Bigg Boss Telugu 7: అడ్డంగా దొరికిపోయిన ఇద్దరు కంటెస్టెంట్లు.. శివాజి చెప్పిందే నిజమైందిగా!

ఎన్నో అనుమానాల నడుమ ప్రతికూల పరిస్థితుల్లో ప్రారంభం అయినా.. చాలా తక్కువ సమయంలోనే ప్రేక్షకుల మనసులను దోచుకుని సక్సెస్ అయిన షోనే బిగ్ బాస్. సరికొత్త టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య చిత్ర విచిత్రమైన సంఘటనలతో సాగిపోయే ఇది మొదటి నుంచే సత్తా చాటుతోంది. ఫలితంగా ఎన్నో సీజన్లను ఒకదానికి మించి ఒకటి అన్నట్లుగా రేటింగ్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఏడో సీజన్ సరికొత్త అంశాలతో సాగుతోంది. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో ఊహించని పరిణామం జరిగింది. ఆ వివరాలేంటో మీరే చూడండి!

ఉల్టా పుల్టా కాన్సెప్టుతో సరికొత్తగా సాగుతున్న బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఇప్పుడు ఏడో వారం నడుస్తోంది. ఇందులో హాచీ అనే గ్రహం నుంచి వచ్చిన ఓ స్పేష్ షిప్ బిగ్ బాస్ హౌస్‌లో కూలిపోతుంది. కంటెస్టెంట్లు ఏలియన్స్‌ను మెప్పిస్తే కెప్టెన్సీ కంటెండర్లు అవుతారని చెప్పింది. ఇందుకోసం కంటెస్టెంట్లను గులాబీపురం, జిలేబీపురం అనే రెండు టీమ్‌లుగా విభజించిన విషయం తెలిసిందే.

Aata Sandeep and Amardeep Group Game Revealed in Bigg Boss Telugu 7 Show

గులాబీపురం, జిలేబీపురం వాళ్లకు కొన్ని పాత్రలను ఇవ్వగా వాళ్లు అలాగే నటిస్తూ ఉండాలని బిగ్ బాస్ చెప్పాడు. మధ్యలో ఏలియన్స్ ఇచ్చే టాస్కులను రెండు గ్రూపుల వాళ్లు ఆడాల్సి ఉంటుంది. ఇలా మొదటి రౌండ్‌లో జిలేబీపురం వాళ్లు గెలుపొందారు. ఇక, గురువారం రాత్రి ప్రసారం అయిన ఎపిసోడ్‌లో కూడా కష్టతరమైన గేమ్‌లనే పెట్టారు.

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో స్విమ్మింగ్ పూల్‌లో ఒక పెట్టెను ఉంచారు. దానికి సంబంధించిన తాళాలతో పాటు మరిన్ని కలిపి బయట పెట్టారు. ఇప్పుడు ఒక టీమ్ నుంచి ఒకరు బయట నుంచి ఒక్కో తాళాన్ని పూల్‌లో ఉన్న సహచరుడికి అందించాలి. వాళ్లు నీటిలో మునిగి తాళాలు తీసి అందులో ఉన్న ఒక వస్తువును ఏలియన్స్ స్పేష్ షిప్‌కు అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

Aata Sandeep and Amardeep Group Game Revealed in Bigg Boss Telugu 7 Show

ఇందులో జిలేబిపురం టీమ్ నుంచి ప్రియాంక, సందీప్ మాస్టర్.. గులాబీపురం నుంచి తేజ, అమర్‌దీప్‌లు ఆడారు. ఈ టాస్క్ ఎంతో కష్టంగా ఉండడంతో సుదీర్ఘంగా సాగింది. ముఖ్యంగా ఇందులో పూల్‌లో ఉన్న సందీప్, అమర్‌లు ఎంతగానో కష్టపడ్డారు. చివరికి ఇందులో తాళాలన్నీ త్వరగా ఓపెన్ చేసిన సందీప్ మాస్టర్ ఆ వస్తువును తీసి ప్రియాంకకు ఇవ్వగా ఆమె టాస్క్ పూర్తి చేసింది.

స్విమ్మింగ్ పూల్‌లో టాస్క్ పూర్తి అయిన తర్వాత సందీప్, అమర్‌దీప్‌లు కూర్చుని మాట్లాడుకున్నారు. ఆ సమయంలో వీళ్లిద్దరూ ఈ గేమ్ ఎంతో కష్టంగా ఉన్నా.. ఇష్టపడి ఆడామని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత సందీప్ 'నువ్వు కాబట్టి కూల్‌గా ఆడాను. వేరే ఎవరైనా అయితే విసిరిపడేసే వాడిని. నాకు ఆపోజిట్ ఎవరు ఉన్నా అలాగే ఆడేవాళ్లు. నువ్వు కాబట్టే ఇలా ఆడావు' అన్నాడు.

Aata Sandeep and Amardeep Group Game Revealed in Bigg Boss Telugu 7 Show

నోరి జారి మరీ సందీప్ మాస్టర్ చేసిన వ్యాఖ్యలతో అతడు అడ్డంగా దొరికిపోయాడు. అదే సమయంలో అమర్‌దీప్‌తో కలిసి అతడు మొదటి నుంచీ గ్రూప్ గేమ్ ఆడుతున్నాడని శివాజి చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు నిజం అయినట్లు అయింది. సందీప్ మాస్టర్, అమర్‌దీప్ మాట్లాడుకున్న ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X