»   » 218 కట్స్ తర్వాత ఆ సెక్స్ కామెడీ చిత్రం టీవీలో వేస్తున్నారు

218 కట్స్ తర్వాత ఆ సెక్స్ కామెడీ చిత్రం టీవీలో వేస్తున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: భారతీయ సమాజంలో 'సెక్స్' గురించి మాట్లాడటానికి అంతగా ఇష్ట పడరు. సెక్స్ గురించి మాట్లాడటం పెద్ద తప్పుగా భావిస్తారు చాలా మంది. అయితే చాలా మంది స్నేహితుల దగ్గర ఇలాంటి విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో బాలీవుడ్లో 2013లో విడుదలైన చిత్రం 'గ్రాండ్ మస్తీ'. పెద్దలకు మాత్రమే పరిమితమైన ఈచిత్రం పూర్తిగా సెక్స్ రిలేటెడ్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులతో కూడి ఉంది. అడల్ట్ కామెడీ చిత్రాలను ఇష్టపడే వారిని ఈ చిత్రం తెగ ఎంటర్టెన్ చేసింది. అప్పట్లో ఈ సినిమా కేవలం 23 రోజుల్లోనే 100 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది.

ఇంద్ర కుమార్ దర్శకత్వం వహించిన ఈచిత్రం ఇంగ్లీష్ అడల్ట్ కామెడీ చిత్రాలను ఇన్స్‌స్పిరేషన్‌గా తెరకెక్కింది. ఈ చిత్రంలో వివేక్ ఒబెరాయ్, రితేష్ దేష్ ముఖ్, అఫ్తాబ్ శివదాసాని, మంజరి, కరిష్మా తన్నా, మరియమ్ జకారియా, బ్రూనా అబ్దుల్లా, కైనత్ అరోరా, ప్రదీప్ రావత్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు.

అప్పట్లో ఈ సినిమాకు కలెక్షన్లు బాగానే వచ్చినప్పటికీ...వల్గారిటీ ఎక్కువగా ఉందనే విమర్శలు వచ్చాయి. మొదట్లో ఈ సినిమాను టీవీల్లో వేయడానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. తాజాగా 218 కట్స్ అనంతరం యు/ఎ సర్టిఫికెట్ తో టీవీల్లో ప్రసారం చేయడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. 218 కట్స్ అనంతరం.... 135 నిమిషాల సినిమా నిడివి కాస్తా 98 నిమిషాలకు తగ్గిపోయింది.

వల్గారిటీపై ఆందోళన
  

వల్గారిటీపై ఆందోళన

వల్గారిటీ ఎక్కువగా ఉన్నఈ సినిమా టీవీల్లో రావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పెద్దల సినిమా
  

పెద్దల సినిమా

పెద్దలకు మాత్రమే పరిమితమైన ఈచిత్రం పూర్తిగా సెక్స్ రిలేటెడ్ కామెడీ, డబుల్ మీనింగ్ డైలాగులతో కూడి ఉంది.

ఇపుడు యూ/ఎ రేటింగ్
  

ఇపుడు యూ/ఎ రేటింగ్

మొదట్లో ఈ సినిమాను టీవీల్లో వేయడానికి సెన్సార్ బోర్డు అనుమతి ఇవ్వలేదు. తాజాగా 218 కట్స్ అనంతరం యు/ఎ సర్టిఫికెట్ తో టీవీల్లో ప్రసారం చేయడానికి అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

నిడివి తగ్గింది
  

నిడివి తగ్గింది

218 కట్స్ అనంతరం.... 135 నిమిషాల సినిమా నిడివి కాస్తా 98 నిమిషాలకు తగ్గిపోయింది.

 

Please Wait while comments are loading...