ఆమె కథ సీ‘రియల్’ జంట.. నవ్యస్వామి-రవికృష్ణకు పెళ్లి!
బుల్లితెరపై ప్రేమ కహనీలు కొత్తేమీ కాదు. అందులో కొన్ని తెర మీద కెమిస్ట్రీ పండించడం కోసమే వేషాలు వేస్తుంటారు. అయితే అందులో రష్మీ సుధీర్ జంటను మొదటగా చెప్పుకోవాలి. తమ మధ్య ఏమీ లేదంటూనే చెప్పుకొస్తారు.. కానీ తెర మీదకు వచ్చేసరికి వారిద్దరి మధ్యకెమిస్ట్రీ పీక్స్‌లోకి వెళ్తుంటుంది. అయితే ఇప్పుడు రష్మీ సుధీర్ జంటకు ప్రత్యామ్నాయంగా ఓ క్రేజీ జంటను పుట్టించాలని బుల్లితెర బాగానే ప్రయత్నిస్తోంది.

ఆమెకథ సీరియల్‌తో..
బుల్లితెరపై సీరియల్స్‌లో జంటగా నటిస్తూ ఉండగా వారి మధ్య ఉన్న కెమిస్ట్రీ బాగా కుదిరితే ఇక మిగతా షోల్లోనూ వారిదే హవా ఉంటుంది. అలా ఆమె కథ సీరియల్‌లో రవికృష్ణ, నవ్యస్వామి జంటకు మంచి పేరు వచ్చింది. అందుకే ఈ ఇద్దరిని మిగతా షోలకు గెస్ట్‌లుగా పిలుస్తున్నారు.

తాజాగా అక్కడ..
వినోద కార్యక్రమాల్లో ఇప్పుడు చానెళ్ల మధ్య పోటీ పెరిగింది. కామెడీ స్టార్స్‌లోకి శేఖర్ మాస్టర్‌ను లాగారు. అందుకే శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో స్టార్ మా సీరియల్స్ నటీనటులను లాగుతున్నారు. తాజాగా రవికృష్ణ నవ్యస్వామి ఇద్దరూ కూడా ఈ షోలో పాల్గొన్నారు.

శ్రీదేవీ డ్రామా కంపెనీలో..
నవ్యస్వామి రవికృష్ణకు జంటకు బుల్లితెరపై మంచి క్రేజ్ ఉంది. అందుకే ఇలా తమ షోకి తీసుకొచ్చి పెళ్లి అనే తంతును క్రియేట్ చేశారు. ఇది ఓల్డ్ ఫార్మాట్ అయినా కూడా.. చేసేది షో కోసమే అయినా కూడా ఈ జంట మాత్రం నిజంగానే అన్నట్టుగా కెమిస్ట్రీని పండించేశారు.

ముద్దులతో రచ్చ..
రవికృష్ణ నవ్యస్వామిలు షోల్లోకి వచ్చినప్పుడు ముద్దులుపెట్టుకోవడం వంటివి కామన్ అయిపోతున్నాయి. హగ్గులు, ముద్దులు అన్నీ కూడా కామన్ కాగా.. జనాలకు కూడా ఈ ఇద్దరి మధ్య ఏదో జరుగుతోందనే అనుమానం కలుగింది. శ్రీదేవీ డ్రామా కంపెనీలోనూ ఇద్దరూ ముద్దులతో రెచ్చిపోయారు.

లవ్ యూ ఐ..
ఉప్పెన సినిమాలో మాదిరిగా లవ్ యూ ఐలు ఇద్దరూ చెప్పుకున్నారు. మొదటగా రవికృష్ణ లవ్ యూ ఐ చెప్పేశాడు. అలా ఎందుకు అని నవ్య స్వామి అడగ్గా.. మన ఇద్దరి మధ్య ప్రేమ ఎందుకు అని పక్కన పెట్టేశా అని చెప్పడంతోనే నవ్యస్వామి ఫిదా అయింది. వెంటనే ఆమె కూడా తిరిగి లవ్ యూ ఐ చెప్పేసింది. అయితే చివర్లో తాళి కూడా కట్టేసినట్టు చూపిస్తున్నారు. మరి చివర్లో ఏం జరిగిందో చూడాలి.


Click it and Unblock the Notifications











