Brahmamudi July 4th Episode:మర్డర్ కేసులో అప్పు అరెస్ట్.. ప్రాణాపాయ స్థితిలో రాజ్!

అప్పు తన ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ ఉండగా ఎపిసోడ్ ప్రారంభం అవుతుంది. అయితే అందులో రాకేష్ అనే వ్యక్తి.. అప్పు వల్ల అక్కలను కించపరుస్తూ మాట్లాడుతాడు. ఇక అప్పు కోపంతో ఊగిపోతుంది. అంతే గ్రౌండులోనే రాకేశ్ తలపగులగొట్టేస్తుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్తుంది. ఏమైంది డల్ గా ఉన్నావంటూ కనకం అడగ్గా... వెళ్లి బట్టలు పిండు నన్ను పిండకు అని సీరియస్ అవుతుంది. ఏమైంది దీనికి అని కనకం అనుకుంటుంది. అప్పు రాకేశ్ గురించి ఆలోచిస్తూ... ఏమైందో ఏంటోనని కంగారుపడిపోతుంది.

మరోవైపు రాజ్, కావ్య ఆఫీసుకు వస్తారు. అక్కడ వారితో కావ్య మాట్లాడుతుంది. రాజ్... క్లయింట్ వచ్చేశారా అని మేనేజర్ ను అడుగుతాడు. అవును సర్.. వెయిట్ చేస్తున్నారని సమాధానం ఇవ్వగా... ఇంకా డిజైన్స్ కాలేదంటే.. ఎలా చూస్తారో తెలుసా అని రాజ్ ఫైర్ అవుతాడు. మన గురించి విన్నదానికి, ఇక్కడ చూస్తున్నదానికి తేడా చూసి ఏమనుకుంటారోనని అంటాడు.

A Good News For Raj in July 4th 2023 Episode number 139 in Brahmamudi Telugu Serial

ఎంప్లాయ్ శృతి డిజైన్స్ పట్టుకుని రాగా.. అవి చూసిన రాజ్.. ఫస్ట్ ఈ అమ్మాయికి శాలరీ సెటిల్ చేసి పంపిచమని అరుస్తాడు. క్లయింట్స్ అమెరికా నుంచి వచ్చిందే.. మనం పురాతన డిజైన్స్ చేస్తామని అని, కొత్త డిజైన్స్ అయితే ముంబయి కంపెనీకి ఇచ్చేవారని రాజ్ అంటాడు. కావ్యను వెళ్లి తన క్యాబిన్లో కూర్చొమని చెప్పి, క్లయింట్స్ దగ్గరకు వెళ్తాడు రాజ్. డిజైనర్ ఇంకా రాలేదని, కాసేపు ఆగమని చెబుతాడు. సరే అని.. మాకు ఇరానీ చాయ్ ఇప్పించమని అడగ్గా.. రాజ్ వాళ్లకి ఏర్పాట్లు చేస్తాడు.

A Good News For Raj in July 4th 2023 Episode number 139 in Brahmamudi Telugu Serial

మరోవైపు కావ్యతో ఎంప్లాయిస్ వచ్చి మాట్లాడుతారు. లాస్ట్ టైం శృతికి వేసి ఇచ్చిన డిజైన్స్ బాగున్నాయని మాట్లాడుకుంటారు. అందరికీ చెప్పేశావా అని కావ్య అంటుంది. ఇంకోవైపు కనకం ఇంటికి పోలీసులు వస్తారు. వాళ్లను చూసిన కనకం.. టెన్షన్ పడుతుంది. మార్వాడీ కంప్లైంట్ ఇచ్చాడా అని భయపడుతుంది. పోలీసులు వచ్చి అప్పు గురించి అడిగి రాకేశ్ తలపగలగొట్టిన విషయం చెబుతారు. అప్పు వచ్చి రాకేశ్ కంప్లైంట్ ఇచ్చాడా అంటుంది. అక్కల గురించి తప్పుగా మాట్లాడడు అని, అందుకే తల పగలగొట్టానని చెబుతుంది. కనకం, మూర్తి ఎంత రిక్వేస్ట్ చేసినా.. అప్పును అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు.

A Good News For Raj in July 4th 2023 Episode number 139 in Brahmamudi Telugu Serial

ఇదిలా ఉంటే.. మరోవైపు క్లయింట్స్ ను రాజ్ ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేస్తూ ఉంటాడు. అయితే వాళ్లే మేం దగ్గరలో ఉన్న టెంపుల్స్ చూసి వస్తామని చెప్పడంతో రాజ్ కు కాస్త ఉపశమనం దొరికినట్టైతుంది. సరే మా డిజైనర్ వస్తే వెయిట్ వస్తాడని, మీరు వెళ్లి రండని చెబుతాడు. ఎంప్లాయ్ శృతి దగ్గరకు క్లాస్ ఇస్తాడు. మన దగ్గర కేవలం రెండు గంటలు మాత్రమే ఉందని.. ఈ లోపు డిజైన్స్ రాకపోతే మీ అంతట మీరే రిజైన్ చేసి వెళ్లాలని చెబుతాడు. కావ్య.. శృతి దగ్గరకు వెళ్తి... ఎంత వరకూ వచ్చిందని అడుగుతుంది. టెన్షన్ లో ఆలోచనలు రావడం లేదని శృతి అంటుంది. నేను ట్రై చేస్తాను.. మీ బాస్ నన్ను ఇలా చూస్తే.. గొడవ అవుతుందని మీ బాస్ వస్తున్నారో లేదో చూసి నాకు చెప్పమని పంపిస్తుంది కావ్య.

సీన్ కట్ చేస్తే.. కనకం, మూర్తి పోలీస్ స్టేషన్ కు వస్తారు. మా అమ్మాయిని విడిచిపెట్టమని కనకం వేడుకుంటుంది. అలా విడిచిపెట్టడం కుదరదమ్మా అని కానిస్టేబుల్ అంటాడు. అప్పు, కనకం మధ్య కాసేపు డిస్కషన్ నడుస్తుంది. వారిపై కానిస్టేబుల్ సీరియస్ అయి వెళ్లిపోమ్మని చెబుతాడు. ఇంకోవైపు కావ్య కొన్ని డిజైన్స్ కంప్లీట్ చేసి శృతి దగ్గరకు తెస్తుంది. తీసుకెళ్లి చూపించమని అంటుంది. కానీ నాకు ఆ క్రెడిట్ వద్దు మేడమ్, గిల్టీగా ఉంటుందని చెబుతుంది.

A Good News For Raj in July 4th 2023 Episode number 139 in Brahmamudi Telugu Serial

మరోవైపు రాజ్ కు క్లయింట్స్ ఫోన్ చేస్తారు. అదే సమయంలో డిజైన్స్ తీసుకెళ్లి రాజ్ కు ఇస్తుంది కావ్య. నేనే రెడీ చేశానని చెబుతుంది. వాటిని రాజ్ చింపి.. డస్ట్ బిన్ లో వేస్తాడు. కావ్య బాధపడుతుంది. అయితే ల్యాప్ టాప్ లో స్కాన్ చేసి కూడా పెడుతుంది కావ్య. వాటినే తీసుకెళ్లి శృతి రాజ్ కు చూపిస్తుంది. అవి చూసిన రాజ్ వావ్ అంటాడు. ఇవి ఓకే అయితే డబుల్ ఇంక్రిమెంట్ ఇస్తానని చెప్పి.. క్లయింట్స్ దగ్గరకు వెళ్లి డిజైన్స్ చూపిస్తాడు రాజ్. డిజైన్స్ చూసిన క్లయింట్స్.. సూపర్ అని లేచి క్లాప్స్ కొడతారు. కానీ రాజ్ కు మాత్రం అవి కావ్య వేసిన డిజైన్స్ అని తెలియదు. శృతిని పిలుస్తాడు. ఈమె డిజైనర్ అని చెబుతాడు. వాళ్లు కూడా అభినందిస్తారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. తర్వాతి ఎపిసోడ్లో కావ్య, రాజ్ నిద్రపోతుంటారు. రాజ్ కి సరిగా ఊపిరి ఆడదు. ఏం జరగనుందో రేపటి ఎపిసోడ్ లో తెలియనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X