Janaki Kalaganaledu Serial Weekly Roundup: ఎస్ఐ నుంచి తప్పించుకొని.. రామ, జానకి రొమాంటిక్ జర్నీ
జానకి కలగనలేదు సీరియల్ మార్చి మొదటి వారం మరింత ఆసక్తికరంగా కొనసాగింది. ఈ సీరియల్ మొదట్లో కాస్త బోరింగ్ గా అనిపించినప్పటికీ ఆ తర్వాత అసలు కథలోకి రావడంతో రోజురోజుకు ప్రేక్షకుల్లో ఆదరణను పెంచుకుంటుంది. ఇక గత వారం మొత్తం కూడా అంటే మార్చి 17 నుంచి మార్చి 24 వరకు ఈ సీరియల్ లో ఎలాంటి ట్విస్టులు చోటు చేసుకున్నాయి? అలాగే జానకి ఫ్యామిలీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి..

మార్చి 17వ ఎపిసోడ్
ఎస్ఐ మనోహర్ మీరు అనుకుంటున్నంత మంచివాడు కాదు అని అతను కావాలనే నేను ఆలస్యంగా ఇంటికి వచ్చేలా చేశారు అని అంటాడు. అంతేకాకుండా ఇంతకుముందు మీతో కావాలనే తన బూట్లను తుడిపించుకున్నాడు అని పైకి మంచిగా నటిస్తూనే తనపై కోపాన్ని చూపిస్తున్నాడు అని జానకి జరిగిన విషయం గురించి చెబుతుంది. దీంతో రామచంద్ర మళ్లీ ఒక్కసారిగా ఆలోచనలో పడతాడు. అయితే అవన్నీ మీరు పట్టించుకోవద్దు అని ముందు మీరు నా ఆశీర్వాదం తీసుకోవాలి అని అంటాడు. ఎందుకు అని అడగ్గా పంతులుగారు అక్షింతలు వేసి ఆశీర్వదించమని అన్నారు అని చెప్పడంతో జానకి ఎంతో సంతోషంగా రామచంద్ర కాళ్లు మొక్కుతూ ఆశీర్వాదం తీసుకుంటుంది. ఇక జానకి పోలీస్ స్టేషన్లో జరిగిన విషయాల గురించి రామచంద్ర తో మాట్లాడుతూ ఉంటుంది.

మార్చి 20వ ఎపిసోడ్
ఈ పోలీస్ డ్యూటీ ఎవరు చేస్తారు అని అతను కోపంగా చెబుతాడు. అంతేకాకుండా నా చెవిలో ఏమైనా పువ్వులు కనిపిస్తున్నాయా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. అంతేకాకుండా నువ్వు మరోసారి తప్పు చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉన్న ప్రతి ఫైల్ ప్రతి టేబుల్ అన్ని కూడా చూడాలి అని ఇది నీకు పనిష్మెంట్ అని కూడా ఆయన చెబుతారు. దీంతో జానకి సైలెంట్ గా తన పని చేసుకుంటూ వెళుతుంది. అయితే తన స్నేహితురాలు మాత్రం ఈ విధంగా నువ్వు అవమానపడడం కంటే ఉద్యోగం మానవయోచ్చు కదా అని చెబుతుంది. కానీ జానకి అలా చేయకూడదు అని అయినా నేను ఐపీఎస్ కావాలన్నది నా లక్ష్యం అని చెబుతుంది. అయితే ఆ మాటలు అప్పుడే ఎస్ఐ మనోహర్ వింటాడు.

మార్చి 21వ ఎపిసోడ్
నువ్వు నీ లక్ష్యం కోసం ఇప్పటివరకు పిల్లలను కనకూడదు అని అనుకున్నావు. కానీ కాలం పోతే మళ్ళీ తిరిగి రాదు. లక్ష్యం కోసం జీవితాన్ని మొత్తాన్ని ఖర్చు పెట్టడం కూడా సరైనది కాదు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి. నేను నీకు ఒక అత్తగా చెప్పడం లేదు అని నీ క్షేమం కోరుకునే వ్యక్తిగా చెబుతున్నాను అని జ్ఞానాంబ చెబుతుంది. ఇక రామచంద్ర కూడా నీ తరహాలోనే బాధపడుతున్నాడు అని ఆమె అనడంతో జానకి మళ్ళీ ఆలోచనలో పడుతుంది. అలాగే భార్యగా భర్త మనసు తెలుసుకోవడం నీ బాధ్యత.. ఇవన్నీ నీకు తెలియనివి కావు. చిన్నపిల్లవు కాదు అంటూ మరోసారి జ్ఞానాంబ చెప్పడంతో జానకి ఆ విషయం గురించి ఆలోచిస్తుంది.

మార్చి 23వ ఎపిసోడ్
ముఖ్యంగా తల్లి అఖిల్ కొడుకుకు స్నానం చేయిస్తూ చాలా హ్యాపీగా ఉంటుంది. అయితే రామచంద్ర జానకి మళ్ళీ అత్తగారి దగ్గరికి వెళ్లి బయటకు వెళుతున్నట్లు చెబుతారు. అయితే ఎక్కడికి అని గోవిందరాజులు అడుగుతారు. దీంతో రామచంద్ర జానకి ఏమి చెప్పలేదు కాబట్టి మౌనంగా ఉండిపోతాడు. నాకు జానకి ఏమి చెప్పలేదు అని నువ్వైనా అడిగి తెలుసుకో అమ్మ అంటూ తన తల్లిని అడుగుతాడు. అయితే జ్ఞానాంబ కాస్త ఆలోచించి జానకి సరైన నిర్ణయమే తీసుకుంది అని గ్రహిస్తుంది. వెంటనే వారికి డబ్బులు ఇచ్చి పంపించాలి అని తన భర్తకు చెబుతోంది. అయితే రామచంద్ర మళ్లీ ఎక్కడికి అని అడిగితే అలా అడగకూడదు అని తల్లి కూడా చెబుతుంది. దీంతో రామచంద్ర సైలెంట్ గా జానకి తో పాటు బయటకు వెళ్తాడు. తన స్నేహితుడిని బండి అడిగి జానకిని బైక్ మీద తీసుకువెళ్తాను అని చెబుతాడు. ఇక ఇద్దరు షాపింగ్ చేయడానికి కూడా వెళతారు.

మార్చి 24వ ఎపిసోడ్
మరోవైపు జానకి రామ ఇద్దరు కూడా జాలీగా బైక్ మీద తిరుగుతూ ఉంటారు. ఇక రామ ఈ రోజు స్వీట్ బండి పెట్టకపోవడంతో కాస్త అసంతృప్తితో ఉంటాడు. దీంతో జానకి రామ మీద అలుగుతుంది. వెంటనే బైక్ ఆపండి అంటూ దిగేసి మీరు వెళ్లిపోండి అంటుంది. ఇక రామ జానకిని బుజ్జగించే ప్రయత్నం చేస్తాడు. అనంతరం జానకి కూల్ అయ్యి రామ చంద్రను ఒక రిసార్ట్ కు తీసుకు వెళుతుంది. ఇక రామచంద్రకు అప్పటికి కూడా అర్థం కాదు. ఇక నుంచి ఇక్కడే మనం రెండు రోజులు ఉండాలి అని అంటుంది.


Click it and Unblock the Notifications











