Bigg Boss Telugu 7 వైల్డ్ కార్డుతో 7 గురు కంటెస్టెంట్లు.. ఇంటిలోకి ఎప్పుడు? ఎవరెవరు వస్తున్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో నాలుగో వారంలోకి ప్రవేశించి రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటికే మూడు వారాల్లో ముగ్గుర్ని ఎలిమినేట్ చేసి హౌస్ నుంచి బయటకు పంపించారు. అయితే ఇంకా ఇంటిలో 11 మంది ఇంటి సభ్యులు గేమ్ కొనసాగిస్తున్నారు. అయితే వాస్తవంగా గత సీజన్‌లతో పోల్చుకొంటే ఈ సారి తక్కువగా అంటే 14 మందితోనే బిగ్‌బాస్ షోను ప్రారంభించారు. అయితే ఈ షోలోకి మరి కొందరు వస్తున్నారనే వార్త గత మూడు వారాలుగా ప్రేక్షకులను, అభిమానులు ఊరిస్తున్నది. అయితే ఇంటిలోకి మరో ఏడుగురిని పంపించేందుకు ప్లాన్ జరుగుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
14 మందితో బిగ్‌బాస్ తెలుగు 7:బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలోకి మొత్తం 14 మందిని పంపించారు. వారిలో ప్రియాంక జైన్, శివాజీ, దామిని, ప్రిన్స్ యావర్, శుభశ్రీ, షకీలా, ఆట సందీప్, శోభా శెట్టి, టేస్టీ తేజ, రతికా రోజ్, గౌతమ్ కృష్ణ, కిరణ్ రాథోడ్ ఇంటి సభ్యులుగా చేరారు. అయితే ఈ సారి తక్కువ మందితో గేమ్ స్టార్ చేస్తూ.. ఇది ఉల్టా పుల్టా షో అనే ట్యాగ్ లైన్‌కు న్యాయం చేసే ప్రయత్నం చేశారు.

మూడు వారాల్లో ఎలిమినేట్ అయింది ఎవరంటే?:బిగ్‌బాస్ తెలుగు 7 షో ప్రారంభమైన తర్వాత మూడు వారాల్లో ముగ్గురు లేడీ కంటెస్టెంట్‌ను ఎలిమినేట్ చేశారు. తొలివారం కిరణ్ రాథోడ్, రెండోవారం షకీలాను ఇంటి నుంచి బయటకు పంపిచారు. ఇక మూడో వారంలో సింగర్ దామిని ఎలిమినేట్ కావడం కొంత షాకింగ్‌గా అనిపించింది. ఇక నాలుగోవారం కూడా ఎలిమినేషన్‌కు రెడీ అవుతున్నది.

నాలుగో వారం ఎలిమినేషన్ తర్వాత :అయితే ఇంటిలో 10 మంది సభ్యులతో నాలుగో వారం తర్వాత గేమ్‌ను కొనసాగించడం కష్టంగానే కనిపిస్తున్నది. అయితే ఇంటిలో వైల్డ్ కార్డు ఎంట్రీలు వస్తున్నాయి. ఇంటిలోకి మరో ఏడుగురు సభ్యులను పంపించేందుకు కంటెస్టెంట్లను రెడీ చేశారు. త్వరలోనే వారిని ఇంటిలోకి పంపేందుకు ముహుర్తం పెట్టారు అనే వార్త మీడియాలో వైరల్ అయింది.

ఇంటిలోకి 7 సభ్యులు :ఇక వైల్డ్ కార్డు ఎంట్రీల ద్వారా బిగ్‌బాస్ ఇంటిలోకి వెళ్తున్న వారి పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వారి పేర్లు మాత్రం గతంలోనే భారీగా వినిపించాయి. కానీ తుది జట్టులో వారి పేర్లు లేకపోవడం వల్ల వారి అభిమానులు నిరాశ పడ్డారు. అయితే ఐదోవారం ప్రారంభంలో ఇంటిలోకి మరో ఏడుగురు రాబోతున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్నది.

వైల్డ్ కార్డు ద్వారా వచ్చేది ఎవరంటే? :ఇక బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలోకి వస్తున్న వారి జాబితా ఇలా ఉంది. సెప్టెంబర్ 30వ తేదీన ఏడుగురిని ఇంటిలోకి పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటిలోకి వెళ్లే వారిలో సీరియల్ యాక్టర్ అంబటి అర్జున్, మొగలి రేకులు ఫేమ్ అంజలి పవన్, మ్యూజిక్ డైరెక్టర్ భోలే షవాలి, యాంకర్ ప్రత్యూష, యాక్టర్ ఫర్జానా, సుప్రిత ఉన్నారు. అయితే చివరి నిమిషంలో ఈటీవీ ప్రభాకర్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో మరొకరిని ఖారారు చేస్తున్నట్టు సమాచారం.


Click it and Unblock the Notifications











