Janaki Kalaganaledu Serial Weekly Roundup: మరింత కష్టపడుతున్న రామ.. మళ్ళీ గొడవలు పెట్టేలా మల్లిక ప్లాన్

జానకి కలగనలేదు సీరియల్ జనవరి మొదటి వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జనవరి 9 నుంచి జనవరి 13 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి. అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

జనవరి 16వ ఎపిసోడ్

జనవరి 16వ ఎపిసోడ్

జానకి అత్త దగ్గరకు వచ్చి ఏం జరిగింది అని అడుగుతుంది. కానీ అత్తగారు మాత్రం జానకి తో మాట్లాడరు. పక్కనే ఉన్న గోవిందరాజులు టాబ్లెట్స్ అయిపోయాయి అని చెబుతాడు. ఇక నేను తెస్తాను అని జానకి అంటుంది. ఇక జ్ఞానాంబ జానకి చేతికి టాబ్లెట్స్ వివరాలు ఇవ్వకుండా ఒక టేబుల్ మీద పేపర్ పెడుతుంది. పరవాలేదు అని తీసుకున్న జానకి టాబ్లెట్స్ తీసుకురావాలని అనుకుంటుంది. కానీ చేతిలో డబ్బులు ఉండవు. ఇక మల్లిక భర్త విష్ణు దగ్గర కొన్ని డబ్బులు అడగాలని అనుకుంటుంది. అయితే ఇంతలోనే వచ్చిన మల్లికా మా దగ్గర డబ్బులు లేవు అని అసలు ఉన్న షాప్ కూడా లేదు అని అంటుంది. ఇక వెంటనే వచ్చిన జ్ఞానాంబ షాప్ లేదా అని ప్రశ్నిస్తుంది.

జనవరి 17వ ఎపిసోడ్

జనవరి 17వ ఎపిసోడ్

ఇంట్లో అందరూ కూడా ఏదో ఒక విధంగా కష్టపడుతూ ఉండడంతో చిన్న కుమారుడు అఖిల్ మాత్రం ఇంట్లో ఫోన్లో గేమ్ ఆడుతూ ఉంటాడు. వెంటనే అతని భార్య జెస్సి అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అందరూ ఏదో ఒక పనిలో ఉన్నారు మీరు మాత్రమే ఖాళీగా ఉన్నారు అని అంటుంది. ఇక వారి మధ్యలో గొడవ జరుగుతూ ఉండగా అప్పుడే ఇంట్లోకి జెస్సీ తండ్రి వస్తాడు. ఇక అతను తన కూతురిని ఇంట్లో నుంచి తీసుకువెళ్లాలని అనుకుంటాడు. అయితే జెస్సి మాత్రం ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని నేను రాలేను అని మా అత్తయ్య గారు చెబితే నేను ఇంటికి వస్తాను అని సమాధానం ఇస్తుంది. అయితే జెస్సి తండ్రి ఊహించిన విధంగా జానకి పై కొంత కోపాన్ని వ్యక్తం చేస్తాడు. నువ్వే కదా నా కూతురికి పెళ్లి చేసింది నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మ.. ఈ పరిస్థితి వస్తుంది అని నేను ఊహించలేదు అని అసహనంతో మాట్లాడుతూ ఉంటాడు.

జనవరి 18వ ఎపిసోడ్

జనవరి 18వ ఎపిసోడ్

అయితే ఆ ఫంక్షన్ కు సంబంధించిన వారు జ్ఞానాంబను కూడా పిలుస్తారు. బారసాలు ఉందని నా మనవడిని అ మీరే ఆశీర్వదించాలి అని ఒక మహిళ చెప్పడంతో జ్ఞానాంబ సరే వస్తాను అని చెబుతుంది. అయితే అదే వేడుకకు జ్ఞానాంబ శత్రువు సునంద కూడా వస్తుంది. ఇక జానకి ఆ క్యాటరింగ్ లో పనిచేస్తూ ఉండడంతో కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ ఈ విధంగా ప్లేట్లు తుడుచుకుంటూ ఉందా అని వెక్కిరిస్తూ ఉంటుంది. ఆమెకు కూడా జానకి కౌంటర్ ఇస్తుంది.

జనవరి 19వ ఎపిసోడ్

జనవరి 19వ ఎపిసోడ్

మా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటామని స్వీట్ షాప్ ఉన్న వ్యక్తి చెబుతూ ఉంటాడు. ఇక జానకి వచ్చి ఆ తర్వాత రామచంద్రను అక్కడి నుంచి తీసుకెళుతుంది. ఇక ఇంటికి రాగానే జ్ఞానాంబ పోయిన పరువు గురించి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే ఊరి నుంచి చిన్న కూతురు వెన్నెల కూడా వస్తుంది అని తెలుస్తుంది. ఇంట్లో పరిస్థితులు తెలిస్తే వెన్నెల చాలా బాధపడుతుంది అని అందరూ అనుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు మల్లిక కఠినంగా మాట్లాడుతు ఉండడంతో జానకి ఆమెకు అర్థమయ్యేలా చెప్పాలని అనుకుంటుంది.

 జనవరి 20వ ఎపిసోడ్

జనవరి 20వ ఎపిసోడ్

జానకి తన భర్త కోసం గుమ్మం బయట ఎదురు చూస్తూ ఉండగా అప్పుడే రామచంద్ర వస్తాడు. ఇక కాళ్లు కడుక్కొని రండి అని భోజనం పెడతాను అని చెబుతుంది. ఇక రామచంద్ర ఇంట్లోకి రాగానే అందరూ కూడా హాల్లో పడుకుని ఉండడం బాధను కలిగిస్తుంది. ఒకప్పుడు మన ఇంట్లో అందరూ ఎవరి గదిలో వాళ్ళు ఉండేవారు అని ఇప్పుడు నా వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని బాధపడుతూ ఉంటాడు. ఇక తన గదిలోకి వెళ్లి భోజనం తినడానికి కూడా అతనికి ఆసక్తిగా అనిపించదు. ఇక మరోవైపు అఖిల్ అయితే ఇంట్లో ఎన్ని జరుగుతున్నా కూడా పట్టించుకోకుండా వీడియో గేమ్స్ ఆడుకుంటూ ఉంటాడు. దీంతో వెన్నెల అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ అతనికి మాత్రం కోపం వస్తుంది ఇక ఇలా ఉండగా మల్లికా మళ్ళీ గొడవలు సృష్టించాలని అనుకుంటుంది. కానీ జానకి మాత్రం మల్లికను అడ్డుకోవాలని ఆలోచిస్తుంది.

 జనవరి 21వ ఎపిసోడ్

జనవరి 21వ ఎపిసోడ్

అతని భార్య మల్లిక మాత్రం అందుకు అసలు ఒప్పుకోదు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి అని తెలిస్తే మళ్లీ అందరూ మన దగ్గరికి వస్తారు అని ప్రతి పండుగకు మీ అన్నయ్య ఎలాగో బట్టలు తీస్తున్నాడు అలాగే ఈసారి కూడా అతనే అందరికీ తెస్తాడు అని మీరు అనవసరంగా ఈ డబ్బులు ఖర్చు పెట్టవద్దు అని పొగరుగా మాట్లాడుతుంది. దీంతో విష్ణు ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉంటాడు. ఇక మరోవైపు వెన్నెల కిచెన్లో పనిచేసుకుంటూ ఉంటే మెల్లగా అక్కడికి వచ్చిన మల్లికా ఆమెకు ఏదో ఒకటి చెప్పి ఇక్కడ నుంచి పంపించేయాలని అనుకుంటుంది. నువ్వు అనవసరంగా ఇక్కడ కష్టపడడం కంటే మీ నానమ్మ ఇంటికి వెళ్లిపోవచ్చు కదా అని అనవసరమైన అనుమానాలు కలిగిస్తూ ఉంటుంది. ఇక ఆ విషయాన్ని పసిగట్టిన జానకి మల్లికతో మాట్లాడాలని అనుకుంటుంది. ఎందుకు మల్లికా నువ్వు లేనిపోని విధంగా అనవసరంగా అందరికీ చెడు ఆలోచనలను కలిగిస్తున్నావు అని ప్రశ్నిస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X