Bigg Boss Telugu 7: 9వ వారం ఎలిమినేషన్ ఎవరంటే? ఉల్టా పల్టాగా సర్వే ఫలితం!
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో 9వ వారం కూడా ఆసక్తిగా సాగుతోంది. ఇక హోస్ట్‌గా నాగార్జున అక్కినేని తెరపైకి వచ్చి.. తనదైన శైలిలో షోను ఎంటర్టైన్ చేస్తున్నారు. తొలి విడుతగా ఇంటిలోకి 14 మంది కంటెస్టెంట్లు ఎంటర్ అవ్వగా... అందులో ఐదుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇక ఐదో వారంలో మరో 5 మంది ఎంటర్ అవ్వగా... అందులో ఇద్దరు హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం హౌస్ లో 11 మంది ఉన్నారు. ఇక ఎనిమిదో వారం కంటెస్టెంట్ల గురించి, ఆట తీరు గురించి ఫిల్మీబీట్ తెలుగు పోల్ నిర్వహించింది. ఈ పోల్ వివరాల్లోకి వెళితే..
బిగ్ బాస్ తెలుగు 7లో బిగ్ బాస్ తెలుగు 7లో 8వ వారం ఆట సందీప్ ఎలిమినేషన్ కరక్టేనా? అనే ప్రశ్నకు అవును అని 58 శాతం మంది ఓటు వేయగా... కాదు అని 35 శాతం మంది చెప్పుకు వచ్చారు. ఇక చెప్పలేమని 5 శాతం మంది తెలిపారు. ఇక మొత్తం మీద ఈ సర్వేలో తేలింది ఏంటంటే.. ఆట సందీప్ ఎలిమినేట్ అవ్వడం కరెక్టే అంటూ చాలా మంది భావించారు.

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో 9వ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని భావిస్తున్నారనే ప్రశ్నకు అర్జున్ 4 శాతం, రతిక 6 శాతం, ప్రియాంక 0 శాతం, అమర్ దీప్ 2 శాతం, యావర్ 6 శాతం, బోలేషవాలి 10 శాతం, శోభా శెట్టి 61 శాతం, టేస్టీ తేజ 10 శాతం ఓటు వేశారు. ఈ లెక్కన ఈ వారం ఎలిమినేట్ కానుంది శోభా శెట్టి అని నెటిజన్స్ భావిస్తున్నారు.

బిగ్ బాస్ తెలుగు 7 షోలో 2.O ఎలా సాగుతోందనే ప్రశ్నకు బాగుంది అని శాతం మంది 40 ఓటు వేయగా.. బాగా లేదు అని 51 శాతం మంది ఓటు వేశారు. ఇక చెప్పలేమని 8 శాతం మంది ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే... ఆటతీరు చాలా మంది ప్రేక్షకులకు నచ్చడం లేదని అర్థం అవుతుంది.
బిగ్ బాస్ తెలుగు 7 షోలో వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ల ఆటతీరు ఎలా ఉందనే ప్రశ్నకు బాగుంది అని 20 శాతం మంది ఓటు వేయగా.. బాగా లేదు అని 80 శాతం మంది ఓటు వేశారు. ఇక చెప్పలేమని 0 శాతం మంది ఓటు వేశారు. దీన్ని బట్టి చూస్తే.. వైల్డ్ కార్డు ఎంట్రీ కంటెస్టెంట్ల ఆటతీరు ప్రేక్షకులకు నచ్చడం లేదు.

ఈసారి సీజన్ విన్నర్ ఎవరని అనుకుంటున్నారు? అనే ప్రశ్నకు అర్జున్ అంబటి 9 శాతం, రతిక రోజ్ 5 శాతం, ప్రియాంక జైన్ 5 శాతం, అమర్ దీప్ 10 శాతం, యావర్ 4 శాతం, బోలే షవాలి 4 శాతం, శోభా శెట్టి 4 శాతం, టేస్టీ తేజ 4 శాతం, శివాజీ 32 శాతం, అశ్విని శ్రీ 1 శాతం, ప్రశాంత్ 15 శాతం మంది ఓటు వేశారు. అంటే ఈ సీజన్ విన్నర్ శివాజీ అని నెటిజన్స్ భావిస్తున్నారు.
మొత్తానికి ఈ 9వ వారం ఆసక్తిగా సాగింది. క్యాప్టెన్ గా శోభాశెట్టి ఎన్నిక అయ్యారు. ఇక ఈ వారం శోభా శెట్టి లేదా టేస్టీ తేజ ఎలిమినేషన్ ఉంటుందని అంటున్నారు. అంతే కాదు.. గత వారం రతిక ఎంట్రీ కూడా ఇచ్చింది. ఇక హౌస్ లో రసవత్తరంగా షో సాగుతోంది. చూడాలి ఈ వారం ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











