‘బ్లడీఫూల్’ అంటూ ఆది కౌంటర్.. యాంకర్ సమ ఎన్‌కౌంటర్ అదిరింది!
సినీ హీరో అక్కినేని అఖిల్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మిస్టర్ మజ్ను ప్రి రిలీజ్ ఫంక్షన్‌లో కమెడియన్ ఆది, స్టార్ యాంకర్ సుమ ఒకరిపై ఒకరు పంచ్‌లు వేసుకొన్నారు. వారి మాటల గ్యారడి ప్రేక్షకులను వినోదంలో ముంచెత్తింది. వేదిక పై సుమ చేసిన అల్లరికి కౌంటర్ ఇస్తూ ఆది ఏమన్నారంటే..
మిస్టర్ మజ్ను ఫంక్షన్‌కు సుమనే కదా యాంకర్ అనగా.. హీరోలు మారుతుంటారు. సినిమా వేదికలు మారుతుంటాయి. సుమ గారు ఎందుకు మారుతారురా బ్లడీ ఫూల్ అన్నానని ఆది తెలిపాడు. అందుకు సుమ స్పందిస్తూ.. ఎవర్ గ్రీన్ హీరోలు అంటే అక్కినేని ఫ్యామిలీ. అలాంటి హీరోలకు ఎవర్ గ్రీన్ లాంటి నేను కాకపోతే ఎవరు యాంకర్‌గా ఉంటారు. ఇక మీరు మాట్లాడుకోండి అంటూ సుమ తన స్టయిల్‌లో అక్కడ నుంచి తప్పుకొన్నారు.

అక్కినేని నట వారసుడు అక్కినేని అఖిల్, దర్శకుడు వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వస్తున్న మిస్టర్ మజ్ను సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్‌లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు. అలాగే నాగార్జున, అక్కినేని నాగచైతన్య, హీరోయిన్ నిధి అగర్వాల్, నిర్మాత భోగవల్లి ప్రసాద్, ఎస్ఎస్ తమన్ కూడా వేదికను అలంకరించారు.


Click it and Unblock the Notifications











