Bigg Boss 7 Telugu: చిచ్చు పెట్టిన బ్యూటిఫుల్ లేడీ.. షోలో గొడవలు.. బిగ్ బాస్‌కు కంప్లైంట్ చేయడంతో!
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తెలుగు బుల్లితెరపై సరికొత్త కంటెంట్‌లతో షోలు వస్తున్నాయి. కానీ, అందులో కొన్ని మాత్రమే ప్రేక్షకుల హృదయాలకు చేరువ అవుతున్నాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. తెలుగులో ఎన్నో సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకున్న ఈ షో.. ఇప్పుడు ఏదో దానితో వచ్చింది. ఇది ఆరంభంలోనే ఆసక్తిని రేకెత్తించిందనే చెప్పాలి.
ఆరో సీజన్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో పాటు విమర్శలను తీసుకు వచ్చింది. దీంతో ఏడో సీజన్‌ను విజయవంతం చేయాలని నిర్వహకులు పట్టుదలతో ఉల్టా పుల్టా అనే కాన్సెప్టును పరిచయం చేశారు. అందుకు అనుగుణంగానే మొదటి నుంచే ఇందులో ఎన్నో సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు, షాక్‌లు చూపిస్తున్నారు. ఫలితంగా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్నారు.

'మాయ ఆస్త్ర' టాస్కులో భాగంగా రణధీర టీమ్ దగ్గర ఉన్న తాళం దొంగిలించాలని ఢీలా పడగా.. శుభశ్రీ రాయగురు.. సందీప్ మాస్టర్ సాధించిన పవర్ అస్త్రాన్ని కాజేయాలని ప్లాన్ చేసింది. అనుకున్నట్లుగానే అతడి బెడ్ దగ్గర ఉన్న దాన్ని దొంగలించింది. దాన్ని కొన్ని ప్రదేశాల్లో దాచేసి షాక్ ఇచ్చేసింది. దీనిపై బిగ్ బాస్ హింట్ ఇచ్చినా సందీప్ కనిపెట్టలేకపోయాడు.
బిగ్ బాస్ హౌస్‌లో ఫస్ట్ కంటెస్టెంట్ సందీప్ పవర్ అస్త్రం దొంగతనానికి గురైనట్లు తర్వాత గుర్తించాడు. ఈ విషయాన్ని తాజాగా విడుదలైన ప్రోమోలో చూపించారు. అంతేకాదు, దీనిపై అతడు హౌస్‌లో పెద్ద రచ్చనే చేసినట్లు కూడా హైలైట్ చేశారు. ఆ సమయంలో అంతా తెలిసినా కూడా టేస్టీ తేజ.. సందీప్‌తో వాదనకు దిగాడు. దీంతో ఈ ఇష్యూ ఇంకాస్త సీరియస్ అయిపోయింది.
సందీప్‌కు సంబంధించిన పవర్ అస్త్ర కనిపించకుండా పోవడంతో శోభా శెట్టి వచ్చి 'మా టీమ్‌లో ఎవరూ తీయలేదు మాస్టర్. వాళ్ల టీమ్‌లోనే ఎవరైనా తీసి ఉంటారని అనిపిస్తుంది' అని చెప్పింది. దీంతో అక్కడే ఉన్న రితికా రోజ్ ఆమెతో వాదనకు దిగింది. దీంతో ఈ వ్యవహారం రచ్చ రచ్చగా సాగింది.
సందీప్ మాస్టర్ తన పవర్ అస్త్రను వెతికేందుకు అమర్‌దీప్ సహాయం కూడా తీసుకున్నాడు. దీంతో ఇద్దరూ ఇంట్లోని అన్ని ప్రదేశాల్లో వెతకడం మొదలు పెట్టారు. ఆ సమయంలో రిఫ్రిజిరేటర్ కింద అమర్‌దీప్‌కు ఏదో కనిపించింది. దీంతో దాన్ని పైకి లేపి మరీ తీయడానికి ప్రయత్నించారు. కానీ, ఫలితం లేకుండా పోవడంతో సందీప్ మాస్టర్ బిగ్ బాస్‌కు కంప్లైంట్ చేశాడు.


Click it and Unblock the Notifications











