచ్చే సీరియళ్లు మాత్రం ముందే చిత్రీకరణ జరుపుకున్న కారణంగా కొద్ది రోజులు మాత్రమే బ్రేకిచ్చాయి. ఆ సమయంలోనూ గతంలో ప్రసారం అయిన కంటెంట్‌ను రిపీట్ చేశాయి ఆయా ఛానెళ్లు. ఈ నేపథ్యంలో 2020లో ఊహించని స్థాయిలో ప్రజాదరణను అందుకుని రికార్డులు క్రియేట్ చేశాయి కొన్ని సీరియళ్లు. వంటలక్క కాకుండా మరో హీరోయిన్ రికార్డు కూడా క్రియేట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

సీరియళ్లలో ఆ ఛానెల్‌కే మహిళల పట్టం

సీరియళ్లలో ఆ ఛానెల్‌కే మహిళల పట్టం

‘బ్రాడ్‌కాస్ట్ ఆడియెన్స్ రీసెర్చ్ కౌన్సిల్' (బార్క్) సమాచారం ప్రకారం... మాటీవీలో ప్రసారం అవుతోన్న సీరియళ్లకే తెలుగు ప్రేక్షకుల పట్టం కడుతున్నారు. ఈ కారణంగానే బెస్ట్ సీరియల్స్ జాబితాలో కార్తీక దీపం మొదటి స్థానంలో, ఇంటింటి గృహలక్ష్మీ రెండో నెంబర్‌లో, వదినమ్మ మూడో ప్లేస్‌లో, దేవత నాలుగో ర్యాంకులో, కోయిలమ్మ ఏడో స్థానంలో, మౌనరాగం తొమ్మిదవ ర్యాంకులో నిలిచాయి.

సెకెండ్ ప్లేస్‌లో ప్రముఖ ఛానెల్‌కు చోటు

సెకెండ్ ప్లేస్‌లో ప్రముఖ ఛానెల్‌కు చోటు

తెలుగు ప్రేక్షకులు మాటీవీ తర్వాత ఎక్కువగా ఆదరిస్తున్న ఛానెల్ జీ తెలుగు. ఇందులో ప్రసారం అవుతోన్న సీరియళ్లను కూడా బాగానే తిలకిస్తున్నారు మహిళలు. దీంతో ఉత్తమ సీరియళ్ల జాబితాలో జీ తెలుగులో ప్రసారం అవుతోన్న ‘ప్రేమ ఎంత మధురం' ఐదవ స్థానంలో, ‘త్రినయని' ఆరవ నెంబర్‌లో, ‘నెంబర్ వన్ కోడలు' పదవ స్థానాన్ని దక్కించుకుని సత్తా చాటాయి.

ఆ ఛానెల్ నుంచి ఒక్క సీరియల్‌కు ప్లేస్

ఆ ఛానెల్ నుంచి ఒక్క సీరియల్‌కు ప్లేస్

బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్‌గా పేరొందిన ఈటీవీలోనూ ఎన్నో సీరియళ్లు ప్రసారం అవుతున్నాయి. గతంలో ఈ ఛానెల్‌లో ప్రసారం అయిన ధారావాహికలకే ప్రధాన్యం ఇచ్చేవారు మహిళలు. అందుకే అందులో వచ్చే సీరియళ్లు ఏళ్ల తరబడి ప్రసారం అయ్యాయి. అయితే, ఈ సారి మాత్రం ఈటీవీ నుంచి ఒకే ఒక్క సీరియల్ ‘నా పేరు మీనాక్షి' (ఎనిమిదవ స్థానం) మాత్రమే టాప్ 10లో ఉంది.

ఫేమస్ ఛానెల్ నుంచి ఒక్కటి కూడా లేదు

ఫేమస్ ఛానెల్ నుంచి ఒక్కటి కూడా లేదు

తెలుగులో ఎంతో ఫేమస్ అయిన ఛానెళ్లో జెమినీ టీవీ ఒకటి. గతంలో దీని నుంచి ఎన్నో గొప్ప గొప్ప సీరియళ్లు వచ్చాయి. ఇప్పుడు కూడా పదుల సంఖ్యలో ధారావాహికలు ప్రసారం అవుతున్నాయి. కానీ, 2020 ఉత్తమ సీరియళ్ల జాబితాలో ఒక్కటంటే ఒక్కటి కూడా స్థానం దక్కించుకోలేదు. అయితే, ఈ ఛానెల్‌లో ప్రసారం అయిన సినిమాలు మాత్రం రికార్డులు క్రియేట్ చేశాయి.

ఈ ఏడాది ఆ సీరియల్‌దే మొదటి స్థానం

ఈ ఏడాది ఆ సీరియల్‌దే మొదటి స్థానం

స్టార్‌మాలో ప్రసారం అవుతోన్న ‘కార్తీక దీపం' ఈ ఏడాది కూడా సత్తా చాటింది. ‘కరుతముత్తు' అనే మలయాళ సీరియల్‌కు రీమేక్‌గా వస్తున్న ఇందులో ప్రేమీ విశ్వనాథ్ ప్రధాన పాత్ర పోషిస్తోంది. నిరుపమ్ హీరోగా చేస్తున్నాడు. మొదటి నుంచీ ప్రేక్షకాదరణ పొందిన దీనికి భారీ స్థాయిలో రేటింగ్ వస్తోంది. అందుకే ఈ ఏడాది ఉత్తమ సీరియళ్ల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది.

రికార్డ్ క్రియేట్ చేసిన సీనియర్ హీరోయిన్

రికార్డ్ క్రియేట్ చేసిన సీనియర్ హీరోయిన్

ప్రముఖ సీనియర్ సినీ హీరోయిన్ కస్తూరి ప్రధాన పాత్రను పోషిస్తోన్న సీరియల్ ‘ఇంటింటి గృహలక్ష్మి'. ఇది కూడా స్టార్‌మాలోనే ప్రసారం అవుతోంది. ఇటీవలే ప్రారంభం అయిన ఈ సీరియల్‌కు విశేష స్పందన రావడంతో పాటు రికార్డు స్థాయి రేటింగ్ వస్తోంది. ఫలితంగా ఏడాది మధ్యలో మొదలైనప్పటికీ.. 2020 ఉత్తమ సీరియళ్ల జాబితాలో ఏకంగా రెండో స్థానం దక్కించుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X