Survey on Bigg Boss Telugu 7 Elimination 8వ వారం ఎలిమినేషన్ ఎవరంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం!

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో 8వ వారం కూడా ఆసక్తిగా సాగుతోంది. ఇక హోస్ట్‌గా నాగార్జున అక్కినేని తెరపైకి వచ్చి.. తనదైన శైలిలో షోను ఎంటర్టైన్ చేస్తున్నాడు. తొలి విడుతగా ఇంటిలోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అవ్వగా... అందులో ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారంలో మరో 5 మంది ఎంటర్ అవ్వగా... అందులో ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 12 మంది ఉన్నారు. ఇక ఎనిమిదో వారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్‌ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..

బిగ్‌ బాస్‌ తెలుగు 7లో 7వ వారం పూజా మూర్తి ఎలిమినేషన్ కరక్టేనా? అనే ప్రశ్నకు అవును అని 60 శాతం మంది ఓటు వేయగా... కాదు అని 30 శాతం మంది చెప్పుకు వచ్చారు. ఇక చెప్పలేమని 29 శాతం మంది తెలిపారు. ఇక మొత్తం మీద ఈ సర్వేలో తేలింది ఏంటంటే.. పూజా మూర్తి ఎలిమినేట్ అవ్వడం కరెక్టే అంటూ చాలా మంది భావించారు.

8th Week Survey of Filmibeat Telugu on Bigg Boss 7 Telugu: Results are here

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో 8వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారనే ప్రశ్నకు ప్రియాంక 10 శాతం, శివాజీ 0శాతం, యావర్ 3 శాతం, గౌతమ్ 7 శాతం, ప్రశాంత్ 2 శాతం, అమర్ దీప్ 8 శాతం, బోలే షవాలి 15 శాతం , ఆట సందీప్ 20 శాతం, అశ్విని శ్రీ 25 శాతం, శోభా శెట్టి 15 శాతం ఓటు వేశారు. ఈ లెక్కన ఈ వారం ఎలిమినేట్ కానుంది అశ్విని శ్రీ అని అర్థం అవుతుంది.

8th Week Survey of Filmibeat Telugu on Bigg Boss 7 Telugu: Results are here

బిగ్‌ బాస్ తెలుగు 7 షోలో 2.O ఎలా సాగుతోందనే ప్రశ్నకు బాగుంది అని శాతం మంది 34 ఓటు వేయగా.. బాగా లేదు అని 52 శాతం మంది ఓటు వేశారు. ఇక చెప్పలేమని 14 శాతం మంది ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే... ఆటతీరు చాలా మంది ప్రేక్షకులకు నచ్చడం లేదని అర్థం అవుతుంది.

బిగ్‌ బాస్ తెలుగు 7 షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ల ఆటతీరు ఎలా ఉందనే ప్రశ్నకు బాగుంది అని 34 శాతం మంది ఓటు వేయగా.. బాగా లేదు అని 65 శాతం మంది ఓటు వేశారు. ఇక చెప్పలేమని 1 శాతం మంది ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే.. వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ల ఆటతీరు ప్రేక్షకులకు నచ్చడం లేదు.

8th Week Survey of Filmibeat Telugu on Bigg Boss 7 Telugu: Results are here

8వ వారం నామినేషన్స్ లో పాట బిడ్డ బోలే షవాలితో శోభా శెట్టి గొడవ పెట్టుకోవడం కరెక్టేనా? అనే ప్రశ్నకు అవును అని 28 శాతం మంది ఓటు వేయగా.. కాదు అనే ప్రశ్నకు 51 శాతం మంది ఓటు వేశారు. చెప్పలేమని 1 శాతం మంది ఓటు వేశారు. ఇక బోలే షవాలితో శోభా శెట్టి గొడవ పెట్టుకోవడం సరికాదని అంటున్నారు.

8th Week Survey of Filmibeat Telugu on Bigg Boss 7 Telugu: Results are here

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో కంటెస్టెంట్స్ గ్రూపిజం చేస్తున్నారని మీరు భావిస్తున్నారా? అనే ప్రశ్నకు అవును అని 93 శాతం మంది ఓటు వేయగా.. కాదు అని 6 శాతం మంది ఓటు వేశారు. ఇక చెప్పలేమని 0 శాతం మంది ఓటు వేశారు. హౌస్ లో వీరు గ్రూపిజం చేస్తున్నారని ప్రేక్షకులు భావిస్తున్నారు.

మొత్తానికి ఈ 8వ వారం ఆసక్తిగా సాగింది. క్యాప్టెన్ గా గౌతమ్ ఎన్నిక అయ్యాడు. ఇక ఈ వారం అశ్విని శ్రీ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. అంతే కాదు.. గత వారం రతిక ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇక హౌస్ లో రసవత్తరంగా షో సాగుతోంది. చూడాలి ఈ వారం ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X