కార్మికుల కోసం ప్రధానిని కలిసిన అమీర్

ఇటీవలే దేశంలోని పారిశుధ్య కార్మికుల సమస్యలపై అమీర్ తన షోలో చర్చించారు. వారు తమ పనులు సమర్థవంతంగా నిర్వహించబట్టే దేశం కంపుకొట్టకుండా ఉంటుందని...అలాంటి వారి సమస్యలను త్వరితగతిన తీర్చాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.
గతంలో అమీర్ ఖాన్ తన షోలో వైద్య రంగంలో జరుగుతున్న పలు అక్రమాలు కళ్ళకు కట్టినట్లుగా చూపించారు. వైద్య పరీక్షల సందర్భంగా ప్రయోగశాలలకు కమీషన్లు ఇవ్వడం..పరీక్షలు చేయాల్సినవసరం లేకపోయినా పరీక్షలు చేయించుకోవాలని చెప్పడం..మందుల వాడకం..మందుల ధరల్లో తేడాలు ఉండడం వంటి విషయాలు షోలో చూపించడం జరిగింది. దానిపై స్పందించిన కేంద్ర 'పార్లమెంటరీ ప్యానల్' అమీర్‌కు ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే.
అమీర్ ఖాన్ నిర్వహిస్తున్న ఈ షోకు దేశ వ్యాప్తంగా మంచి స్పందన వస్తోంది. అమీర్ ఎంచుకుంటున్న సమస్యలు సమాజానికి మంచి చేసే విధంగా ఉండటమే ఇందుకు కారణం. కొన్ని అంశాలైతే వీక్షకుల మనసుల కదిలించి కన్నీళ్లు పెట్టిస్తుంది. కొన్ని విషయాల్లో మార్పు దిశగా దేశ ప్రజలను కదిలిస్తోంది.


Click it and Unblock the Notifications











