Jabardasth: షాకింగ్.. లవ్వు పేరుతో అన్నీ చేసి హ్యాండిచ్చాడు.. జబర్దస్త్ నటుడిపై కేసు పెట్టిన యువతి

ఇప్పటివరకు తెలుగు బుల్లితెర మీద వచ్చిన షోలన్నింటిలో జబర్దస్త్ కార్యక్రమం సక్సెస్ అయినంత బాగా మరే కార్యక్రమం సక్సెస్ అవ్వలేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. దాదాపు 10 ఏళ్ల పైనుంచి ఈ జబర్దస్త్ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను వారం వారం అలరిస్తూనే ఉంది.

జబర్దస్త్ గా మొదలై ఎక్స్ ట్రా జబర్దస్త్ తో ఇప్పుడు వారానికి రెండు రోజులపాటు అందర్నీ అలరిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా పేరు తెచ్చుకున్న వారు ఎంతోమంది సినిమాల్లో కూడా అవకాశాలు తెచ్చుకుంటున్నారు. అయితే ఈ కార్యక్రమంలో పలు ఎపిసోడ్స్ లో కనిపించిన ఒక నటుడు అనూహ్యంగా చిక్కుల్లో పడ్డాడు. అతని మీద హైదరాబాదులో కేసు నమోదు అయింది. ఆ వివరాల్లోకి వెళితే...

A case Filed against jabardasth Artist Nava Sandeep who cheated a woman in the name of love

ముందుగా ఈటీవీ ప్లస్ లో ప్రసారమైన పటాస్ కార్యక్రమంలో మంచి పేరు తెచ్చుకున్న సింగర్ నవ సందీప్ ఆ తర్వాత జబర్దస్త్ లో కూడా కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించాడు. అయితే తాజాగా ఇప్పుడు అతని మీదే పోలీస్ కేసు నమోదు అవ్వడం జబర్దస్త్ వర్గాల్లో కలకలం రేపుతోంది.

నవ సందీప్ ఓ యువతిని మోసం చేసినట్లు హైదరాబాదులో పోలీస్ కేసు నమోదు అయింది. నమోదైన కేసు ప్రకారం నవ సందీప్.. అమీర్ పేటకు చెందిన 28 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకుని వాట్సాప్ చాటింగ్ చేస్తూ ఉండేవాడు. ఆ క్రమంలో సాధారణ స్నేహంగా ఉన్న వీరి పరిచయం ప్రేమకు దారి తీసింది. అలా గత కొన్నాళ్లుగా లవ్ లో ఉన్నారు.

అయితే ప్రేమలో పడి చాలా కాలం అవుతుందని భావించిన యువతీ ఈ నేపథ్యంలోనే పెళ్లి ప్రస్తావన తీసుకురాగా నవ సందీప్ ఆమెను దూరంగా పెట్టడం మొదలుపెట్టాడట. దీంతో మోసాపోయానని భావించిన యువతి తనకు న్యాయం చేయాలని గోల్కొండ పోలీస్ స్టేషన్ లో అతనిపై ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు నవ సందీప్ ఆమెతో మాట్లాడిన విషయాలు నిజమేనని భావించి కేసు నమోదు చేసి... ఇప్పుడు దర్యాప్తు మొదలుపెట్టారు.

A case Filed against jabardasth Artist Nava Sandeep who cheated a woman in the name of love

గాయకుడు, కమెడియన్ అయిన నవ సందీప్ గోల్కొండ ప్రాంతంలో నివసిస్తున్న కారణంగా అమీర్ పేట యువతి గోల్కొండ పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేసినట్లుగా చెబుతున్నారు. నిజానికి జబర్దస్త్ నటుల మీద కేసులు నమోదవడం కొత్త ఏమీ కాదు. గతంలో పరదేశి, దొరబాబు కూడా వ్యభిచారం కేసులో పట్టుబడ్డారు. ఆ తర్వాత అదే విషయం మీద అనేక స్కిట్లు కూడా చేశారు. అంతే కాదు హరి అనే ఒక వ్యక్తి కొన్నాళ్లపాటు జబర్దస్త్ లో కొన్ని ఎపిసోడ్స్ లో కనిపించి ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడు.

అయితే ఇలా అమ్మాయిని మోసం చేశారనే కేసు మాత్రం తొలిసారిగా నవ సందీప్ మీద రావడం గమనార్హం. మరి ఈ విషయంలో నవ సందీప్ ఎలా స్పందిస్తాడు. నిజంగా తాను ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నాడా లేదా అనే విషయాలు పోలీసులు త్వరలోనే తేల్చిబోతున్నారు. ఈ విషయం స్పందన ఎలా ఉంటుంది అనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X