KBC 14 Season లో అమీర్ ఖాన్‌కు భారీగా ప్రైజు మనీ.. అమితాబ్‌ షోలో ఎంత గెలుచుకొన్నాడో తెలుసా?

బుల్లితెర మీద అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న రియాలిటీ షో కౌన్ బనేగా కరోడ్ పతి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో 14 సీజన్ ఇటీవల ప్రారంభమైంది. అయితే ఈ షోలో బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ తన సినిమా లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్‌లో భాగంగా ఈ షోలో అడుగుపెట్టారు. ఈ షో ప్రత్యేకతలు ఏమిటి? అమీర్ ఖాన్ ఎంత గెలుచుకొన్నారంటే..

హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తో

హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తో

భారత దేశం 75వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకొంటున్న నేపథ్యంలో ఈ షోను ఆజాదీ కే గర్వ్ కా మహాపర్వ్ సెలబ్రేషన్స్ పేరుతో తాజా కేబీసీ ఎపిసోడ్ ప్రారంభమైంది. హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తోపాటు అమీర్ ఖాన్, కార్గిల్ వార్‌లో పాల్గొన్న మేజర్ డీపీ సీంగ్, మితాలి మధుమిత్ర, ఎంసీ మేరీ కోమ్, సునిల్ చెత్రీ పాల్గొన్నారు.

7.5 కోట్ల ప్రైజు మనీతో కేబీసీ 14

7.5 కోట్ల ప్రైజు మనీతో కేబీసీ 14


భారత్ 75వ స్వాతంత్ర వార్షికోత్సవం సందర్భంగా సందర్భంగా కొత్త ప్రశ్నను చేర్చారు. ధన్ అమ్రిత్ పేరిట 75 లక్షలను ఆటగాడు గ్యారెంటీగా గెలుచుకోవడానికి 15 ప్రశ్నను కంప్యూటర్ స్క్రీన్‌పై పెట్టారు. ఇక జాక్ పాట్ ప్రశ్నకు మొత్తం 7.5 కోట్లుగా బహుమతిగా నిర్ణయించారు. ఈ సీజన్‌లో బహుమతిని భారీగా పెంచారు. అమీర్ ఖాన్, డీపీ సింగ్, మితాలీ మధుమిత కలిసి ఆడటం ద్వారా 14వ సీజన్ ప్రారంభమైంది. ఈ ఎపిసోడ్‌లో అడిగిన ప్రశ్నలు కొన్ని మీ ముందుకు..

 కేబీసీలో అడిగిన ప్రశ్నలు

కేబీసీలో అడిగిన ప్రశ్నలు


ప్రశ్న: 2022 ఏప్రిల్‌లో భారతీయ సీఈవో స్థాపించిన ఏ సంస్థను ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు?
జవాబు: ట్విట్టర్


ప్రశ్న: 2022లో నారీ శక్తి పురస్కార్ అవార్డును రాష్ట్రపతి ఏ రోజున ప్రదానం చేశారు?
జవాబు: మార్చి 8వ తేదీన

 50 లక్షల ప్రశ్నకు సమాధానం

50 లక్షల ప్రశ్నకు సమాధానం

50 లక్షల రూపాయల కోసం అమీర్ ఖాన్‌, డీపీ సింగ్‌ను ఈ కింద ప్రశ్నను అడిగారు.
ప్రశ్న: ఈ కింద ఇవ్వబడిన ఇద్దరు రాష్రపతులకు భారత రత్న లభించింది?
జవాబు: రాజేంద్ర ప్రసాద్- ఎస్ రాధాకృష్ణన్

అయితే నాలుగు ప్రశ్నల్లో పైన ఇచ్చిన జవాబును చెప్పి అమీర్ ఖాన్, డీపీ సింగ్ 50 లక్షలు గెలుచుకొన్నారు. అయితే కోటి రూపాయల ప్రశ్నకు వెళ్లే ముందు హూటర్ మోగడంతో ఆ రోజకు ఆట ముగిసింది.

కేబీసీలో లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్

కేబీసీలో లాల్ సింగ్ చడ్డా ప్రమోషన్


కౌన్ బనేగా కరోడ్ పతి 14 సీజన్‌లో అమీర్ ఖాన్ తన లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్ చేశారు. సుమారు నాలుగేళ్ల తర్వాత అమీర్ నటించిన చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్నది. గతంలో అమితాబ్‌తో కలిసి థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీగా బోల్తా కొట్టింది.

ఆగస్టు 11న లాల్ సింగ్ చద్దా రిలీజ్

ఆగస్టు 11న లాల్ సింగ్ చద్దా రిలీజ్


ప్రస్తుతం అమీర్ ఖాన్ నటిస్తున్న లాల్ సింగ్ చద్దా హాలీవుడ్‌లో ఆస్కార్ అవార్డులు గెలుచుకొన్న ఫారెస్ట్ గంప్ సినిమాకు రీమేక్. దాదాపు 8 ఏళ్లు ఈ సినిమా హక్కుల కోసం ప్రయత్నించారు. దాదాపు నాలుగు సంవత్సరాలు ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో కరీనాకపూర్, నాగచైతన్య నటించారు. ఈ చిత్రం ఆగస్టు 11వ తేదీన రిలీజ్ కానున్నది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X