Bigg Boss Telugu 7: ఈ సీజన్ విన్నర్ అతడే.. బిగ్‌బాస్ నాలాంటి వాళ్లను తొక్కేస్తారు.. ఆట సందీప్ షాకింగ్ కామెంట్
బిగ్ బాస్ తెలుగు సీజన్ షో గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన టీఆర్పీతో అంతకు మించిన టాస్క్ లతో షోను ఎప్పటికప్పుడు రసవత్తరంగా మారుస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే మొదటి వారంలో మొత్తం 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. మొదటి వారంలోనే హౌస్ లోకి అడుగు పెట్టిన ఆట సందీప్.. అద్భుతంగా ఆట ఆడాడు. ముఖ్యంగా ఏడు వారాల పాటు నామినేషన్స్ లోకి కూడా రాకుండా.. 8వ వారంలో నామినేట్ అయ్యాడు. టేస్టీ తేజ చాలా పాజిటివ్ గానే ఆయన్ను నామినేట్ చేయగా.. దురదృష్టవశాత్తు ఎలిమినేట్ అయిపోయాడు. బయటకు వచ్చినప్పటి నుంచి షాకింగ్ కామెంట్లు చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు.
ఇంట్లో ఉన్నంత కాలం తాను చాలా నిజాయితీగా ఉన్నానని.. అందరితో మంచిగా ఉంటూనే హౌస్ లో ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. చాలా పాజిటివ్ గా ఎలాంటి గొడవలు లేకుండా వచ్చిన వాళ్లలో తాను ఉన్నానని చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. షాకింగ్ కామెంట్లు చేశారు. బిగ్ బాస్ అసలు ప్లాన్ ఏంటో చెప్పారు. బిగ్ బాస్ కావాలని తనకు నచ్చిన వాళ్లను మాత్రమే గెలిపిస్తారని.. వాళ్ల కోసం ఎలాంటి మార్పులు అయినా చేస్తారంటూ చెప్పుకొచ్చారు. నేరుగా ఇలా చెప్పకపోయినా ఇలాంటి అర్థాలే వచ్చేలా మాట్లాడారు.

ముఖ్యంగా శివాజి గురించి మాట్లాడుతూ.. కావాలనే ఆయనను తప్పుగా చూపిస్తున్నారని, ఆయనను సైడ్ చేసేందుకు ప్లాన్ చేశారని అన్నారు. ఆయన తప్పుగా మాట్లాడిన మాటల గురించి వివరంచిన నాగార్జున గారు.. మిగతా కంటెస్టెంట్లు అంతకంటే దారుణంగా మాట్లాడిన ఎందుకు తీయట్లేదని అన్నారు. తన లాంటి వాళ్లు అన్న ఒక్క తప్పు మాటను పట్టుకొని రచ్చ చేస్తారని.. ఎంత మాటలైనా అంటారని చెప్పుకొచ్చారు. వాళ్లు గెలిపించాలని అనుకున్న వాళ్లను మాత్రమే గెలిపిస్తారని వివరించారు. శివాజితో తనకు ముందు నుంచి మంచి అనుబంధం ఉందని... కాకపోతే ఇంట్లో అప్పుడప్పుడూ తప్పులు జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు.

ఆ చిన్న చిన్న తప్పుల వల్ల తమ మధ్య బంధం లేనట్లుగా కాదని అన్నారు. శివాజి ముందు నుంచి గేమ్ చాలా బాగా ఆడుతూ.. అందరి గురించి పాజిటివ్ గానే మాట్లాడడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ టీంలో నడుస్తున్న ఆటను చూస్తుంటే సీరియల్ బ్యాచ్ వాళ్లే గెలిచే అవకాశం ఉందని.. అమర్ దీప్ విన్నర్ గా నిలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నట్లు చెప్పుకొచ్చారు. చూడాలి మరి ఏం జరగనుందో.
ప్రస్తుతం బిగ్ బాస్ టీం నిర్వాహకులు అమర్ దీప్ ను గెలిపించాలని చూస్తున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ముద్దుబిడ్డ శోభాశెట్టిని కాపాడుకోవడానికే.. ఎలిమినేషన్ కూడా ఎత్తేశారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. టాప్ 5లో సీరియల్ బ్యాచ్ కు చెందిన అమర్ దీప్, ప్రియాంక జైన్ లు ఉంటారని.. శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ లు ఉండబోతున్నట్లు సమాచారం.



Click it and Unblock the Notifications











