Bigg Boss Telugu 7: షోలో షాకింగ్ సీన్స్.. నా** అంటూ కాలితో తన్ని.. మరో కంటెస్టెంట్ బూతు మాటతో!
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా వచ్చి దేశంలోనే నెంబర్ వన్ ప్లేస్‌కు చేరింది బిగ్ బాస్. హిందీలో చాలా ఏళ్లుగా ప్రసారం అవుతోన్న ఈ షో.. ఏడేళ్ల క్రితమే తెలుగులోకి వచ్చింది. ఇక్కడ బుల్లితెర చరిత్రలోనే ఎవరూ ఊహించని స్థాయిలో ప్రేక్షకుల నుంచి స్పందనను అందుకుని నెంబర్ వన్ షోగా మారింది. దీంతో ఇప్పుడు ఏడో సీజన్ కూడా సక్సెస్‌ఫుల్‌గా సాగుతోంది. ఇందులో తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో కొన్ని ఊహించని గొడవలు జరిగాయి. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలను మీరే చూడండి!
బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో నడుస్తోంది. ఇందులో అసలు ఏమాత్రం అంచనాలు వేయని ఎన్నో సంఘటనలు కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇందులో నామినేషన్స్ టాస్కులు కూడా ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఎనిమిదో వారానికి గానూ నామినేషన్స్ ప్రక్రియ కొందరి మధ్య ఎన్నో గొడవలతో రచ్చ రచ్చగా సాగింది.

తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో అమర్‌దీప్ చౌదరి - పల్లవి ప్రశాంత్ మధ్య జరిగిన వాగ్వాదం ఎంతో హైలైట్ అయింది. ఇందులో ముందుగా భోలే షావలిని నామినేట్ చేసిన అమర్.. సరిగా ఆడలేదన్న కారణం చెప్పాడు. దీంతో అతడి గ్రూప్ మెంబర్ అయిన ప్రశాంత్ మధ్యలోకి వచ్చి భోలే తరపున మాట్లాడాడు. ఆ సమయంలో గౌతమ్ కూడా రావడంతో పెద్ద గొడవ జరిగింది.
ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ వచ్చి అమర్‌దీప్ చౌదరిని నామినేట్ చేశాడు. ఇందుకోసం భోలే షావలిని అన్న మాటలను అతడు వాడుకున్నాడు. దీంతో మధ్యలో అతడిని ఎందుకు తీసుకు వచ్చావని అమర్ గొడవకు దిగాడు. అప్పుడు భోలే - శోభా శెట్టి మధ్యలోకి వచ్చి గొడవ పడ్డారు. అప్పుడు అమర్‌దీప్ అక్కడ ఉన్న కుర్చీని కాలితో తన్ని పగిలిపోద్ది అంటూ వార్నింగ్ ఇచ్చాడు.
అనంతరం భోలే షావలిని నేరుగానే అటాక్ చేస్తూ మాట్లాడిన అమర్‌దీప్.. 'ఈ నా కొడుకు' అంటూ పల్లవి ప్రశాంత్‌ను సంబోధించాడు. దీంతో అతడికి కోపం వచ్చింది. అప్పుడు చాలా మంది దీనిపై అభ్యంతరం చెప్పడంతో అమర్ సారీ చెప్పాడు. మొత్తానికి ఈ నామినేషన్స్ టాస్కులో అతడు కాస్త ఓవర్‌గా రియాక్ట్ అయినట్లు అనిపించింది. ఇదే అంశాన్ని నెటిజన్లు అంటున్నారు.

ఇక, ప్రిన్స్ యావర్.. సందీప్ మాస్టర్‌ను నామినేట్ చేశాడు. అప్పుడు వాళ్లిద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో సందీప్ 'బొంగు' అని వెకిలి సైగలు చేశాడు. దీంతో పక్కనే ఉన్న భోలే షావలి 'ఇప్పుడు ఆయన కూడా బూతులు మాట్లాడాడు' అన్నాడు. దీనికి ప్రశాంత్, శివాజి కూడా ఆద్యం పోశారు. అప్పుడు సందీప్ వాళ్లందరిపై విరుచుకుపడుతూ సీరియస్ అయ్యాడు.
ఆ తర్వాత సందీప్ మాస్టర్ నేరుగా భోలే వైపు వేలిని చూపిస్తూ వార్నింగ్ ఇచ్చాడు. అప్పుడు శివాజి ఎదురు తిరగడంతో అతడు కామ్ అయ్యాడు. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్‌లో అమర్‌దీప్ చౌదరి, సందీప్ మాస్టర్ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భోలేను బూతులు మాట్లాడాడు అంటూ విమర్శించిన వాళ్లే అదుపు తప్పడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.


Click it and Unblock the Notifications











