Janaki Kalaganaledu Serial Weekly Roundup: అఖిల్ కొడుకును కాపాడిన జానకి.. కిడ్నాప్ కేసులో న్యూ ట్విస్ట్!

జానకి కలగనలేదు సీరియల్ మొదట కాస్త నిరాశకు గురి చేసినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే ఏప్రిల్ 24 నుంచి ఏప్రిల్ 29 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయో చూద్దాం..

ఎప్రిల్ 23వ ఎపిసోడ్: అఖిల్ అత్తమామలు కూడా అప్పుడే వస్తారు. మీ కుటుంబ సభ్యులు ఎవరు రాలేదని అడిగినప్పుడు ఎందుకు అనవసరంగా చెప్పడం.. మళ్ళీ ఈ కేసు విషయాల గురించి గుచ్చి గుచ్చి అడుగుతూ ఉంటారు అని ఆ బాధ తట్టుకోవడం కంటే పిలవకపోవడమే బెటర్ అని వాళ్ళు మరొక విధంగా మాట్లాడుతుంటారు. ఇక మరోవైపు జానకి తన భర్తను ఇంటికి తీసుకురావాలి అని మనోహర్ ను బ్రతిమాలే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ ఎస్సై మనోహర్ మాత్రం ఏమాత్రం ఒప్పుకోడు. ఈ క్రమంలో ఆమె రామచంద్ర గారి తల్లి ఆరోగ్యం ఏ మాత్రం బాగోలేదని మెడికల్ సర్టిఫికెట్స్ కూడా లాయర్ ద్వారా చూపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ నేను ఒప్పుకోను అని ఎస్సై చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే అతనికి ఒక ఫోన్ కాల్ వస్తుంది. అసలు ఇంతకు ఆ ఫోన్ కాల్ ఎవరు చేశారు? ఎస్ఐ మనోహర్ రామచంద్రకు బేయిల్ ఇస్తాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్లు చూడాలి.

 Janaki Kalaganaledu

ఏప్రిల్ 25వ ఎపిసోడ్: రామచంద్ర జానకి త్వరగా వేడుకకు సిద్ధం కావాలని రెడీ అవ్వండి అని గోవిందరాజులు చెబుతాడు. ఇక రామ అలాగే జానకి బెడ్ రూమ్ లోకి వెళ్ళగానే ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఇక రామచంద్ర అయితే తన భార్యను హగ్ చేసుకొని ఎంతగానో సంతోషిస్తాడు. అయితే మరోవైపు జానకి ఎదుట మరో ప్రమాదం పొంచి ఉంటుంది. గతంలో ఒక అమ్మాయిని ఏడిపించినందుకు అరెస్టు చేసిన వ్యక్తి జానకి పై రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటాడు. అందుకోసం ప్రత్యేకంగా అతను జానకి ఇంటి బయట కాచుకొని ఉంటాడు. ఏదో ఒకటి చేసి జానకిని ఇబ్బంది పెట్టాలి అని అనుకుంటాడు. అయితే అదే సమయంలో జానకి అఖిల్ కొడుకుని ఎత్తుకొని బయటకు వస్తుంది. అయితే అప్పుడు బాబు వాంతులు చేసుకోవడంతో జానకి బాబును బయట పడుకోబెట్టి లోపలికి వెళుతుంది. ఇక ఆ బాబును ఎత్తుకొని పోవాలి అని అతను ప్రయత్నం చేస్తుంటాడు. మరి జానకి అతన్ని ఎలా అడ్డుకుంటుందో చూడాలి.

 Janaki Kalaganaledu

ఏప్రిల్ 26వ ఎపిసోడ్ :అఖిల్ తీవ్ర మనస్తాపంతో మాట్లాడుతూ ఉండడంతో ఒక పాప మాత్రం ఏ బాబు అంకుల్ ఇప్పటిదాకా ఒక వ్యక్తి వచ్చి బాబును తీసుకువెళ్లాడు అని ఆ పాప చెబుతుంది. ఇక జానకి రామచంద్ర వెంటనే ఆ పాపను మరిన్ని వివరాలు అడిగి తెలుసుకోవాలని అనుకుంటారు. కానీ ఆ పాప తల్లి వచ్చి ఎందుకు నా పాపను మళ్లీ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పాలని అనుకుంటున్నారా? అని మా పాపకు ఏమీ తెలియదు అని మాట్లాడుతుంది. దీంతో మళ్ళీ అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక లాభం లేదు అని పోలీస్ స్టేషన్కు వెళ్లి కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటారు. కానీ అక్కడ ఎస్సై మనోహర్ జానకి పై కోపంతో కనిపిస్తూ ఉంటాడు. మరి ఈ విషయంలో అతను జానకికి ఎలాంటి సమాధానం ఇస్తాడు అసలు బాబును జానకిని తీసుకు వస్తుందా? లేదా అనే విషయం తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

 Janaki Kalaganaledu

ఏప్రిల్ 27వ ఎపిసోడ్: ఇదంతా మీ వల్ల జరిగింది అంటూ జానకి పై అఖిల్ మండిపడుతూ ఉంటాడు. అయితే గోవిందరాజులు అతని కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినప్పటికీ.. పోయింది నా బాబు కదా మీకు ఎందుకు బాధ ఉంటుంది అని.. నా బాబు దొరక్కపోతే నీ మీద పోలీస్ కంప్లైంట్ నేను ఇస్తాను అని అతను మరింత కోపంగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే మరోవైపు బాబును మోహన్ ఎత్తుకుపోగా అతను చివరికి ఒక ఖాళీ స్థలంలో పెడతాడు. అయితే అక్కడ ఒక అడుక్కునే మహిళ ఆ బాబును చూసి ఎత్తుకుంటుంది. చివరికి నేను పెంచుకుంటాను అని ఆమె అనుకుంటూ బాబును తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ క్రమంలో ఇంట్లో వాళ్ళు అందరూ కూడా బయట బాబును వెతకాలని ప్రయత్నం చేస్తారు. ఒకచోట అఖిల్ వెతుకుతూ ఉండగా.. అప్పుడే ఆడుక్కునే మహిళ వచ్చి బాబుకు పాలు పట్టాలని డబ్బులు ఇవ్వాలి అని అడుగుతుంది. కానీ అతను మాత్రం ఆమెను ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నా టెన్షన్ లో నేను ఉన్నాను అని అంటాడు. మరి చివరికి అతను తన కొడుకుని చూస్తాడా లేదా అనేది తదుపరి ఎపిసోడ్ లో చూడాలి.

 Janaki Kalaganaledu

ఏప్రిల్ 28వ ఎపిసోడ్ : బాబు నీకు ఎక్కడ దొరికాడు అని ఆ మహిళ అడగడంతో ఒకచోట పడిపోయి ఉండడంతో నేను తీసుకున్నాను అని అంటుంది. ఆమెకు కృతజ్ఞతలు చెప్పి జానకి రామచంద్ర ఇంటికి బయలుదేరుతారు. అయితే అదే సమయంలో అఖిల్ ఇంటికి వచ్చి బాబు దొరకలేదు అని చెప్పడంతో జెస్సి ఒక్కసారిగా తల్లడిల్లిపోతుంది. అయితే జానకి పై పోలీస్ కేసు పెట్టాలి అని అతను బయలుదేరుతాడు. ఇక ఇంతలోనే జానకి బాబును తీసుకువస్తుంది. దీంతో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఈ క్రమంలో అఖిల్ పోలీస్ స్టేషన్కు వెళ్లడానికి సిద్ధమైనట్లు వెన్నెల జానకికి చెబుతుంది. ఇక విషయాలను మర్చిపోదామని జానకి చెబుతుంది. ఇక ఆ ఘటన నుంచి బయటకు వచ్చాక మరోవైపు అల్ కోడలికి మల్లెపూలు మామిడి పండ్లు ఇస్తుంది. ఇది రామచంద్ర కు ఇవ్వు అని చెబుతోంది. మరోసారి కొడుకు కోడలి కోసం ఆమె శోభనం ఏర్పాట్లు చేసినట్లు అర్థమవుతుంది. ఇక జానకి భవిష్యత్తు ఎలా ఉంటుందో తదుపరి ఎపిసోడ్లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X