అంత అందగత్తె నాకు దొరికితే... బుల్లితెర నటిపై కమెడియన్ అలాంటి కామెంట్స్
కన్నడ ఇండస్ట్రీకి చెందిన అమ్మాయే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు నటి కావ్యశ్రీ. గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టిన కావ్య.. ఆ తర్వాత పలు సీరియల్స్, ప్రోగ్రామ్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. బిగ్‌బాస్ తెలుగు 8 విజేత నిఖిల్‌తో డేటింగ్, బ్రేకప్ కూడా ఈమెకు ఫేమ్ తీసుకొచ్చింది. ఏ షోలో అడుగుపెట్టినా ఆమె వ్యక్తిగత జీవితం, నిఖిల్‌తో ప్రేమాయణానికి సంబంధించిన విషయాలు అడుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ షోలో కమెడియన్.. కావ్యశ్రీపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
బెంగళూరుకు చెందిన కావ్యశ్రీ తొలుత కన్నడ టెలివిజన్ రంగంలో తన అదృష్టం పరీక్షించుకున్నారు. నీలి, నాయకి, మహాకాళి తదితర సీరియల్స్‌తో లేడీ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. ఈ ఫేమ్‌తో తెలుగులోనూ కావ్యకి అవకాశాలు వచ్చాయి. కోయిలమ్మ, గువ్వా గోరింకా తదితర సీరియల్స్‌తో తెలుగు ప్రజలకు బాగా దగ్గరయ్యారు. గోరింటాకు సీరియల్‌లో తన సహ నటుడు, బిగ్‌బాస్ తెలుగు 8 విజేత నిఖిల్ మలియాక్కల్‌తో కావ్యకు పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారింది. కొద్దిరోజుల అనంతరం తమ బంధాన్ని బహిరంగంగానే తెలియజేసింది ఈ జంట. ఆ తర్వాత పలు టీవీ షోలు, ఈవెంట్స్‌లలో కావ్య, నిఖిల్‌లు జంటగానే పాల్గొన్నారు.

కానీ ఏం జరిగిందో ఏమో కానీ నిఖిల్- కావ్యలు విడిపోయారు. నిఖిల్ గురించి మాట్లాడానికి కూడా ఆమె ఇష్టపడటం లేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఒకానొక దశలో తనకు పెళ్లి మీద కూడా ఇంట్రెస్ట్ లేదని తేల్చిచెప్పేసింది. తనను పదే పదే నిఖిల్ గురించి అడిగి ఇబ్బంది పెడుతుండటంతో కావ్య ఓపిక నశించింది. ఓ కార్యక్రమంలో సహనం కోల్పోయిన ఆమె.. నా గతాన్ని అడిగి నన్ను ఏడిపిస్తున్న వారికి నా లాంటి గతే పడుతుందని శాపనార్ధాలు పెట్టింది.
ఇకపోతే.. స్టార్ మాలో ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం కార్యక్రమంలో కావ్యశ్రీ రెగ్యులర్‌గా పాల్గొంటారు. ఈ వారం హోలీ కావడంతో ఈ వీక్ అందంగా ముస్తాబైంది ఈ షో. దీనికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. అమ్మాయిలు, అబ్బాయిలు వైట్ డ్రెస్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా కలర్‌ఫుల్ సెలబ్రేషన్స్ పేరిట అబ్బాయిలకు, అమ్మాయిలకు రంగులోనే బొట్టు పెట్టింది యాంకర్ శ్రీముఖి. ఆ వెంటనే ఒకరిపై ఒకరు రంగులు చల్లుకున్నారు.
బేబీ నా మీద రంగులు పూసేశారని శ్రీముఖి కంప్లయంట్ చేయగా... యాదమ్మరాజు ఆమెను పట్టుకుని ఎవడు వాడు అంటూ నిలదీయడానికి వెళ్లాడు. నా పిల్లకు ఏమైనా అయితే ఎఫెక్ట్ అవుతానని వార్నింగ్ ఇచ్చాడు. నువ్వు ఆల్రెడీ ఎఫెక్ట్ అయినట్లు ఉన్నావని ఇమ్మాన్యుయేల్ పంచ్ విసరడంతో అంతా నవ్వేస్తారు. ఆ తర్వాత రౌడీ రోహిణికి హ్యాపీ హోలీ అంటూ ఎద, మెడ భాగంపై పసుపు రంగు పూసేసింది శ్రీముఖి. అది చూసి అబ్బాయిలంతా షాక్ అయ్యారు. నీకు నేను పూసినట్లే కావ్యకి నువ్వు పూయి అంటూ రోహిణికి శ్రీముఖి టాస్క్ ఇచ్చింది.
దానికి కమెడియన్ హరి స్పందిస్తూ.. కావ్య లాంటి అందమైన అమ్మాయి మీద కవితలు రాయాలి, రంగులు రాయకూడదు అర్ధమైందా అంటూ ఆమెను పొగిడేయడంతో అమ్మాయిలంతా గోల గోల చేశారు. ముందు నువ్వు ఎపిసోడ్‌కి ఏమైనా రాయమంటూ ఇమ్మాన్యుయేల్ పంచ్ విసురుతాడు. ఇంతలో నువ్వు చేత్తో కాకుండా బుగ్గకి రంగు పూసుకుని ఇమ్మాన్యుయేల్ బుగ్గకి రాయాలని కావ్యకి చెబుతుంది శ్రీముఖి. ఆ మాటలకు కావ్య షాక్ అవుతుంది. అయితే నాక్కూడా పృథ్వీతో అలాగే కావాలని మారాం చేస్తుంది రోహిణి. తర్వాత బుల్లితెర సెలబ్రిటీలంతా హోలీని సెలబ్రేట్ చేసుకుంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి హరి మాటలకు కావ్య పడిపోయిందా? ఇమ్మాన్యుయేల్ బుగ్గ మీద రంగు పూసిందా? లేదా తెలియాలంటే ఈ ఆదివారం 11 గంటలకు ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











