Janaki Kalaganaledu Serial Weekly Roundup: మళ్ళీ దారిలోకి వచ్చిన ఫ్యామిలీ.. అఖిల్ తప్పుడు ఆలోచనలు!
జానకి కలగనలేదు సీరియల్ ఫిబ్రవరి మొదటి వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త నీరసంగా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే జనవరి 29 నుంచి ఫిబ్రవరి 3 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

జనవరి 29వ ఎపిసోడ్
తర్వాత రామచంద్ర కూడా అప్పుడే ఇంట్లోకి వస్తుండగా జానకి అతనికి ఎదురు పడుతుంది. ఉద్యోగం పోయింది అని కూడా జానకి రామచంద్ర తో మాట్లాడుతూ ఉంటుంది. ఇక రామచంద్ర జరిగిన విషయం గురించి చెబుతూ ఉంటాడు. నాణ్యత గల స్వీట్స్ తయారు చేయమని అడిగితే వాళ్ళు ఒప్పుకోవడం లేదు అని అలాంటి పని నేను ఎప్పటికీ చేయను అని అందుకే అక్కడ స్వీట్ షాప్ లో పనిచేయడం నాకు నచ్చలేదు. అందుకే బయటకు వచ్చేసాను అని రామచంద్ర కారణం చెబుతాడు. ఇక జానకి కూడా రామచంద్ర కు సపోర్ట్ చేస్తుంది. మీరు చాలా మంచి పని చేశారు అని అలాంటి చెడు పనులు మనకు వద్దు అని అంటుంది.

ఫిబ్రవరి 30వ ఎపిసోడ్
మరోవైపు మల్లికా తన భర్త కోసం షాప్ పెట్టించాలి అని ఎప్పటినుంచో దాచుకున్న డబ్బులను ఇస్తుంది. ఇన్ని రోజులు డబ్బులు లేవని చెప్పిన మల్లికా ఇప్పుడు భర్తకు పొగరుగా సహాయం చేయాలని అనుకుంటుంది. ఇక మరోవైపు రామచంద్ర కు తెలిసిన వాళ్ళు రోడ్డుమీద ఎదురుపడతారు. ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది ఏమిటి వీటిని అడుగుతారు. ఇక జాలి చూపించవద్దు అని జానకి చెబుతుంది. అయితే రామచంద్ర వారి నుంచి ఒక సహాయం అడుగుతాడు. మీకు ఏవైనా ఫంక్షన్స్ ఉంటే చెప్పండి నేను స్వీట్స్ ఆర్డర్ సప్లై చేస్తాను అని అంటాడు. ఇక వాళ్ళు అందుకు ఓకే అని అంటారు.

ఫిబ్రవరి 1వ ఎపిసోడ్
ఈ క్రమంలో జానకి అత్తగారికి మధ్య సాన్నిహిత్య మొదలవుతుంది. మొదట జానకి పై కోపంగా ఉన్న జ్ఞానాంబ ఇంటి క్షేమం కోసం జానకి ఆలోచిస్తున్న విధానాన్ని చూసి కోపం తగ్గించుకుంటూ ఉంటుంది. ఇక ఆ విషయంలో జానకి కూడా ఎంతగానో సంతోషపడుతుంది. మరో వైపు జానకి తన అత్తగారి ఆశీర్వాదాన్ని తీసుకుంటూ భర్తతోనే కాలేజీకి వెళ్లాలని అనుకుంటుంది. ఇక నా పక్కన మీరు పుస్తకాలు పట్టుకొని నడవడం బాగుండదు అని రామ అన్నప్పటికీ కూడా మనం చేసే పని మంచిది అయినప్పుడు సిగ్గుపడకూడదు అని గర్వంగా ఉండాలి అని చాలా మంచి మాటలు మాట్లాడుతుంది.

ఫిబ్రవరి 2వ ఎపిసోడ్
భర్త విష్ణు మాట్లాడుతుండగా మల్లికా కలుగజేసుకొని ఇది వీరి స్నేహితుడి షాప్ అని ఆయనే పెట్టించారు అని మల్లిక అబద్ధాలు చెబుతుంది. దీంతో రామచంద్ర ఎవరు ఆ స్నేహితుడు అని అడుగుతాడు. ఇక పక్కనే ఉన్న మరో పని వారిని చూపించి మల్లిక అబద్ధం చెబుతుంది. ఇక జానకికి కాస్త అనుమానం కలిగినప్పటికీ ఏమాత్రం పట్టించుకోదు. ఇక మొత్తానికి అక్కడ తల్లి బోణీ చేయడంతో విష్ణు సంతోషిస్తాడు. ఇక మరోవైపు జెస్సీ భర్తకు మామ ఉద్యోగం ఇప్పిస్తాడు. అతనిపై కోపంగా ఉన్నప్పటికీ కూడా ఉద్యోగం తన కూతురి కోసం ఇచ్చానని చెబుతాడు.

ఫిబ్రవరి 3వ ఎపిసోడ్
ఇక గోవిందరాజులు ఇంట్లో ఎవరైనా కాఫీ పెడతారేమో అని ఎదురుచూస్తూ ఉంటాడు. ప్రత్యేకంగా మల్లికను కాఫీ తీసుకు రమ్మని అంటాడు. కానీ మల్లిక మాత్రం తన ఆరోగ్యం బాగోలేదు అని వంట గదిలోకి కూడా వెళ్ళవద్దు అని డాక్టర్లు చెప్పారు అని అబద్ధాలు చెబుతూ ఉంటుంది. ఇక అప్పుడే బయట నుంచి ఎవరో పిలుస్తున్నట్లుగా అనిపించడంతో మల్లిక బయటకు వెళ్లి చూస్తోంది.
అయితే అతను నా పేరు మలయాళం అంటూ మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన వంట వాడిని అని చెబుతాడు. దీంతో మల్లిక అతని అవతారం చూసి షాక్ అవుతుంది. కానీ నిజానికి అతనికి వంట ఏమాత్రం రాదు. ఇక్కడికి నేర్చుకోవాలని ఆలోచనతో వస్తాడు. గోవిందరాజులు అప్పుడే తనకి మంచి కాఫీ పట్టుకురా అని చెబుతాడు.
ఇక మరోవైపు అఖిల్ తనకు జాబ్ వచ్చిన విషయాన్ని తన అన్నయ్యతో మాత్రం అసలు చెప్పడు. ఆ విషయంలో జానకి కొంత బాధపడుతూ ఉంటుంది. మరి ఈ విషయంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.


Click it and Unblock the Notifications











