twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss Vs EMK ఎన్టీఆర్‌పై నాగార్జున డామినేషన్.. తమన్నా షోకు దారుణంగా రేటింగ్

    |

    బుల్లితెర మీద తెలుగు సినిమాలు, రియాలిటీ షోలు మరోసారి దుమ్మురేపాయి. వెండితెరపైనే కాకుండా బుల్లితెర మీద రాణిస్తున్న స్టార్ హీరోలు నాగార్జున అక్కినేని, నందమూరి తారక రామారావు, తమన్నా లాంటి హీరో, హీరోయిన్లు టెలివిజన్ రియాలిటీ షోలతో విశేషంగా ఆకట్టుకొంటున్నాయి. ఈ ఏడాదిలో 40 వారం రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే..

    బుల్లితెరపై రంగ్ దే, క్రాక్, సోగ్గాడే చిన్ని నాయనా

    బుల్లితెరపై రంగ్ దే, క్రాక్, సోగ్గాడే చిన్ని నాయనా

    ప్రస్తుత ఏడాది 2021లో 40వ వారంలో తెలుగు టెలివిజన్ తెరపై రంగ్ దే, క్రాక్, సోగ్గాడే చిన్ని నాయనా మూడు చిత్రాలు ప్రదర్శించారు. జీ తెలుగు ఛానెల్‌లో ప్రసారమైన రంగ్ దే చిత్రం అర్బన్‌లో 3.68 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 3.81 రేటింగ్ సొంతం చేసుకొన్నది. స్టార్ మా టెలివిజన్‌లో క్రాక్ చిత్రం అర్బన్ ప్రాంతంలో 6.13 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 6.17 రేటింగ్ నమోదు చేసుకొన్నది. ఇక జెమినీలో ప్రసారమైన సొగ్గాడే చిన్ని నాయన చిత్రం అర్బన్ ప్రాంతంలో 4.23 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 4.26 రేటింగ్‌ను నమోదు చేసుకొన్నది.

    తమన్నా భాటియా చెఫ్‌ షో రేటింగ్

    తమన్నా భాటియా చెఫ్‌ షో రేటింగ్

    తమన్నా భాటియా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న చెఫ్ వంటల కార్యక్రమం ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నది. జెమినీలో ప్రసారమవుతున్న ఈ షో వారం వారానికి పడిపోతున్నది. 40వ వారం అర్బన్ ప్రాంతంలో 1.29 రేటింగ్, రూరల్‌లో ప్రాంతంలో 1.12 రేటింగ్ సొంతం చేసుకొన్నది. ఇక 39వ వారంలో అర్బన్ ప్రాంతంలో 1.81 రేటింగ్, రూరల్ ప్రాంతంలో 1.38 రేటింగ్ నమోదు చేసుకొన్నది.

    ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు రేటింగ్

    ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు రేటింగ్

    ఇక ఎన్టీఆర్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు రియాలిటీ షో రేటింగ్ 40వ వారంలో స్వల్పంగా క్షీణించింది. 39వ వారం ఈ షో అర్బన్ ప్రాంతంలో 4 రేటింగ్‌ను సొంతం చేసుకొంటే.. 40వ వారంలో 3.12 రేటింగ్ సాధించింది. ఇక రూరల్ ప్రాంతంలో ఎవరు మీలో కోటీశ్వరులు 39వ వారంలో 2.42 రేటింగ్‌ను సొంతం చేసుకోగా, 40వ వారంలో 2.18 రేటింగ్‌ను సొంతం చేసుకొంది.

    నాగార్జున బిగ్‌బాస్ ఎపిసోడ్స్ రేటింగ్

    నాగార్జున బిగ్‌బాస్ ఎపిసోడ్స్ రేటింగ్


    నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ తెలుగు 5 షో 40వ వారంలో భారీ రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది. నాగార్జున హోస్ట్‌గా నిర్వహించే వారాంతపు రెండు ఎపిసోడ్స్‌కు మంచి రేటింగ్ వచ్చింది. 39వ వారంలో వారాంతపు షో అర్బన్ ప్రాంతంలో 9.19 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 40వ వారంలో 10.03 రేటింగ్‌ను సాధించింది. ఇక రూరల్ ప్రాంతంలో బిగ్ బాస్ షో 6.98 రేటింగ్ సాధిస్తే.. 39వ వారంలో 6.19 రేటింగ్‌ను సొంతం చేసుకొన్నది.

    Recommended Video

    Pooja Hegde, Akhil Akkineni Interview | Most Eligible Bachelor
    బిగ్ బాస్ వారం రోజుల ఎపిసోడ్స్ రేటింగ్

    బిగ్ బాస్ వారం రోజుల ఎపిసోడ్స్ రేటింగ్


    ఇక వారం రోజులపాటు జరిగే బిగ్‌బాస్ తెలుగు 5 ఎపిసోడ్స్‌ మాత్రం గతంతో పోల్చుకొంటే చాలా తక్కువగా రేటింగ్ నమోదు చేసుకొన్నది. అర్బన్ ప్రాంతంలో ఈ షో 39వ వారంలో 5.48 రేటింగ్ సొంతం చేసుకొంటే.. 40వ వారంలో 5.13 రేటింగ్‌తో సరిపుచ్చుకొన్నది. ఇక రూరల్ ప్రాంతంలో ఈ షో 39వ వారంలో 3.20 రేటింగ్ సాధిస్తే.. 40వ వారంలో 3.04 రేటింగ్ నమోదు చేసింది. వారం రోజుల పాటు సాగే ఎపిసోడ్స్‌లో కంటెంట్ నాసిరకంగా ఉండటం, సాగదీత ఎక్కువ కావడం వల్ల ఈ షోకు అంతగా రేటింగ్ నమోదు కాలేదనేది తాజా అభిప్రాయంగా మారింది.

    English summary
    Telugu Television's 39th Week ratings: Nagarjuna's Bigg Boss Telugu 5, NTR's EMK, Tamannaah Bhatia's Master Cheff ratings are slightly dips to 38th week.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X