TV Rating: వెండితెరపై 300 కోట్లు.. బుల్లితెరపై సంక్రాంతికి వస్తున్నాం మూవీకి షాకింగ్ రేటింగ్
ఈ కొత్త సంవత్సరం ఆరంభమే మన తెలుగు సినిమాకి ఒక బిగ్గెస్ట్ ఓపెనర్ దక్కింది అని చెప్పాలి. టాలీవుడ్ లో అతిపెద్ద సినీ ఫెస్టివల్ లో సంక్రాంతి మూమెంట్ అతి పెద్దది అని చెప్పవచ్చు. ఈ పండుగ సమయంలో ఒక సినిమాకి మినిమమ్ టాక్ వచ్చినా కూడా ఆ సినిమాకి భారీ వసూళ్లు ఖాయమే..
ఈ 2025 ఏడాదిలో వచ్చిన సంక్రాంతి సినిమాలో మొదటి సినిమా గేమ్ ఛేంజర్ రికార్డు ఓపెనింగ్స్ కూడా అందుకుంది కానీ ఈ సినిమా తర్వాత వచ్చిన సీనియర్ హీరోల సినిమాలు వారి కెరీర్లోనే కాకుండా టాలీవుడ్ హిస్టరీ లోనే రికార్డు వసూళ్లు సాధించాయి. కాగా ఇలా మన సీనియర్ హీరోస్ నుంచి బాలయ్య డాకు మహారాజ్, వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం లు వస్తే..

వీటిలో డాకు మహారాజ్ బాలయ్య కెరీర్లోనే హైయెస్ట్ గ్రాసర్ గా నిలిస్తే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా టాలీవుడ్ లో రీజనల్ హిట్ అయ్యింది. మళ్ళీ చాలా కాలం తర్వాత తెలుగులో ఓ సినిమా రికార్డు రన్ ని అందుకుంది అంటే అది సంక్రాంతికి వస్తున్నాం అనే చెప్పవచ్చు. ఫ్యామిలీ ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎంజాయ్ చేస్తూ టికెట్స్ కోసం ఎంతో పడిగాపులు కాచేలా ఈ సినిమా చేసింది.
ఇలా వెండితెరపై సెన్సేషనల్ హిట్ అయ్యి 300 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని రీజనల్ గా తెలుగులో ఏ సినిమా కూడా అందుకోని మాసివ్ రన్ ని ఈ సినిమా ప్రదర్శించింది. ఇక ఈ తర్వాత మేకర్స్ వెంటనే ఓటిటి రిలీజ్ కూడా చేయలేదు. సుమారు నెలన్నర పాటు ఆపి అపుడు నేరుగా ఓటిటి సహా స్మాల్ స్క్రీన్ పై కూడా టెలికాస్ట్ కి తీసుకొచ్చారు.
కాగా మన తెలుగులో ఈ రేంజ్ లో హిట్ అయ్యిన సినిమాలు బుల్లితెరపై కూడా రికార్డు టీఆర్పీలు అందుకున్నాయి. సో దీంతో సంక్రాంతికి వస్తున్నాం కూడా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాబట్టి ఇదీ టీఆర్పీలో ఆల్ టైం రికార్డు అందుకుంటుంది అని చాలా మంది అనుకున్నారు కానీ అనూహ్యంగా ఈ సినిమాకి షాకింగ్ రేటింగ్ అందుకుంది. జీతెలుగు ఛానెల్లో ప్రసారానికి వచ్చిన ఈ సినిమా ఆ ఛానెల్లో రెండో అత్యధిక రేటింగ్ అందుకున్న సినిమాగా నిలిచిందట.

కాగా ఈ ఇండస్ట్రీ హిట్ సినిమాకి కేవలం 15.9 రేటింగ్ మాత్రమే నమోదు అయ్యినట్టుగా తెలుస్తుంది. కానీ మన తెలుగులో ఆల్ టైం హైయెస్ట్ రేటింగ్ అల వైకుంఠపురములో 29 కి పైగా రేటింగ్ అందుకుంది. సో స్మాల్ స్క్రీన్ దగ్గర సంక్రాంతికి వస్తున్నాం మరీ ఈ రేంజ్ ఆదరణ అందుకోకపోవకడం గమనార్హం.
ఇక ఇదిలా ఉండగా అదే జీతెలుగులో సంక్రాంతికి వస్తున్నాం కంటే ముందు పొజిషన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ 19 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ కి పైగా సాధింది టాప్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇలా వెండితెరపై సంచలన విజయం సాధించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా బుల్లితెరపై మాత్రం ఆల్ టైం రికార్డుగా నిలవలేకపోయింది అనిక్ చెప్పాలి.


Click it and Unblock the Notifications











