Bigg Boss Tamil 4 Winner: తమిళ బిగ్ బాస్‌లో అనుకున్నదే జరిగింది.. విన్నర్‌గా టాలెంటెడ్ యాక్టర్
బిగ్ బాస్ షో ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలో ఈ షో పద్నాలుగేళ్లుగా ప్రసారం అవుతూనే ఉంది. అదే సమయంలో దేశంలోని చాలా భాషల్లోనూ ఇది ప్రారంభం అయింది. వాటిలో దక్షిణాదిలో ఎక్కువ ప్రేక్షకాదరణను అందుకుంటూ దూసుకుపోతోంది. మరీ ముఖ్యంగా తమిళ బిగ్ బాస్‌లో ప్రతి సీజన్‌లోనూ ఏదో ఒక ఊహించని సంఘటన జరుగుతూనే ఉంటుంది. అందుకే దీనికి మరింత స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నాలుగో సీజన్ ముగిసింది. ఆదివారం జరిగిన ఫినాలేలో యంగ్ యాక్టర్ విన్నర్‌గా నిలిచాడు. ఆ వివరాలు మీకోసం!

అన్నింటి కంటే ఇది చాలా ప్రత్యేకం
బిగ్ బాస్ షోను తమిళనాడు ప్రజలు స్వాగతించలేదు. దీంతో దీని ప్రారంభంపై అప్పట్లో నీలి నీడలు అలముకున్నాయి. దీనికితోడు కమల్ హాసన్ హోస్ట్ చేస్తారని తెలియడంతో చాలా మంది దీన్ని వ్యతిరేకించారు. అయినా, బిగ్ బాస్ మాత్రం అట్టహాసంగా ప్రారంభమైంది. ఆ తర్వాత విజయవంతంగా మూడు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పుడు నాలుగో దాన్నీ ముగించింది.

షాకింగ్ సంఘటనలతో హాట్ టాపిక్
బిగ్ బాస్ మొదటి సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొన్న ఓవియా అనే వర్ధమాన నటి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడం కలకలం రేపింది. ఆ తర్వాత మూడో సీజన్‌లోనూ ఇదే తరహాలో 'ఒరుకల్ ఒరు కన్నాడీ' చిత్రంలో హాస్య పాత్రలో నటించిన మధుమిత చాకుతో మణికట్టును కోసుకుంది. దీంతో ఆమెను షో నుంచి బయటకు పంపారు. ఇలా ఎన్నో భయంకరమైన పరిణామాలు జరిగాయి.

అనుమానాల నడుమ నాలుగో సీజన్
వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది తమిళ బిగ్ బాస్ షో. దీంతో నాలుగో సీజన్ ప్రారంభంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అయ్యాయి. దీనికి తోడు కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇది మొదలవుతుందో లేదో అన్న సందిగ్ధత నెలకొంది. ఇలాంటి సమయంలో గత అక్టోబర్ 4న సీనియర్ హీరో కమల్ హాసన్ హోస్టింగ్‌తో నాలుగో సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభం అయింది.

వరదల్లో చిక్కుకున్న హౌస్.. ఆలస్యం
బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆసక్తికరంగానే సాగింది. కమల్ హాసన్ అద్భుతమైన హోస్టింగ్‌కు తోడు కంటెస్టెంట్ల చక్కని ఆటతీరుతో ఇది మంచిగానే ప్రసారం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆ మధ్య వచ్చిన వరదలకు బిగ్ బాస్ సెట్ అతలాకుతలం అయింది. దీంతో కొద్ది రోజుల పాటు కంటెస్టెంట్లను హోటల్‌లో ఉంచారు. అదే సమయంలో షోకు కొంత సమయం బ్రేక్ ఇచ్చారు నిర్వహకులు.

ఫినాలేలో ఐదుగురు కంటెస్టెంట్ల ఎంట్రీ
సరికొత్త టాస్కులు, ఊహించని సర్‌ప్రైజ్‌లు, కంటెస్టెంట్ల గొడవలు సహా ఎన్నో ఆసక్తికర పరిణామాల నడుమ బిగ్ బాస్ నాలుగో సీజన్ రంజుగా సాగింది. ఇందులో పదహారు మంది కంటెస్టెంట్లు పాల్గొనగా.. ఐదుగురు సభ్యులు ఆరి అర్జున, బాలాజీ మురుగదాస్, రియో రాజ్, రమ్య పాండియన్, సోమ్ శేఖర్‌లు టాప్-5కి చేరుకుని.. గ్రాండ్ ఫినాలే కోసం సిద్ధం అయ్యారు.

బిగ్ బాస్ విన్నర్‌గా టాలెంటెడ్ యాక్టర్
మాజీ కంటెస్టెంట్ల ఎంట్రీ.. కమల్ స్టైలిష్ హోస్టింగ్‌తో బిగ్ బాస్ నాలుగో సీజన్ గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా సాగింది. ఇందులో చక్కని ఆటతీరును కనబరుస్తూ వచ్చిన ఆరి అర్జున విన్నర్‌గా, బాలాజీ మురుగదాస్ రన్నరప్‌గా నిలిచారు. సోమ్ శేఖర్ అందరి కంటే ముందే ఎలిమినేట్ అవగా.. ఆ తర్వాత రమ్య పాండియన్ కూడా వెళ్లిపోయారు. ఇక, రియో రాజ్ సెకెండ్ రన్నరప్‌గా నిలిచారు.


Click it and Unblock the Notifications











