Bigg Boss Nominations: 2వ వారం నామినేషన్స్‌లో ట్విస్ట్.. ఈసారి ఏకంగా 8 మంది.. ఓటు పడినా వాళ్లు సేఫ్!

తెలుగు బుల్లితెరపైకి సాదాసీదాగానే వచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న ఏకైక షో బిగ్ బాస్. రియల్ ఇన్సిడెంట్ల ఆధారంగా నడిచే ఈ కార్యక్రమం ఎన్నో వివాదాలకు, గొడవలకు కారణం అవుతోంది. అయినప్పటికీ ఎవరూ ఊహించని రీతిలో స్పందనను అందుకుంటోంది. ఫలితంగా దేశంలో ఏ షోకూ రానంత రేటింగ్‌తో దుమ్ము దులుపుతోంది. ఇలా ఇప్పటికే పలు సీజన్లను పూర్తి చేసుకున్న బిగ్ బాస్.. ఇప్పుడు ఎనిమిదో సీజన్‌తో వచ్చేసింది. ఇక, ఇందులో రెండో వారంలో ఎవరెవరు నామినేట్ అయ్యారో చూసేద్దాం పదండి!

కొత్త ప్రయోగాలతో ఇంట్రెస్టింగ్
బిగ్ బాస్ షో తెలుగులో ఎప్పుడు వచ్చినా ప్రేక్షకులు దీనికి భారీ స్పందనను అందిస్తున్నారు. ఫలితంగా ఈ షో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ఎనిమిదో దానిని కూడా మొదలు పెట్టారు. దీన్ని ఆరంభం నుంచే ఆసక్తికరంగా మార్చేందుకు నిర్వహకులు సరికొత్త ప్రయోగాలు చేస్తున్నారు. దీంతో ప్రతి ఎపిసోడ్ జనరంజకంగానే నడుస్తోంది.

8 Contestants Nominated In Bigg Boss Telugu 8 Season 2nd Week

14 మంది.. బేబక్క బయటకు

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. అయితే, మొదటి వారానికి జరిగిన ఎలిమినేషన్‌లో బెజవాడ బేబక్క హౌస్ నుంచి బయటకు వెళ్లిపోయింది.

నామినేషన్ టాస్క్ మారింది
బిగ్ బాస్ షోలో సాధారణంగా నామినేషన్స్ టాస్కును సోమవారం జరిగే ఎపిసోడ్‌లోనే చూపిస్తుంటారు. ప్రతి సీజన్‌లోనే ఇలానే చేశారు. అయితే, ఎనిమిదో సీజన్ మొదటి వారంలో మాత్రం దీన్ని బుధవారం నిర్వహించారు. అయితే, ఇప్పుడు నిర్వహకులు మరోసారి పాత పద్దతినే వాడుతున్నారు. ఇందులో భాగంగానే రెండో వారం నామినేషన్స్ ప్రక్రియను సోమవారమే పెడుతున్నారు.

బిగ్ ట్విస్ట్.. రంగు నీళ్లు పోస్తూ

బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. రెండో వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియను కొత్తగా నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే హౌస్‌లో మూడు క్లేన్లు ఉన్న విషయం తెలిసిందే. ఇందులో తమ క్లేన్ కాకుండా పక్క క్లేన్ వాళ్లనే నామినేట్ చేయాలని బిగ్ బాస్ చెప్పాడు. ఈ టాస్క్‌లో భాగంగా నామినేట్ చేసే వాళ్లు రంగు నీళ్లు పోయాల్సి ఉంటుంది.

2వ వారం 8 మంది నామినేట్
బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోని రెండో వారానికి సంబంధించి జరిగిన నామినేషన్స్ ప్రక్రియ ఇప్పటికే ముగిసింది. తాజాగా బయటకు వచ్చేసిన సమాచారం ప్రకారం.. ఇందులో ఏకంగా ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. వారిలో శేఖర్ బాషా, కిర్రాక్ సీత, నైనిక, నిఖిల్, పృథ్వీరాజ్ శెట్టి, అభయ్ నవీన్, నాగ మణికంఠ, ఆదిత్యం ఓంలు ఎలిమినేషన్ జోన్‌లోకి వచ్చారు.

కొందరేమో అలా సేఫ్‌గానే

ఎనిమిదో సీజన్ రెండో వారంలో చాలా మంది నామినేషన్‌లోకి వచ్చారు. కానీ, ఒక్కో ఓటు పడిన వాళ్లను మాత్రం బిగ్ బాస్ పరిగణలోకి తీసుకోలేదని తెలిసింది. దీంతో మిగిలిన వాళ్లలో ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. వీళ్లను మినహాయించి అందరూ సేఫ్ అయ్యారు. అయితే, బిగ్ బాస్ మరోసారి ఏమైనా ట్విస్ట్ ఇస్తాడేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X