Don't Miss!
- Finance
7th cpc: ప్రభుత్వ ఉద్యోగులకు పెరగనున్న జీతాలు.. ఎప్పుడు, ఏమేమి పెరుగుతాయో తెలుసా..!
- Sports
అయ్యర్ స్థానంలో అతన్ని ఆడించండి.. శుభ్మన్ గిల్ మాత్రం వద్దు: దినేశ్ కార్తీక్
- Lifestyle
మీ సెక్స్ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి ఇలా చేయండి..సెక్స్ లో ఆనందాన్ని పొందండి!
- News
ఉత్తరాంధ్రలో టీడీపీకి అగ్నిపరీక్ష: ఆ నియోజకవర్గం అభ్యర్థి మార్పు- బాలయ్య ప్రచారం చేసినా..
- Technology
ఐఫోన్ 14 పై రూ.12000 వరకు ధర తగ్గింది! ఆఫర్ ధర ,సేల్ వివరాలు!
- Travel
ఏపీలో ఆధ్యాత్మిక పర్యాటకానికి టూరిజం శాఖ సరికొత్త రూట్ మ్యాప్!
- Automobiles
మొదటిసారి పెరిగిన 'మహీంద్రా స్కార్పియో క్లాసిక్' ధరలు - కొత్త ధరలు ఇక్కడ చూడండి
హిందీలో టెలివిజన్ లో కూడా కార్తికేయ సంచలనం.. ప్రభాస్ సినిమా కంటే ఎక్కువ రేటింగ్
టాలీవుడ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ వరుసగా డిఫరెంట్ సినిమాలతో తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళుతున్నాడు. ఇక అతని కెరీర్ ను మరో రేంజ్ కు పెంచిన సినిమాలలో కార్తికేయ ఒకటి. ఇక ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన కార్తికేయ 2 కూడా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. కేవలం తెలుగులోనే కాకుండా ఈ సినిమా దేశవ్యాప్తంగా కూడా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.
ముఖ్యంగా హిందీలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అసలు హిందీలో మొదట కేవలం ఒక 50 థియేటర్లలో విడుదల చేస్తే రెండవ రోజుకి ఆ సంఖ్య వందల సంఖ్యలో పెరిగిపోయింది. ఇక తర్వాత వేల సంఖ్యలోకి కూడా పెరిగింది. ఆ విధంగా కార్తికేయ 2 సినిమాకు దేశవ్యాప్తంగా కూడా మంచి గుర్తింపు లభించింది. అయితే ఆ సినిమా టెలివిజన్లో కూడా అదే తరహాలో మంచి గుర్తింపు అందుకోవడం విశేషం.

ఇటీవల విడుదల చేసిన టాప్ టీవీ ప్రీమియర్ రేటింగ్స్ లలో సౌత్ ఇండియన్ డబ్బింగ్ సినిమాల నుంచి కార్తికేయ 2 టాప్ లిస్టులో నిలిచింది. ఈ లిస్టులో మొదట అత్యధిక రేటింగ్ అందుకున్న సినిమాగా RRR నిలిచింది. ఇక ఆ తర్వాత రెండవ స్థానంలో 4.35 రేటింగ్ తో పుష్ప ఉండగా 3.84 రైటింగ్ తో కేజీఎఫ్ చాప్టర్ 2 నిలిచింది. ఇక వీటి తర్వాత 1.7 రేటింగ్ తో నాలుగో స్థానంలో కార్తికేయ 2 నిలిచింది.
ఇక ఈ సినిమాల తరువాత ప్రభాస్ రాదేశ్యామ్ 1.45 రేటింగ్ తో నిలిచింది. అనంతరం లైగర్ సినిమాకు కూడా అదే తరహాలో రేటింగ్ వచ్చింది. ఈ విధంగా అయితే టాప్ లిస్టులో అత్యధిక టిఆర్పి రేటింగ్ అందుకున్న డబ్బింగ్ సినిమాలలో సౌత్ ఇండస్ట్రీ నుంచి కార్తికేయ నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఇక లైగర్ తర్వాత ఏడవ స్థానంలో వాలిమై 1.08 రేటింగ్ తో ఉంది. 8వ స్థానంలో 0.87 రేటింగ్ తో కమల్ హాసన్ విక్రమ్ సినిమా నిలిచింది. ఇక ఆ తర్వాత తొమ్మిదవ స్థానంలో మేజర్ సినిమా 0.73 రేటింగ్ దక్కించుకుంది. అనంతరం విక్రాంత్ 0.70 రేటింగ్ అందుకొని టాప్ టెన్ లో చివరి స్థానంలో నిలిచింది.