Bigg Boss Telugu 8 : బిగ్‌బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో తేల్చేసిన అభిమాని .. నాగార్జున ముందే

బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా 9వ వారాలు పూర్తి చేసుకుని మరికొద్దిగంటల్లో 10వ వారంలోకి అడుగుపెట్టనుంది. అంటే ఆల్‌మోస్ట్ సీజన్ ఎండింగ్ స్టేజ్‌కి వచ్చేసింది. దీంతో హౌస్‌లో ఉన్న వారిలో విన్నర్ ఎవరు కానున్నారనే దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. లిస్ట్‌లో చాలా మంది పేర్లు వినిపిస్తుండగా.. వారం వారం ఫలితాలు మారిపోతున్నాయి. తాజాగా ఈ వీక్ పర్ఫార్మెన్స్‌తో బిగ్‌బాస్ తెలుగు 8 టైటిల్ విన్నర్‌గా ఒకరి పేరు బాగా వినిపిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..

ప్రతి ఏటా బిగ్‌బాస్‌ సీజన్ ఎప్పుడొచ్చినా విన్నర్ ఎవరో అంచనా వేస్తారు ప్రేక్షకులు. వాళ్ల పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంటాయి. కానీ 8వ సీజన్‌ మాత్రం ఆడియన్స్‌ ఊహకి కూడా అందడం లేదు. కంటెస్టెంట్స్‌ అంతా టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఇస్తుండటంతో ఎవరు టాప్ 5లో ఉంటారో అర్ధం కావడం లేదు. తొలి రెండు వారాలు నిఖిల్ ‌తన లీడర్‌షిప్ క్వాలిటీస్, దూకుడుతో అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు. దీంతో ఈసారి ఖచ్చితంగా ఈ సీజన్ విజేత నిఖిలేనని వార్తలు వచ్చాయి.

a man predicts Prithviraj Shetty as winner of bigg boss telugu 8 infront of akkineni nagarjuna

ఈ తర్వాత ఆడపులిగా తనకు తానుగా డిక్లేర్ చేసుకున్న సోనియా ఆకుల పేరు విన్నర్ రేసులో వినిపించింది. దూకుడైన ఆట, మంత్రాంగంతో ఈమె శివాజీని గుర్తుచేసింది. కానీ పృథ్వీ, నిఖిల్‌లను అడ్డుపెట్టుకుని సోనియా గేమ్ ఆడటంతో అనూహ్యంగా నాలుగో వారంలో ఎలిమినేట్ అయి ప్రేక్షకులకు షాకిచ్చింది. అయితే ఆమె త్వరలోనే హౌస్‌లో తిరిగి రీ ఎంట్రీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది.

ఇక కొద్దిరోజులుగా టైటిల్ రేసులో వినిపించిన మరో పేరు నబీల్ అఫ్రిది. స్లో అండ్ స్టడీ ఆటతీరుతో , మంచి మనసుతో మెప్పిస్తున్న నబిల్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కుతోంది. రెండు వారాల పాటు ఓటింగ్‌లో నెంబర్‌వన్‌గానూ నిలిచి అనూహ్యంగా రేసులోకొచ్చాడు ఈ యూట్యూబర్. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ఏ ఒక్క కంటెస్టెంట్ కూడా నబిల్ గురించి బ్యాడ్‌గా చెప్పలేదంటే అతని వ్యక్తిత్వాన్ని అర్ధం చేసుకోవచ్చు. ఈ వారం మరోసారి మెగా చీఫ్ అయ్యే ఛాన్స్ వచ్చినా అవినాష్ కోసం త్యాగం చేశాడు. తాను ఒకసారి మెగా చీఫ్ అయ్యానని, నువ్వు అయితే చూడాలని ఉందని చెప్పి అతనికి సహకరించి తన పెద్ద మనసును చాటుకున్నాడు. ఇది అతని పట్ల ప్రేక్షకుల్లో సదభిప్రాయం కలిగించింది.

పైన పేర్కొన్నవాళ్ల గురించి సోషల్ మీడియాలో అనుకున్నదే కానీ ఈసారి మాత్రం బిగ్‌బాస్ తెలుగు 8 విన్నర్ ఎవరో ఏకంగా హోస్ట్ అక్కినేని నాగార్జున ముందే కుండబద్ధలు కొట్టాడో అభిమాని. బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్‌ను లైవ్‌లో చూసేందుకు వచ్చిన ఓ వ్యక్తితో నాగ్ మాట్లాడుతూ.. ఫేవరేట్ కంటెస్టెంట్ గురించి అడుగుతారు. దీంతో తనకు పృథ్వీ అంటే చాలా ఇష్టమని ఆ వ్యక్తి చెప్పాడు. పృథ్వీ టాస్క్‌లలో గెలిచినా, ఓడినా సరే ఎలాంటి అటిట్యూడ్ చూపించకుండా కామ్‌గా వెళ్లిపోతాడని ప్రశంసించాడు. దీనికి సంబంధించిన వీడియోను ఓ వ్యక్తి ఎక్స్‌లో ట్వీట్ చేశాడు. బిగ్‌బాస్ విన్నర్ అయ్యే అర్హత పృథ్వీలో ఉందని.. కానీ సరైన పీఆర్ అతనికి లేదని సదరు యూజర్ బాధపడ్డాడు. మరి ఆ అభిమాని జోస్యం చెప్పినట్లుగా పృథ్వీయే ఈ సీజన్ విజేత అవుతాడా ? లేదా అన్నది మరికొద్ది వారాల్లో తేలిపోనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X