వాడు ఏమైనా నా మొగుడా? హమీదాను కడిగిపడేసిన ప్రియాంక

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 5 ఐదోవారంలోకి ప్రవేశించింది. ఇంటి సభ్యులు తమ వ్యూహాలకు పదునుపెడుతూ ముందుకు వెళ్తున్నారు. సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో నామినేషన్ల ప్రక్రియ కొనసాగే ముందు కంటెస్టెంట్లలో టెన్షన్ కనిపించింది. ఇంటి సభ్యులు ఒకరిపై మరొకరు వాగ్బాణాలు సంధించుకొన్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య హమీదా ఖాతూన్, ప్రియాంక మధ్య చిన్న గొడవ ఆసక్తిని రేపింది. హమీదాను ప్రియాంక గట్టిగా మందలిస్తూ..

శ్రీరామచంద్రతో హమీదా రొమాన్స్

శ్రీరామచంద్రతో హమీదా రొమాన్స్

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో ప్రారంభమైనప్పటి నుంచి సింగర్ శ్రీరామచంద్రతో కలిసి హమీదా ఖాతూన్ రొమాన్స్ పడిస్తున్నది. ప్రేక్షకులకు వీరిద్దరి ముద్దులు మురిపాలు వినోదాన్ని పంచుతున్నాయి. శ్రీరామచంద్రతో కలిసి ఇంటి కిచెన్‌లో హమీదా ఖాన్ చురుకుగా పాల్గొంటున్నారు. వంటవార్పు విషయంలో హమీదా తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు.

ప్రియాంకను కెలికిన హమీదా

ప్రియాంకను కెలికిన హమీదా

ఇక ప్రియాంక విషయానికి వస్తే... చాలా రోజులుగా ఇంటి సభ్యులకు భోజన సదుపాయాలు అందిస్తున్నారు. ఇంటి సభ్యులకు ఏం కావాలో అవన్నీ చక్కగా సమకూరుస్తున్నారు. అయితే తన పని విషయంలో ఎవరైనా జోక్యం చేసుకొన్నా.. తనను ప్రశ్నించిన ముఖం మీదే గట్టిగా ఇచ్చి పారేస్తూ కనిపిస్తున్నారు. ఇలాంటి ప్రియాంకను హమీదా కెలికడంతో ఆమె గట్టిగా వార్నింగ్ ఇచ్చినంత పని చేసింది.

ప్రియాంక, హమీదా మధ్య మటన్ కర్రీ చిచ్చు

ప్రియాంక, హమీదా మధ్య మటన్ కర్రీ చిచ్చు

సోమవారం ప్రసారమైన ఎపిసోడ్‌లో ప్రియాంక సింగ్ ఇంటి సభ్యులకు వంట చేస్తూ కనిపించింది. మటన్ కర్రీ ప్రిపేర్ చేసి అందరికీ సమానంగా పంచుతూ భోజనం పెడుతున్నది. ఆ సమయంలో హమీదా అక్కడికి వచ్చి ఎన్ని ముక్కలు ఉన్నాయి అంటూ ప్రశ్నించింది. అయితే నేను లెక్క పెట్టడం లేదు. ఈ కూరలో ఎలా ముక్కలు లెక్కపెడుతాం. అది కుదరదు అంటే.. లేదు నేను లెక్క పడుతాను అంటూ హమీదా చేతిలోని గరిటెను తీసుకొన్నది. దాంతో ప్రియాంకకు తిక్క రేగింది.

ఎలా వడ్డించాలో నాకు తెలియదా?

ఎలా వడ్డించాలో నాకు తెలియదా?

బిగ్‌బాస్ ఇంటిలో ఇన్ని రోజుల నుంచి నేను వంట చేస్తున్నాను. ఎవరికి ఏమీ ఇవ్వాలో నాకు తెలియదా? ఎవరికి ఎలా వడ్డించాలో నాకు తెలియదా? ఇప్పుడు వచ్చి అదీ.. ఇది అంటే కుదరదు అంటూ హమీదాపై మండిపడింది. ఆ తర్వాత అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోయింది. హమీదా తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ బుసలు కొట్టింది. నేరుగా బెడ్ రూమ్‌లోకి వెళ్లి తనలో తానే మాట్లాడుకొంటూ కోపంతో ఊగిపోయింది.

మటన్ పీసులు అంటూ ప్రియాంక

మటన్ పీసులు అంటూ ప్రియాంక

హమీదాపై అసహనం వ్యక్తం చేస్తూ మటన్ పీసులు ఎలా లెక్కపెడుతాం. మటన్ కొట్టేవాడు ఏమైనా నాకు తెలుసా? వాడేమైనా నా మొగుడా? అంటూ ప్రియాంక ఘాటుగా స్పందించింది. ఇలా మటన్ వ్యవహారం హమీదా, ప్రియాంక మధ్య ఘాటుగా మాటల యుద్ధం నడిచింది. ప్రియాంక కోపంతో ఊగిపోతుంటే ఇంటి సభ్యులు మౌనంగా వారిద్దరిని గమనిస్తూ కనిపించారు.

Recommended Video

KondaPolam : Panja Vaishnav Tej's Kondapolam Audio Release Event
ఐదోవారం ఎలిమినేషన్ కోసం తొమ్మిది మంది

ఐదోవారం ఎలిమినేషన్ కోసం తొమ్మిది మంది

ఇక ఇదిలా ఉంటే.. ఐదోవారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. సీక్రెట్ రూమ్‌లో సాగిన నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకొంటూ నామినేట్ చేసుకొన్నారు. ఇంటిలో ఎక్కువ మంది షణ్ముఖ్ జస్వంత్‌ను నామినేట్ చేశారు. దాదాపు ఎనిమిది మగ సభ్యులు నామినేట్ చేయడం గమనార్హం. షణ్ముఖ్, వీజే సన్నీ, జస్వంత్, యాంకర్ రవి, మానస్, విశ్వ, హమీదా ఖాతూన్, లోబో, శైలజా ప్రియ నామినేట్ అయ్యారు. ఈ వారం కూడా టాప్ కంటెస్టెంట్లు నామినేట్ కావడంతో ఈ సారి ఎలిమినేషన్ మరింత ఆసక్తిగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X