Don't Miss!
- News
union budget: మరికొద్ది గంటల్లో పార్లమెంటులో కేంద్ర బడ్జెట్, ఆశలు, అంచనాలు
- Finance
gst: రికార్డు స్థాయిలో GST వసూళ్లు.. ఇప్పటివరకు ఇదే రెండవ అత్యధికం
- Sports
WPL 2023 వల్ల భారత మహిళా క్రికెట్ దశ మారుతోంది: హర్మన్‌ప్రీత్ కౌర్
- Lifestyle
'ఆ' సమయంలో ఈ ప్రదేశాల్లో మీ భర్త & భార్యను టచ్ చేయండి...ఆ ఆనందం మరోస్థాయిలో ఉంటుంది!
- Technology
ఆపిల్ నుంచి ఫోల్డబుల్ ఐఫోన్ లాంచ్ వివరాలు! కొత్త ఫీచర్లు!
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
2020లో రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలివే: మహేశ్, చరణ్ అరుదైన ఘనత.. లిస్టులో బాలయ్య కూడా!
2020 సంవత్సరంలో కరోనా వైరస్ చూపించిన ప్రభావం అంతా ఇంతా కాదు. రాజు బీద తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఇది అతలాకుతలం చేసేసింది. దీని వల్ల షూటింగ్‌లు నిలిచిపోవడంతో పాటు థియేటర్లు మూత పడడంతో సినీ పరిశ్రమకు సైతం భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. అయితే, బుల్లితెరకు మాత్రం విపరీతమైన స్పందన వచ్చింది.
ఈ నేపథ్యంలోనే ఎన్నో సినిమాలు ఊహించని రీతిలో రేటింగ్ సాధించాయి. ఇందులో మహేశ్ బాబు మూవీ రికార్డు క్రియేట్ చేసింది. అలాగే, చరణ్ ఖాతాలోనూ ఓ రేర్ ఫీట్ వచ్చి చేరింది. ఇక, ఈ జాబితాలో బాలయ్య ఫ్లాప్ సినిమా కూడా ఉంది. 2020 పూర్తవుతోన్న సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ మీకోసం!

మొదటి, మూడో స్థానాల్లో మహేశ్ మూవీ
సూపర్ స్టార్ మహేశ్ బాబు - సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు'. గత సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ మధ్య బుల్లితెరపై ప్రసారం అయిన ఈ మూవీ రికార్డు స్థాయిలో 29.40 రేటింగ్‌తో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రెండో సారి ప్రసారమైనప్పుడు 17.40 రేటింగ్ అందుకుని థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.

రెండో స్థానంలో అల.. వైకుంఠపురములో
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో వచ్చిన చిత్రం ‘అల.. వైకుంఠపురములో'. పోయిన సంక్రాంతి సీజన్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఫలితంగా భారీ లాభాలనూ అందుకుంది. కొద్ది రోజుల క్రితం బుల్లితెరపై ప్రసారమైన ‘అల'కు ఏకంగా 23.40 రేటింగ్ వచ్చింది. ఫలితంగా రెండో ర్యాంక్‌ను సాధించింది.

నాలుగు, ఐదు స్థానాల్లో మెగా హీరోలు
2020లో టాప్ రేటింగ్ సాధించిన తెలుగు సినిమాల జాబితాలో నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు మెగా హీరోలు చిరంజీవి, సాయి ధరమ్ తేజ్. సుప్రీమ్ హీరో నటించిన ‘ప్రతిరోజూ పండగే' చిత్రం బుల్లితెరపై 15.13 టీఆర్పీ రేటింగ్ సాధించి నాలుగో స్థానంలో ఉండగా.. మెగాస్టార్ సినిమా ‘సైరా: నరసింహారెడ్డి' 11.80 రేటింగ్‌ను అందుకుని ఐదో స్థానాన్ని ఆక్రమించింది.

తర్వాతి రెండు స్థానాల్లో వెంకీ, లీడర్‌లు
విక్టరీ వెంకటేష్ - నాగ చైతన్య కాంబినేషన్‌లో బాబీ తెరకెక్కించిన చిత్రం ‘వెంకీ మామ' 9..80 టీఆర్పీ రేటింగ్‌ను అందుకుని ఈ జాబితాలో ఆరో స్థానంలో చోటు దక్కించుకుంది. అలాగే, నేచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కే కుమార్ తెరకెక్కించిన ‘గ్యాంగ్ లీడర్' సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచినా.. బుల్లితెరపై మాత్రం 8.66 రేటింగ్‌తో ఏడో స్థానాన్ని అందుకుని సత్తా చాటింది.

చరణ్ ఫ్లాప్ సినిమాకు రికార్డు స్థాయిలో
ఇక, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో వచ్చిన ‘వినయ విధేయ రామ' థియేటర్లలో భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నప్పటికీ.. బుల్లితెరపై మాత్రం ఎప్పుడు ప్రసారం చేసినా సూపర్ హిట్‌గా నిలుస్తోంది. 2020లో టెలివిజన్‌లో రెండు సార్లు ప్రసారం అయిన ఈ చిత్రం వరుసగా 8.16, 7.97 రేటింగ్స్ అందుకుని ఎనిమిది, తొమ్మిదో ర్యాంక్‌లో ఉంది.

టాప్ -10లో నందమూరి బాలయ్య కూడా
గత ఏడాది నందమూరి బాలకృష్ణ ఏకంగా మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అందులో కేఎస్ రవికుమార్ తెరకెక్కించిన ‘రూలర్' ఒకటి. ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు బోల్తా కొట్టింది. అయినప్పటికీ బుల్లితెరపై మాత్రం సత్తా చాటింది. దీనికి 7.50 రేటింగ్ దక్కింది. తద్వారా ఈ జాబితాలో పదో స్థానంలో నిలిచింది.