Bigg Boss Telugu7: 7వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఫిల్మీబీట్ సర్వేలో తేలింది ఇదే!
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో 7వ వారం కూడా ఆసక్తిగా సాగుతోంది. ఇక హోస్ట్‌గా నాగార్జున అక్కినేని తెరపైకి వచ్చి.. తనదైన శైలిలో షోను నడిపిస్తున్నారు. తొలి విడుతగా ఇంటిలోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అవ్వగా... అందులో ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారంలో మరో 5 మంది ఎంటర్ అవ్వగా... అందులో ఒకరు ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 13 మంది ఉన్నారు. ఇక ఏడో వారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ తెలుగు 7లో 6వ వారం నయని పవని ఎలిమినేషన్ కరక్టేనా? అనే ప్రశ్నకు అవును అని 29 శాతం మంది ఓటు వేయగా... కాదు అని 54 శాతం మంది చెప్పుకు వచ్చారు. ఇక చెప్పలేమని16 శాతం మంది వెల్లడించారు. ఇక మొత్తం మీద ఈ సర్వేలో తేలింది ఏంటంటే.. నయని పవని ఎలిమినేట్ అవ్వడం కరెక్ట్ కాదని చాలా మంది భావించారు.

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో మూడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారనే ప్రశ్నకు బోలే షవాలి 21శాతం మంది ఎలిమినేట్ అంటూ ఓటు వేయగా.. అశ్వినికి 12 శాతం, టేస్టీ తేజకు 5శాతం, పల్లవి ప్రశాంత్ కు 7 శాతం, పూజా మూర్తికి 37 శాతం, అమరదీప్ 8శాతం, గౌతమ్ 7 శాతం మంది ఎలిమినేట్ అవుతారంటూ ఓట్ వేశారు. ఈ లెక్కన ఈ వారం ఎలిమినేట్ కానుంది పూజా మూర్తి అని అర్థం అవుతుంది.
బిగ్ బాస్ తెలుగు 7 షోలో 2.O ఎలా సాగుతోందనే ప్రశ్నకు బాగుంది అని శాతం మంది 38 ఓటు వేయగా.. 45 బాగా లేదు అని 16 శాతం మంది ఓటు వేశారు. ఇక చెప్పలేమని శాతం మంది ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే... ఆటతీరు చాలా మంది ప్రేక్షకులకు నచ్చడం లేదని అర్థం అవుతుంది.

బిగ్ బాస్ తెలుగు 7 షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ల ఆటతీరు ఎలా ఉందనే ప్రశ్నకు బాగుంది అని శాతం మంది 38 ఓటు వేయగా.. 58 బాగా లేదు అని 2 శాతం మంది ఓటు వేశారు. ఇక చెప్పలేమని శాతం మంది ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే.. వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ల ఆటతీరు ప్రేక్షకులకు నచ్చడం లేదు.
పాట బిడ్డ బోలే షవాలిని ప్రియాంక జైన్, శోభా శెట్టి టార్గెట్ చేయడం కరెక్టేనా? అనే ప్రశ్నకు అవును అని 35 శాతం మంది ఓటు వేయగా.. 51 కాదు అనే ప్రశ్నకు శాతం మంది ఓటు వేశారు. చెప్పలేమని 13 శాతం మంది ఓటు వేశారు. ఇక బోలే షవాలిని శోభా శెట్టి, ప్రియాంక టార్గెట్ చేయడం సరికాదని అంటున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో ప్రియాంక జైన్, శోభాశెట్టి, అమర్ దీప్, ఆట సందీప్ గ్రూపిజం చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? అనే ప్రశ్నకు అవును అని 57 శాతం మంది ఓటు వేయగా.. కాదు అని 20 శాతం మంది ఓటు వేశారు. ఇక చెప్పలేమని 22 శాతం మంది ఓటు వేశారు. హౌస్ లో వీరు గ్రూపిజం చేస్తున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు.

మొత్తానికి ఈ 7వ వారం ఆసక్తిగా సాగింది. క్యాప్టెన్ గా అర్జున్ అంబటి ఎన్నిక అయ్యాడు. ఇక ఈ వారం పూజా మూర్తి ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. అంతే కాదు.. ఈ వారం రతిక ఎంట్రీ కూడా ఉండనుందని అంటున్నారు. చూడాలి ఈ వారం ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











