Television Show Ratings అనసూయ షో అంతంతగానే.. టాప్ లేపిన నాగ్.. ఎన్టీఆర్ EMK పరిస్థితి ఏమిటంటే?

బుల్లితెరపై స్టార్ హీరో, హీరోయిన్ల రియాలిటీ షోలు పెద్దగా ఆకట్టుకొలేకపోతున్నాయనే విషయం వారం వారం విడుదలయ్యే రేటింగులతో స్పష్టమవుతున్నది. అయితే రేటింగ్ పరంగా నిస్తేజంగా షోలు కొనసాగడం పలు టెలివిజన్ ఛానెల్స్‌కు కత్తి మీద సాముగా మారింది. గత కొద్ది వారాలుగా నిలకడగా రేటింగ్ సాధించడం కొంతలో కొంత ఉపశమనంగా మారింది. తాజాగా ఈ ఏడాది 46వ వారానికి సంబంధించిన రేటింగ్స్ ఎలా ఉన్నాయంటే...

 నాగార్జున, ఎన్టీఆర్, అనసూయ షోలు

నాగార్జున, ఎన్టీఆర్, అనసూయ షోలు

తెలుగు టెలివిజన్‌ రంగంలో టాప్ హీరో, స్టార్ యాంకర్ల మధ్య పోటీ గట్టిగానే సాగుతున్నది. స్టార్ మా ఛానెల్‌లో నాగార్జున హోస్ట్‌గా బిగ్‌బాస్ తెలుగు 5, జెమినీ ఛానెల్‌లో ఎన్టీఆర్ హోస్ట్‌గా మీలో ఎవరు కోటీశ్వరులు కొనసాగుతున్నాయి. అలాగే జెమినీ ఛానెల్‌లో టాప్ యాంకర్ అనసూయ హోస్ట్‌గా మాస్టర్ చెఫ్ కార్యక్రమం నడుస్తున్నది.

 రేటింగ్ రాతను మార్చిన అనసూయ

రేటింగ్ రాతను మార్చిన అనసూయ

మాస్టర్ చెఫ్ వంటల కార్యక్రమం తమన్నా భాటియా హోస్ట్‌గా అట్టహాసంగా ప్రారంభమైంది. అయితే ఆశించినంతగా రేటింగ్ రాకపోవడంతో నిర్వాహకులు ఆమెను తొలగించి టాప్ యాంకర్ అనసూయను తెరపైకి తెచ్చారు. అయితే తమన్నా తప్పుకొని అనసూయ వచ్చినా రేటింగ్ రాత మారలేదు. తాజా రేటింగ్‌ను బట్టి చూస్తే.. 45వ వారంలో రూరల్‌లో 0.88 రేటింగ్ సాధిస్తే.. 46వ వారంలో అర్బన్ ప్రాంతంలో 0.99 రేటింగ్ సొంతం చేసుకొన్నది. ఇక అర్బన్ ప్రాంతానికి వస్తే.. 45వ వారంలో 1.17 రేటింగ్ సాధించగా, 46వ వారంలో 1.29 రేటింగ్‌ను నమోదు చేసింది.

46వ వారంలో కూడా ఎన్టీఆర్ షో నత్తనడకగానే..

46వ వారంలో కూడా ఎన్టీఆర్ షో నత్తనడకగానే..

ఇక ఎన్టీఆర్ హోస్ట్‌గా సోమవారం నుంచి గురువారం వరకు కొనసాగుతున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నది. ఈ షో రేటింగ్ విషయానికి వస్తే.. రూరల్ ప్రాంతంలో 45వ వారంలో 1.85 రేటింగ్, 46వ వారంలో 2.23 రేటింగ్‌ను సాధించింది. గతవారంతో పోల్చితే కాస్త మెరుగ్గా కనిపించింది. ఇక అర్బన్ ప్రాంతంలో 45వ వారంలో 2.33 రేటింగ్ నమోదు చేస్తే.. 46వ వారంలో 2.77 రేటింగ్‌ను సాధించింది.

 నాగార్జున హోస్ట్‌గా రేటింగ్ ఎంతంటే..

నాగార్జున హోస్ట్‌గా రేటింగ్ ఎంతంటే..

ఇక నాగార్జున హోస్ట్‌గా శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ఎలిమినేషన్ ఎపిసోడ్స్‌కు మంచి స్పందన కనిపిస్తున్నది. రూరల్ ప్రాంతంలో బిగ్‌బాస్ పెద్దగా ఆకర్షించలేకపోతున్నారనేది స్పష్టంగా కనిపిస్తున్నది. రూరల్ ప్రాంతంలో 45వ వారం 5.84 రేటింగ్ సాధించగా, 46వ వారంలో 6.27 రేటింగ్‌ను నమోదు చేసింది. అర్బన్ ప్రాంతంలో 45వ వారం 9.11 రేటింగ్, 46వ వారంలో 9.19 రేటింగ్‌ను రిజిస్టర్ చేసింది. తాజా వారం రేటింగ్‌ను కాస్త మెరుగుపరుచుకోవడం గమనార్హం.

Recommended Video

Pushpa లో Samantha ఐటెం సాంగ్.. కండిషన్స్ అప్లై..! || Filmibeat Telugu
 46వ వారంలో బిగ్‌బాస్ రేటింగ్

46వ వారంలో బిగ్‌బాస్ రేటింగ్

ఇక సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రసారమయ్యే బిగ్‌బాస్ తెలుగు 5 షో రేటింగ్ విషయానికి వస్తే.. రూరల్ ప్రాంతంలో 45వ వారం 3.14 రేటింగ్ సాధిస్తే.. 46వ వారంలో 3.12 రేటింగ్‌ను నమోదు చేసింది. ఇక అర్బన్ ప్రాంతంలో రేటింగ్ విషయానికి వస్తే.. 45వ వారంలో 5.17 రేటింగ్ నమోదు చేసుకోగా, 46వ వారంలో 5.07 రేటింగ్‌ను సాధించింది. వారం రోజుల ఎపిసోడ్స్‌ విషయంలో రేటింగ్ కాస్త దిగజారడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X