Bigg Boss Telugu 7: బిగ్ బాస్ సంచలన నిర్ణయం... ఈ సీజన్‌లో అసలైన ఉల్టా పుల్టా ఇదే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఉల్టా పుల్టా అంటూ సాగుతున్న విషయం తెలిసిందే. ఇక 11 వారాలుగా ఈ సీజన్ సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. ఇక టాప్ 5 కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ నెట్టింట పలువురి పేర్లు కూడా హల్ చల్ చేస్తున్నాయి. అయితే ఈ సీజన్ లోనే బిగ్ ఉల్టా పుల్టా ట్విస్ట్ ఇచ్చేందుకు బిగ్ బాస్ రెడీ అవుతున్నాడు. అంతే కాదు ప్రేక్షకుల కోసం బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అసలు ఆ సంచలన నిర్ణయం ఏంటి... ఆ సర్ ప్రైజ్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 సెప్టెంబర్ 3న ప్రారంభం అయింది. ఇక ఈ సీజన్ లో 14 మంది కంటెస్టెంట్స్ మొదటి విడుతలో అడుగుపెట్టారు. ఇక ఐదో వారంలో ఐదుగురు ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ అసలైనా ఉల్టా పుల్టా అంటూ ఐదుగురు కంటెస్టెంట్స్ ను వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పించాడు. అలా హౌస్ లో కొత్త కంటెస్టెంట్స్ వర్సెస్ పాత కంటెస్టెంట్స్ అంటూ కొన్ని రోజులు ఆట సాగించారు. ఇక హౌస్ లో ప్రస్తుతం 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.

ఇప్పటి వరకు హౌస్ నుంచి కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతికారోజ్, శుభ శ్రీ రాయగురు, నయని పవని, పూజా మూర్తి, ఆట సందీప్, టేస్టీ తేజ, బోలే షవాలి.. ఇలా మొత్తం పది మంది ఎలిమినేట్ అయ్యారు. ఇక రతికా రోజ్ నాలుగో వారంలో ఎలిమినేట్ అయి... మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం హౌస్ లో 10 మంది ఉన్నారు. శివాజీ, యావర్, పల్లవి ప్రశాంత్, అమర్ దీప్, అర్జున్ అంబటి, అశ్వినీ, ప్రియాంక, శోభా శెట్టి, గౌతమ్, రతికా రోజ్.. 10 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.
ఇక ఇప్పటికే 11వ వారం పూర్తి కాబోతుంది. ఇలా 11వ వారంలో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే... హౌస్ లో 9 మంది ఉంటారు. అలా 12వ వారంలో ఒకరు, 13వ వారంలో ఒకరు, 14వ వారంలో ఒకరు ఎలిమినేట్ అవ్వగా.. 15వ వారంలో ఫినాలేకి 6 మంది కంటెస్టెంట్స్ మిగులుతారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సంచలన నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. బిగ్ బాస్ నిర్వాహకులు ఈ విషయంపై తాజాగా చర్చలు జరిపారు.
15వ వారం ఫినాలికే బిగ్ బాస్ 6 లేదా 7 మంది కంటెస్టెంట్స్ పంపించాలని డిసైడ్ అయ్యారట. అయితే 7 మంది కంటెస్టెంట్స్ వెళ్లాలంటే... ఒక వీక్ ఎలిమినేషన్ ఉండదు. ఒక వేళ 6 మంది కంటెస్టెంట్స్ ను టాప్ 6కి పంపిస్తే... 15వ వారంలో టాప్ 6 మిగులుతారు. ఇక ఈ విషయం దాదాపు ఖరారు అయినట్లు తెలుస్తోంది. ఇంకో వాదన ఏంటంటే.. టాప్ 6 పంపడం కంటే ఓ వారం పొడిగించాలని అనుకుంటున్నారట.
అలా బిగ్ బాస్ సీజన్ లోనే బిగ్ ఉల్టా పుల్టా నిర్ణయం ఇదే అని అంటున్నారు. ఈ సారి సీజన్ లో టాప్ 6 కంటెస్టెంట్స్ ఉంటారని.. తెలుస్తోంది. అయితే టాప్ 6 లో శివాజీ, పల్లవి ప్రశాంత్, యావర్, అమర్ దీప్, ప్రియాంక జైన్ లేదా శోభా శెట్టి, అర్జున్ అంబటి నిలుస్తారని అంటున్నారు. మరి ఈ సారి సీజన్ విన్ అయ్యే ఛాన్స్ శివాజీ, ప్రశాంత్ ఇద్దరిలో ఎవరో ఒకరు అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











