Brahmamudi November 20th: స్వప్న ప్రియుడి గురించి రాజ్ ఎంక్వైరీ.. మూర్తికి తెలిసిపోయిన అప్పు, కల్యాణ్ ప్రేమ
ఈరోజు బ్రహ్మముడి సీరియల్ (నవంబర్ 20వ తేదీన) కృష్ణమూర్తితో కనకం అప్పు ప్రేమ విషయం చెప్పేస్తుంది. అది విన్న కృష్ణ మూర్తి షాక్ అయ్యాడు. అప్పు కూడా అందరి ఆడపిల్లలాగే చేస్తుందని అనుకోలేదు... అంటూ బాధఫడుతాడు. అప్పు ఎవరిని ప్రేమించిందని కృష్ణ మూర్తి అడుగుతాడు. కల్యాణ్ బాబు అని చెప్పగానే.. మరింత షాక్ అవుతాడు. ఇక కల్యాణ్ అప్పును ప్రేమించడం లేదని తెలుసుకుంటాడు. ఇక ఇక్కడితో ఈ విషయం మరిచిపోదాం.. ఇప్పటికే ఇద్దరి ఆడపిల్లలను ఆ ఇంటికి పంపాం.. ఇప్పుడు మూడో దాన్ని కూడా పంపితే.. కావాలని చేశామని అనుకుంటారు.
అదృష్టం కొద్ది కల్యాణ్ అనామికను ప్రేమించాడు.. లేకపోతే.. అప్పు కల్యాణ్ మీద ఆశలు పెంచుకునేది.. వాళ్ల నిందలు నిజమయ్యేవి.. ఈ విషయం బయటకు రాకుండా చూసే బాధ్యత నీదే అంటూ కనకంకు మూర్తి చెప్తాడు. మరోవైపు రాజ్ ను పెద్దావిడ పిలుస్తుంది. నీతో ఓ విషయం మాట్లాడాలి అని ఇందిరాదేవి చెప్తుంది. ఏమైంది నానామ్మ అని అడుగుతాడు రాజ్. ఎలా చెప్పాలో అర్ధం కావడం లేదు.. అందుకే నీతో చెప్తున్నా అని ఇందిరాదేవి అంటుంది. ఆ తర్వాత అరుణ్ ఫోటో చూపిస్తుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు.

ఇతను ఎవరో నాకు తెలియదు... ఎవరు పంపించారు.. ఎందుకు పంపించారు తెలియదు... ఈ ఫోటోతో పాటు స్వప్నతో పాటు ఆ అబ్బాయి కలిసి ఉన్న ఫోటోలు ఉన్నాయని రాజ్ కు చెప్పుంది ఇందిరాదేవి. స్వప్నను అడిగితే.. నాకు తెలియదు అని చెప్పింది.. ఇంట్లో గొడవలు జరుగుతాయని అనిపిస్తుంది.. అని ఇందిరాదేవి బాధ పడుతుంది. ఆ ఫోటో ఇచ్చి ఎవరో ఏంటో కనుక్కో అని చెప్తుంది. ఇక రాజ్.. ముందు కళావతిని అడిగితే అసలు విషయం తెలుస్తోందని రాజ్ మనసులో అనుకుంటాడు.
ఇక గదిలోకి వెళ్తాడు. ఇక కావ్య సెటైర్స్ వేస్తుంది. ఎందుకు వచ్చారు... అంటూ రాజ్ మీద సెటరికల్ గా మాట్లాడుతుంది. ఇక రాజ్ ఆ ఫోటో తీసి ఇతను నీకు తెలుసా అని అడుగుతాడు. ఇక కావ్య మనసులో ఈ ఫోటో రాజ్ దగ్గరకు ఎలా వచ్చిందని అనుకుంటుంది. ఇంతలో హాలో మేడం చెప్తారా అంటే... అతని పేరు అరుణ్ మా అక్క క్లాస్ మేట్ అనిి చెప్తుంది. ఇంకా ఏం తెలుసు అని అడిగితే... డాక్టర్ చదివాడు అని తెలుసు అని కావ్య చెప్తుంది. ఇక ఎందుకు అడుగుతున్నారు అని కావ్య అడిగితే చెప్పను అంటూ చెప్పి వెళ్లిపోతాడు రాజ్. ఇక ఈ కళవతి మాటలు ఎందుకు నమ్మాలి మన ప్రయత్నం మనం చేద్దామని రాజ్ మనసులో అనుకుంటాడు.
మరోవైపు కనకం ఇంటికి కల్యాణ్ వస్తాడు. ఏంటి ఇంకా రెడి అవ్వలేదా అని అంటాడు కల్యాణ్. అప్పు చిరాకు పడుతుంది. ఇక మూర్తి కూడా అప్పు నీతో రాదు అంటాడు. ఎందుకు అని కల్యాణ్ అడుగుతాడు. కాలేజ్ కు వెళ్తుందని కనకం కవర్ చేస్తుంది. అయితే రేపు వస్తాను.. రేపు వీకెండ్ కదా అని కల్యాణ్ అంటాడు. ఇక ఓకే అని కనకం చెప్తుంది. రేపు ఏ పని పెట్టుకోకు అని అప్పుకు చెప్పి కల్యాణ్ వెళ్లిపోతాడు. ఇక మూర్తితో కనకం ఆ అబ్బాయితో మర్యాదగా మాట్లాడండి అంటుంది. మన కావ్య మరిది అని మరిచిపోకండి అని చెప్తుంది.

ఆ కూతురు గురించి ఆలోచించి ఈ కూతురిని బాధపెట్టాలా... అప్పుడు కావ్య నాకు పెళ్లి ఇష్టం లేదు అని చెప్పినా.. పెళ్లి చేశాను.. ఇప్పుడు ఈ కూతురు ఇష్టపడినా పెళ్లి చేయలేకపోతున్నా అంటూ మూర్తి బాధపడుతాడు. మరోవైపు స్వప్నతో మాట్లాడేందుకు కావ్య వెళ్తుంది. ఏమైందే అని స్వప్న అంటుంది. అనుమానపడుతున్నారు అని చెప్తుంది.. అది నీ ప్రాబ్లం అని స్వప్న అంటుంది. నన్ను కాదు.. నిన్ను అనుమానిస్తున్నారు అని కావ్య స్వప్నతో అంటుంది.
నువ్వు నాదగ్గర ఏదో దాస్తున్నావ్ అని కావ్య అంటుంది. స్వప్న కావ్యతో వాదించి దైర్యంగా వెళ్లిపోతుంది. ఇక రాహుల్ నా పెళ్లాం దైర్యంగా ఉంది.. స్టేజ్ 2 మొదలు పెట్టాలి అని రాహుల్ అనుకుంటాడు. ఇక అరుణ్ కు ఫోన్ చేసి... నా పెళ్లాన్ని డబ్బులు అడుగు అని చెప్తాడు. అరుణ్ కూడా ఓకే అంటాడు. మరోవైపు రాజ్.. అరుణ్ ఎవరో కనుక్కోమని పోలీసుకు చెప్తాడు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది. మరుసటి ఎపిసోడ్ లో రాజ్, కావ్య గదిలో దొంగ పడుతాడు. రాజ్ కావ్యను కట్టేసి.. బెదిరిస్తాడు.


Click it and Unblock the Notifications











