2020 బెస్ట్ టీవీ షోల లిస్ట్ ఇదే: మొదటి రెండు స్థానాలూ వాళ్లవే.. అందరికీ షాకిచ్చిన పాత కార్యక్రమం!

ఏ సీజన్ అయినా.. ఎటువంటి పరిస్థితులు నెలకొన్నా బుల్లితెరపై వచ్చే కార్యక్రమాలకు మాత్రం స్పందన ఒకే రకంగా ఉంటుంది. ఇక, ఈ ఏడాది లాక్‌డౌన్ కారణంగా సినిమాల విడుదల ఆగిపోవడంతో తెలుగు ప్రేక్షకులు బుల్లితెరపై బాగా ఫోకస్ చేశారు. ఫలితంగా టెలివిజన్‌లో ప్రసారం అయ్యే కార్యక్రమాలకు ఊహించని రీతిలో స్పందన వచ్చింది. దీంతో అత్యధికంగా టీఆర్పీ రేటింగ్ సాధించాయి కొన్ని కార్యక్రమాలు. ఈ క్రమంలోనే కొన్ని రికార్డులు సైతం క్రియేట్ అయ్యాయి. 2020 ముగింపు దశకు చేరుకున్న సందర్భంగా ఈ ఏడాది టాప్‌లో నిలిచిన షోల జాబితాను చూద్దాం పదండి!

మరోసారి హవాను చూపెట్టుకున్న షో

మరోసారి హవాను చూపెట్టుకున్న షో

దాదాపు ఎనిమిదేళ్లుగా తెలుగు ప్రేక్షకులకు మజాను పంచుతూ నెంబర్ వన్ కామెడీ షోగా వెలుగొందుతోంది జబర్ధస్త్. వేరే ఛానెళ్ల నుంచి పోటీగా ఎన్నో షోలు పుట్టుకొస్తున్నా.. ప్రతి వారం 6 పైచిలుకు రేటింగ్ సాధిస్తూ దూసుకుపోతోంది. ఫలితంగా ప్రతి ఏడాది హవాను చూపిస్తోంది. ఇక, 2020లోనూ అదే కంటిన్యూ చేస్తూ తెలుగులోనే బెస్ట్ షోల జాబితాలో టాప్‌లో నిలిచింది.

ఈ ఏడాది రెండో స్థానం కూడా వాళ్లదే

ఈ ఏడాది రెండో స్థానం కూడా వాళ్లదే

2020 బెస్ట్ టీవీ షోల జాబితాలో జబర్ధస్త్ నెంబర్ వన్ స్థానంలో నిలవగా, ఎక్స్‌ట్రా జబర్ధస్త్ రెండో స్థానంలో నిలిచి సత్తా చాటింది. శుక్రవారం ప్రసారం అయ్యే ఈ షోలో సుడిగాలి సుధీర్ - రష్మీ గౌతమ్ ట్రాకును బాగా హైలైట్ చేస్తుంటారు. దీనితో పాటు సరికొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ కారణంగానే ఎక్స్‌ట్రా జబర్ధస్త్ కూడా మరోసారి హవాను చూపించి టాప్ 2లో నిలిచింది.

సత్తా చాటిన డ్యాన్స్ షో... రికార్డు బ్రేక్

సత్తా చాటిన డ్యాన్స్ షో... రికార్డు బ్రేక్

ఇక, ఈ ఏడాది సత్తా చాటిన టీవీ షోలలో ‘ఢీ' కూడా ఒకటి. తెలుగులో వరుస సీజన్లతో దూసుకుపోతోన్న ఈ డ్యాన్స్ రియాలిటీ షో.. ఈ ఏడాది 12వ సీజన్‌గా ‘ఢీ ఛాంపియన్స్'ను ప్రసారం చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వచ్చింది. ఫలితంగా మూడో స్థానంలో నిలిచిందీ షో. మరీ ముఖ్యంగా ఇందులో పండు వేసిన ‘నక్కిలీసు గొలుసు' పాట రికార్డులు క్రియేట్ చేసింది.

ఫస్ట్ సీజన్ హిట్.. రెండోది కూడా అదే

ఫస్ట్ సీజన్ హిట్.. రెండోది కూడా అదే

జబర్ధస్త్‌కు పోటీగా వచ్చిన ఎన్నో షోలు మధ్యలోనే ఆగిపోయాయి. అయితే, ఈ ఏడాది జీ తెలుగులో ప్రారంభం అయిన ‘అదిరింది' మాత్రం దానికి సరైన పోటీని ఇచ్చి సత్తా చాటింది. ఈ క్రమంలోనే మంచి రేటింగ్‌తో దూసుకుపోయింది. ఇలా ఫస్ట్ సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసిందీ షో. ఆ తర్వాత ‘బొమ్మ అదిరింది' పేరిట రెండో సీజన్‌ను ప్రారంభించారు. ఇది నాలుగో స్థానంలో ఉంది.

సుమ షోకు విశేష స్పందన.. ట్రెండింగ్

సుమ షోకు విశేష స్పందన.. ట్రెండింగ్

2020 తెలుగు బెస్ట్ టీవీ షోల జాబితాలో సుమ హోస్ట్ చేస్తోన్న ‘క్యాష్' కూడా చోటు దక్కించుకుంది. ప్రతి శనివారం ప్రసారం అయ్యే ఈ షోకు సినీ, బుల్లితెర ప్రముఖులు గెస్టులుగా వస్తుంటారు. ఇందులోకి వచ్చిన సెలెబ్రిటీలను సుమ ఓ ఆట ఆడుకుంటుంది. ఫలితంగా ఈ షో యూట్యూబ్‌లో ట్రెండ్ అవడంతో పాటు రేటింగ్ కూడా సాధిస్తుంది. తద్వారా ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉంది.

వాటికి కూడా బాగానే.. సక్సెస్‌ఫుల్‌గా

వాటికి కూడా బాగానే.. సక్సెస్‌ఫుల్‌గా

ఇక, ఈ ఏడాది అన్ని ఛానెళ్లలో కలిపి చాలా షోలు ప్రసారం అయ్యాయి. జీ తెలుగులో ‘సరిగమప.. నెక్ట్స్ సింగింగ్ ఐకాన్', స్టార్ మాలో ‘ఇస్మార్ట్ జోడీ', ఈటీవీలో ‘నువ్వు రెడీ నేను రెడీ' సహా ఎన్నో కొత్త షోలు మొదలయ్యాయి. వీటిలో సరిగమపకు మంచి గుర్తింపు వచ్చింది. ఇందులో యశస్వీ అనే సింగర్ పాడిన పాట దేశ వ్యాప్తంగా ట్రెండ్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

అందరికీ షాకిచ్చిన పాత కార్యక్రమం!

అందరికీ షాకిచ్చిన పాత కార్యక్రమం!

తెలుగులో ఎన్ని న్యూస్ ఛానెళ్లు ఉన్నా... ఈటీవీ ప్రైమ్ టైమ్‌లో ప్రసారం అయ్యే వార్తలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే ప్రతి వారం ఈ కార్యక్రమం సత్తా చాటుతోంది. ఫలితంగా బుల్లితెర కార్యక్రమాలు, సీరియళ్లకు సవాల్ విసురుతూ రేటింగ్ సాధిస్తోంది. ఫలితంగా సీరియళ్లతో సమానంగా ఐదో స్థానంలో, షోల జాబితాలో ఆరో స్థానంలో నిలిచింది. న్యూస్ విభాగంలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X