Survey on BiggBoss Telugu 7: 4 వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఫిల్మీబీట్ సర్వేలో తేలింది ఇదే!

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో సెప్టెంబర్ 3న ప్రారంభం అయి రసవత్తరంగా సాగుతోంది. మరోసారి హోస్ట్‌గా నాగార్జున అక్కినేని తెరపైకి వచ్చి.. తనదైన శైలిలో షోను నడిపిస్తున్నారు. తొలి విడుతగా ఇంటిలోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అవ్వగా... ముగ్గురు ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం హౌజ్ లో 11 మంది మాత్రమే ఉన్నారు. అయితే నాలుగో వారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్‌ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్‌ తెలుగు 7లో 3వ వారం దామిని ఎలిమినేషన్ కరక్టేనా? అని అడిగితే... నెటిజన్లు అవును అని 45.45 శాతం ఓటు వేయగా.. కాదు అని 45.45శాతం ఓటు వేశారు. ఇక చెప్పలేం అంటూ 9.09శాతం మంది ఓటు వేశారు. ఇక దామిని ఎలిమినేషన్ పై నెటిజన్స్ అవును అని, కాదు అని సమానంగా ఓటు వేశారు.

4th Week Survey of Filmibeat Telugu on Bigg Boss 7 Telugu: Results are here

బిగ్‌బాస్‌ తెలుగు 7లో 4 వారం నామినేట్ అయిన ఆరుగురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని అనుకొంటున్నారు? అని అనగా... ప్రియాంక జైన్ 10.91శాతం, రతిక రోజ్ 32శాతం, ప్రిన్స్ యావర్ 10శాతం, శుభశ్రీ 9 శాతం, గౌతమ్ కృష్ణ 10 శాతం, టేస్టీ తేజ 25 శాతం ఓటింగ్ వేశారు. ఇక ఈ సర్వే ప్రకారం రతికా రోజ్ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.

రతిక రోజ్‌ను పల్లవి ప్రశాంత్ అక్క అని పిలువడం కరెక్టేనా? అని పోల్ నిర్వహించగా.. అవును అని 42 శాతం మంది ఓటు వేయగా... కాదు అని 42 శాతం మంది ఓటు వేశారు. చెప్పలేం అని 14 శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ విషయంపై నెటిజన్లు కూడా క్లారిటీగా చెప్పలేకపోయారు.

నామినేషన్ల ప్రక్రియలో జడ్జీలుగా శివాజీ, శోభా శెట్టి, సందీప్ వ్యవహరించిన తీరు సరిగా ఉందా? అవును అని 26శాతం, కాదు అని 63 శాతం, చెప్పలేం అని 9శాతం మంది ఓటు వేశారు. ఇక నెటిజన్స్... జడ్జీలుగా శివాజీ, శోభా శెట్టి, సందీప్ వ్యవహరించిన తీరు సరిగ్గా లేదని నిర్ణయించారు.

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ ఎలా సాగుతుందని మీరు అనుకొంటున్నారు? అని అడగ్గా... బాగుంది 31శాతం మంది, బాగాలేదు 49 శాతం, చెప్పలేం 19 శాతం మంది ఓటు వేశారు. ఇక ఈ సీజన్ 49 శాతం మందికి నచ్చలేదని తెలుస్తోంది. ఇక ఈ వారంలో రతిక ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X