‘ఆగడు’, ‘లెజండ్’ కలిపే అమ్మారు
హైదరాబాద్ : బాలకృష్ణ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం 'లెజండ్' . ఈ చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ వారే ఇప్పుడు 'ఆగడు' చిత్రాన్ని సైతం నిర్మిస్తున్నారు. రీసెంట్ గా 'ఆగడు' టీజర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ నేపధ్యంలో ఈ రెండు చిత్రాలని కలిపి ప్యాకేజ్ గా శాటిలైట్ రైట్స్ అమ్మారని ట్రేడ్ వర్గాల సమాచారం. జెమినీ టీవీ ఛానెల్ వారు ఈ రైట్స్ సొంతం చేసుకున్నారని తెలుస్తోంది. ఈ మేరకు నిర్మాతలకు 16 కోట్లు పే చేస్తారని చెప్పుకుంటున్నారు.
కృష్ణ పుట్టినరోజు సందర్భంగా శనివారం 'ఆగడు' టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో మహేష్ పలికిన సంభాషణలు అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపాయి. ''సినిమాల ప్రభావం జనాలమీద ఎంతుందో తెలియదుగానీ, పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది..'' అంటూ పంచ్‌లపై ఓ పంచ్ వేశారు. ''ప్రతివోడూ పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలంటూ ఎదవ కంపేరిజన్‌లు, ఒళ్లు వులపరం వచ్చేస్తోంది..'' అంటూ ఇంకోటి. మొత్తానికి టీజర్ మొత్తం హుషారుగా సాగిపోయింది.

పంచ్ డైలాగు లేకపోతే.. టీజర్, ట్రైలర్ పూర్తవడం లేదు. ఆఖరి పంచ్ హీరోదైతే ఆ కిక్కే వేరుగా ఉంటుందని సినీ జనాలకు అర్థమయ్యింది. అందుకే పంచ్‌లు పేలుతున్నాయి. అయితే మహేష్‌బాబు మాత్రం పంచ్‌లపైనే పంచ్ వేసేశాడు. 'ఆగడు' టీజర్‌లో. మహేష్‌బాబు, శ్రీనువైట్ల కలయికలో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'ఆగడు'. తమన్నా కథానాయిక. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.


Click it and Unblock the Notifications











