Bigg Boss Telugu 7 Leaks: ఈ వీకెండ్ బిగ్ బాస్ హౌస్‌లోకి మరో 8 మంది కంటెస్టెంట్స్.. వాళ్లు ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత వారం ప్రారంభం అయి... ఊహకు అందని రేంజులోనే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీజన్ మొదటి నుంచి ఉల్టా పుల్టా ఉంటుందని నాగార్జున చెప్పుకొచ్చారు. ఆయన చెప్పినట్లుగానే... ఈ సీజన్ సరికొత్తగా ట్విస్టులు, టాస్క్ లతో సాగుతోంది. ఇదిలా ఉండగా... ఈ వీకెండ్ హౌస్ లోకి మరో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ రాబోతున్నారని తెలిసింది. ఆ వివరాల్లోకి వెళితే....
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గత వారం ప్రారంభం అయింది. ఇక ఇందులోకి 14 మంది కంటెస్టెంట్స్ అడుగుపెట్టారు. ఏడుగురు ఉమెన్ సెలబ్రెటిలతో పాటు ఏడుగురు మెన్ సెలబ్రెటీలు ఎంటర్ అయ్యారు. ఇక ఇందులో అమర్ దీప్, శివాజీ, టెస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, ఆట సందీప్ తో పాటు... షకీలా, దామినీ, కిరణ్ రాథోడ్, ప్రియాంక జైన్, రతికా రోజ్, శోభా శెట్టి, శుభ శ్రీ అడుగుపెట్టారు.

ఇక ఈ 14 మంది కంటెస్టెంట్స్ తో ఈ వారం అంతా సరదా సరదాగా గడిచిపోయింది. అంతే కాదు.. సీక్రెట్ టాస్కులు, ట్విస్టులు ఈ వారం అంతా ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా శివాజీ, షకీలా వేసిన డ్రామా షోకు హైలెట్ గా నిలిచింది. ఇక శివాజీ బిగ్ బాస్ మీద అరవడం కూడా బాగా వర్కౌట్ అయింది. మొత్తానికి 14 మంది ఎవ్వరూ తగ్గకుండా ఫెర్మామెన్స్ చేస్తున్నారు.

ఇక బిగ్ బాస్ సీజన్ 7 మొత్తానికి ఊహకు అందని రేంజులో సాగుతోంది. ముందుగానే ఉల్టా పుల్టా అని చెప్పినట్లుగా.. ఈ సీజన్ ఊహకు అందని విధంగానే సాగుతోంది. ఇప్పుడు ఈ వీకెండో మరో 8 మంది కంటెస్టెంట్స్ అడుగు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈరోజు షూటింగ్ కూడా జరుపుకుంటుందని సమాచారం. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్ 14.. వీరికి 8 మంది తోడైతే... 22 మంది అవుతారు.
22 మంది కంటెస్టెంట్స్ లో ఎవరైనా ఎలిమినేట్ అయితే... 21 మందితో షో నడపనున్నారు. మరి ఈ వారం ఎలిమినేషన్ లేదు అని టాక్ నడుస్తోంది. ఒకవేళ ఎలిమినేషన్ అయితే మాత్రం కిరణ్ రాథోడ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇక 14 మందికి తోడు 8 మంది ఎంటర్ అయితే కనుగ.. షోలో మామూలు రచ్చ ఉండదని అంటున్నారు.

ఆ 8 మంది ఎవరంటే... అంబటి అర్జున్, వర్షిణి, పవన్ సాయి రాజ్ పుత్, యాక్టర్ క్రాంతి, నిఖిల్, ఐశ్వర్య పిస్సే లేదా పూజా మూర్తి, బోలే షవాలి, ఫర్జానా తారలు ఈ హౌజ్ లోకి అడుగుపెట్టనున్నారు. మరి వీరు ఎలాంటి ఫెర్మెన్స్ తో ఆకట్టుకుంటారో చూడాలి. ఇప్పటికే షో లో ఏం జరుగుతుందో వీరికి బాగా అర్థం అయింది. మరి ఎలాంటి ఎత్తుగడలతో వస్తారో చూడాలి.


Click it and Unblock the Notifications











