Suma Adda: యాంకర్ సుమతో హీరో శివాజీ ఫ్లర్టింగ్... పల్లవి ప్రశాంత్ ఎంట్రీ మాత్రం?
బిగ్ బాస్ షో ద్వారా మళ్లీ ఫామ్ లోకి శివాజీ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక షో నుంచి బయటకు వచ్చిన ఆయన.. 90s ఏ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక ఈ సిిరీస్ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక టీం సుమ అడ్డాలో సందడి చేసింది. సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ కానున్న ఈ షోలో శివాజీ అండ్ 90s ఏ మిడిల్ క్లాస్ టీం మెరిసింది. ఇక ఈ షో ప్రోమో రిలీజ్ కాగా ఆకట్టుకుంటుంది. ఆ వివరాల్లోకి వెళితే...
ఓటీటీ లు వచ్చాక సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లకు కూడా ఆదరణ లభిస్తుందనే విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లో వెబ్ సిరీస్ లు, సినిమాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆ వెబ్ సిరీస్ కు పట్టం కట్టేస్తారు సినీ ప్రేమికులు.. ఇటీవల అలా వచ్చిన '90s ఏ మిడిల్ క్లాస్' వెబ్ సిరీస్ కు ప్రేక్షకులలో మంచి రెస్పాన్స్ వస్తుంది. బిజీ బిజీ లైఫ్ లో పరుగులు తీస్తున్న నేటి తరానికి వెనక్కి తీసుకెళ్లి 90లోని మధుర జ్ఞాపకాలను కళ్లముందుకు తీసుకువచ్చింది.

ఈ '90s ఏ మిడిల్ క్లాస్' బయోపిక్ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. ప్రస్తుతం 90s కిడ్స్ , 2k కిడ్స్ అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వస్తున్న ఈ నేపథ్యంలో ఈ బయోపిక్ 90s కిడ్స్ ను ఓ పదిహేనేళ్లు వెనక్కి తీసుకెళ్లింది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, 90s కిడ్స్ ఈ వెబ్ సిరీస్ కు బాగా కనెక్ట్ అయిపోయారు. అలా ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంటుగా ఓటీటీకి వచ్చిన ఈ వెబ్ సిరీసుకు మంచి రెస్పాన్స్ రావడంతో టాప్ లో నిలిచింది.
మూవీ లవర్స్ అంతా ప్రస్తుతం 90s ఏ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ గురించే చర్చించుకుంటున్నారు. అంతగా విజయం సాధించిన ఈ వెబ్ సిరీస్ ప్రధాన పాత్రలు తాజాగా యాంకర్ సుమ అడ్డా షో లో సందడి చేశాయి. యాంకర్ సుమ నిర్వహిస్తున్న ఈ షోలో శివాజి, నటి వాసుకి, చైల్డ్ ఆర్టిస్ట్లు అనందం, మౌలి, వాసంతిక పాల్గొన్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ అయి ఆకట్టుకుంటుంది.

ఇందులో సుమతో కలిసి శివాజి చేసిన హంగామా ఆకట్టుకుంటుంది. ప్రోమో ప్రారంభంలోనే ఎప్పటిలాగే సుమ తన వయసుని కవర్ చేసుకునే ప్రయత్నం చేయగా.. శివాజీ తనదైన శైలిలో పంచ్ లు వేశాడు. నేను అప్పటి జనరేషన్ కాకపోయినా.. 90s ఏ మిడిల్ క్లాస్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందంటూ సుమ అంటుంది. మీరు మా కంటే ముందు జనరేషన్ వారు అయినా.. అని నేను అనను అంటూ సుమకు పంచ్ వేసాడు శివాజీ.
అంతలో శివాజీకి ఫోన్ రాగా.. పల్లవి ప్రశాంత్ అంటూ సుమ శివాజిని ఆడుకుంది సుమ. ఆ తర్వాత సుమను ఫ్లర్ట్ చేసే పనిలో పడ్డాడు శివాజీ. ఇక ఈ ఎపిసోడ్ సంక్రాంతి కానుకగా టెలికాస్ట్ కానుంది.


Click it and Unblock the Notifications











