Bigg Boss Elimination: నిజంగా సంచలనమే.. 8వ వారం టాప్ కంటెస్టెంట్ ఔట్.. ఫినాలేలో ఉండాల్సినోడు ఇలా!
తెలుగు టెలివిజన్ రంగంలో పెట్టుకున్న సరిహద్దులను చెరిపేసే కంటెంట్‌తో ప్రసారం అవుతూ.. ప్రేక్షకులకు మజాను పంచుతూ సాగిపోతోన్న షోనే బిగ్ బాస్. దేశంలోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్‌ను రాబడుతోన్న ఇది.. సీజన్ల మీద సీజన్లను కూడా పూర్తి చేసుకుంటోంది.
ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్ కూడా ఆరంభం నుంచే ఆసక్తికరంగా సాగుతోంది. ముఖ్యంగా ఇందులో ఎలిమినేషన్స్ అన్నీ షాకింగ్‌గా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎనిమిదో వారానికి గానూ జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియ తాజాగా లీకైంది. మరి ఈ సారి ఎవరు వెళ్లారో చూద్దాం పదండి!

ఉల్టా పుల్టాగానే ఏడో సీజన్: తెలుగులో బిగ్ బాస్ షోకు ప్రత్యేకమైన ఆదరణ లభిస్తోంది. అందుకే ఇది ఎప్పుడు ప్రసారం అయినా సక్సెస్ అవుతోంది. ఇక, ఇప్పుడు ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వస్తుండడంతో ప్రేక్షకాదరణను మరింతగా సొంతం చేసుకుంటోంది. ఇందులో ఎన్నో ఊహించని సంఘటనలు కనిపిస్తూ షోను రంజుగా మారుస్తున్నాయి. ఫలితంగా ఇది కూడా సక్సెస్‌ఫుల్‌గా నడుస్తోంది.
ఏడుగురూ లేడీసే అవుట్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఎలిమినేషన్స్ అన్నీ షాకింగ్‌గా అవుతున్న విషయం తెలిసిందే. దీనికి కారణం ఇప్పటి వరకూ ఈ సీజన్‌లో జరిగిన ఏడు ఎలిమినేషన్లలోనూ లేడీ కంటెస్టెంట్లే బయటకు వెళ్లిపోయారు. అసలే బిగ్ బాస్ షోలో లేడీ విన్నర్లు లేరని అనుకుంటే.. ఇందులో రికార్డు స్థాయిలో వరుసగా ఫీమేల్ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవడం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది.
ఎనిమిదో వారం 8 మంది: బిగ్ బాస్ తాజా సీజన్‌లో ఎలిమినేషన్లు అన్నీ ఊహించని విధంగా సాగుతుండడంతో నామినేషన్స్ ప్రక్రియ ఆసక్తికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలో 8వ వారం జరిగిన నామినేషన్స్ టాస్కులో భోలే షావలి, అశ్విని శ్రీ, శివాజి, అమర్‌దీప్, ఆట సందీప్, గౌతమ్ కృష్ణ, శోభా శెట్టి, ప్రియాంక జైన్‌లు నామినేట్ అయ్యారు. దీంతో ఈ వారం ఎలిమినేషన్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది.
చిన్నోళ్లకే ఎక్కువ ఓట్లు: బిగ్ బాస్ ఏడో సీజన్ ఎనిమిదో వారానికి సంబంధించిన ఓటింగ్ ప్రక్రియ ఎవరూ ఊహించని విధంగా సాగినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. ముఖ్యంగా ఇందులో అస్సలు ఫాలోయింగ్ లేని చిన్న కంటెస్టెంట్లు భోలే షావలి, అశ్విని శ్రీకి ఊహించని విధంగా ఎక్కువ ఓట్లు పడినట్లు తెలిసింది. దీంతో టైటిల్ ఫేవరెట్లు అయిన సందీప్, శోభా శెట్టి వంటి వాళ్లు డేంజర్ జోన్‌లో పడిపోయారు.

8వ వారం సంచలనమే: ఏడో సీజన్‌లోని ఎనిమిదో వారంలో టాప్ కంటెస్టెంట్లు అనుకున్న వాళ్లు నామినేషన్స్‌లో ఉండడంతో ఇది ఎంతో ఆసక్తికరంగా మారింది. ఈ వారంలో మొదటి నుంచీ శోభా శెట్టి, సందీప్ మాస్టర్‌కు చాలా తక్కువ ఓట్లు పోల్ అవుతున్నాయని లీకులు వచ్చాయి. దీంతో ఈ సారి వీళ్లిద్దరిలోనే ఒకరు వెళ్లిపోతారని, అదే జరిగితే ఈ సీజన్‌లో సంచలన ఎలిమినేషన్ అవుతుందని అన్నారు.

టాప్ కంటెస్టెంటే ఔట్: ఎనిమిదో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. దీని ప్రకారం.. ఈ సారి ప్రముఖ కొరియోగ్రాఫర్ ఆట సందీప్ షో నుంచి ఎలిమినేట్ అయినట్లు తెలిసింది. ఆదివారం ఎపిసోడ్‌లో అతడి ఎలిమినేషన్‌ను ప్రసారం చేయబోతున్నారు. చివరి రౌండ్‌లో సందీప్ మాస్టర్‌తో పాటు శోభా శెట్టి ఉంటుందని కూడా మరో న్యూస్ బయటకు వచ్చేసింది.


Click it and Unblock the Notifications











