Bigg Boss 7 Telugu: ప్రశాంత్‌పై సందీప్ సంచలన వ్యాఖ్యలు.. అలా చేసినా తప్పేనా? రైతు బిడ్డ అంత చీపా?
తెలుగు బుల్లితెరపై సంచలనాలను సృష్టిస్తూ.. సుదీర్ఘ కాలంగా దేశంలోనే నెంబర్ వన్ షోగా హవాను చూపిస్తోంది బిగ్ బాస్. మిగిలిన భాషల కంటే మన దగ్గరే ఎక్కువ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న ఇది.. ఏకధాటిగా సీజన్లను జరుపుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దాన్ని నిర్వహకులు ఆసక్తికరంగా జరుపుతున్నారు. దీంతో దీనికి రేటింగ్ కూడా బాగానే వస్తోంది.
గతంలో కంటే ఈ సారి బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక విషయంలో నిర్వహకులు సరికొత్త పంథాలో ఆలోచించారు. అందుకే ఏడో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లనే పంపించారు. అందులో కామన్ మ్యాన్ కోటాలో వచ్చిన రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కూడా బాగానే హైలైట్ అయ్యాడన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే అతడు తనదైన వ్యవహార శైలితో వార్తల్లో నిలుస్తున్నాడు.

ముఖ్యంగా బిగ్ బాస్ రెండో వారానికి జరిగిన నామినేషన్స్ టాస్కు ఎంతో రచ్చ రచ్చగా సాగింది. ఇందులో చాలా మంది కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్‌నే టార్గెట్ చేశారు. వారిలో అమర్‌దీప్ చౌదరి, ప్రియాంక, శోభా శెట్టి, గౌతమ్‌లు మాత్రం శృతి మించి మరీ ఈ యువ రైతుపై విమర్శలు చేశారు. ఫలితంగా అతడికి సంపతీ మరింతగా పెరిగి రెండో వారంలోనూ అత్యధిక ఓట్లు సాధించాడు.
వాస్తవానికి ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లలో కొందరు మాత్రమే పల్లవి ప్రశాంత్‌ను ఓన్ చేసుకుని సమానంగా చూస్తున్నారు. మరికొందరు మాత్రం అతడిపై వివక్షను ప్రదర్శిస్తూనే ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రశాంత్ అభిమానులు సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ సంఘటన దానికి బలాన్ని చేకూర్చేలా మారింది.
శుక్రవారం జరిగిన ఎపిసోడ్‌లో 'పవర్ అస్త్ర' టాస్క్ కోసం సందీప్ మాస్టర్.. అమర్‌దీప్‌ను ఎంపిక చేశాడు. దీనిపై విమర్శలు వచ్చాయి. కొద్ది సేపటి తర్వాత వీళ్లిద్దరూ కలిసి దీని గురించి చర్చించుకున్నారు. ఆ సమయంలోనే ప్రశాంత్‌ను చూపిస్తూ సందీప్ 'వాడు చూడు కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడు. పెద్ద వాళ్లు ఉన్నారన్న రెస్పెక్టే లేదు' అని కామెంట్ చేశాడు.
అయితే, ఇదే హౌస్‌లో చాలా మంది ఇదే తరహాలో వ్యవహరిస్తున్నారు. కానీ, ఎప్పుడూ స్పందించని సందీప్.. ప్రశాంత్‌ను మాత్రమే వేలెత్తి చూపడం ఏంటని అతడి ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, సందీప్ మాట్లాడిన ఈ మాటలకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ అతడిని ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రశాంత్‌పై ఇలా వివక్షను చూపిస్తున్నారని జనాలకు వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడీ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











