Bigg Boss Voting : గౌతమ్‌దే హవా .. షాకిస్తోన్న ఓటింగ్ , డేంజర్ జోన్‌లో ఏకంగా ముగ్గురు?
చూస్తుండగానే బిగ్‌బాస్ తెలుగు 8 పదవ వారంలోకి వచ్చేసింది . మరో ఆరేడు వారాల్లో బిగ్‌బాస్ 8వ సీజన్ ముగియనుంది. దీంతో ఈ సీజన్ విజేత ఎవరు అన్న దానిపై సోషల్ మీడియాలో డిస్కషన్స్ నడుస్తున్నాయి. పదో వారం ఏడుగురు నామినేషన్స్‌లో ఉండగా.. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారోనని ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో ఓటింగ్‌లో ఎవరు టాప్‌లో ఉన్నారు? ఎవరు లీస్ట్‌లో ఉన్నారో ఒకసారి పరిశీలిస్తే :
నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో మెగా చీఫ్ కంటెండర్స్ ఎంపికపై బిగ్‌బాస్ దృష్టి సారించాడు. దీనిలో భాగంగా బ్రీఫ్ కేస్ గేమ్ ఆడించాడు. గార్డెన్ ఏరియాలో మూడు బ్రీఫ్ కేసులు ఏర్పాటు చేసిన బిగ్‌బాస్.. వాటిపై ఎవరు మమ్మల్ని తీసుకుంటారు అని రాసి పెట్టాడు. అయితే ఏది టచ్ చేస్తే ఏం జరుగుతుందోనని కంటెస్టెంట్స్ అంతా గుసగుసలాడారు. కానీ నబీల్, రోహిణి, పృథ్వీ మాత్రం ఏం జరిగినా డోంట్ కేర్ అన్నట్లుగా ఆ మూడు బ్రీఫ్ కేసులను పట్టుకున్నారు.

వారి ధైర్యాన్ని మెచ్చుకున్న బిగ్‌బాస్.. మీరు ముగ్గురూ చీఫ్ కంటెండర్‌షిప్ దక్కించుకున్నారని షాకింగ్ న్యూస్ చెప్పాడు. కానీ అక్కడే ఓ ఫిటింగ్ పెట్టాడు. చీఫ్ కంటెండర్‌షిప్‌కు మీరు అర్హులో కాదో రుజువు చేసుకోవాలని కండీషన్ పెట్టాడు. దీని ప్రకారం తాను విసిరే ఛాలెంజ్‌లలో గెలిచి సూట్ కేస్‌ని కాపాడుకోవాలని చెప్పాడు. తొలుత లక్డీకాపూల్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లలో రోహిణి - హరితేజ పోటీపడగా.. చివరికి రోహిణి గెలిచి మెగా చీఫ్ కంటెండర్ అయిపోయింది. అంతేకాదు.. ఆమెకు ఓ పవర్ ఇచ్చి నచ్చిన కంటెస్టెంట్‌ను చీఫ్ కంటెండర్‌ను చేయొచ్చని చెప్పాడు.
అయితే తన రాయల్ క్లాన్ , ఫ్రెండ్స్‌ని కాకుండా ప్రేరణను ఇందుకు సెలెక్ట్ చేసి షాకిచ్చింది. నేను రాకముందు నుంచే నువ్వు చీఫ్ కావాలని ట్రై చేస్తున్నావని రీజన్ చెప్పింది. నబీల్ - పృథ్వీల మధ్య గేమ్ జరగాల్సి ఉండగా బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. కంటెస్టెంట్స్‌లో ఎవరైతే ముందుగా బెల్ కొడతారో వారితో నబీల్ పోటీ పడతాడని చెప్పాడు. గౌతమ్ బెల్ కొట్టడంతో నబీల్‌తో సై అన్నాడు. షేప్ యు ఆర్ ఫ్యూచర్ అనే టాస్క్ పెట్టగా.. ఇద్దరూ ఫిజికల్ అయ్యారు. ఈ గేమ్ తేలకపోవడంతో ఫైనల్‌గా ఓ షేప్‌ను ఎవరైతే ముందు తగిలిస్తారో వాళ్లే విజేత అని చెబుతాడు బిగ్‌బాస్. నబీల్ ఈ పని చేయడంతో గెలిచేస్తాడు. దీంతో అతనిని చీఫ్ కంటెండర్‌గా ప్రకటిస్తాడు బిగ్‌బాస్. అలాగే తనకు వచ్చిన పవర్‌తో యష్మీకి కూడా ఛాన్స్ ఇస్తాడు నబీల్.
ఇక పదవ వారం గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, హరితేజ, విష్ణుప్రియ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీలు నామినేషన్స్‌లో నిలిచిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను ఒకసారి పరిశీలిస్తే.. 25.69 శాతం ఓటింగ్‌తో గౌతమ్ కృష్ణ ఓటింగ్‌లో నెంబర్‌వన్‌గా నిలిచాడు. తర్వాత 23.52 శాతం ఓటింగ్‌తో నిఖిల్ రెండో స్థానంలో ఉన్నాడు. అనంతరం ప్రేరణ (18.09 శాతం), యష్మిగౌడల (16.34 శాతం) ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో ఉన్నారు. విష్ణుప్రియ (7.02 శాతం ), హరితేజ (6.37 శాతం), పృథ్వీ (6.03 శాతం) ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో కొనసాగుతున్నాడు. అయితే ఓటింగ్ లైన్స్ క్లోజ్ కావడానికి ఇంకా చాలా టైమ్ ఉండటంతో ఫలితాలు ఎలా మారుతాయో చూడాలి.


Click it and Unblock the Notifications











