Bigg Boss Telugu 7 Winner: విన్నర్ పేరు లీక్ చేసిన జ్యోతి రాజ్.. ఆమె చెప్పిందంటే కన్ఫార్మ్ అయినట్టే!

తెలుగు టెలివిజన్ రంగంలోనే అత్యధిక రేటింగ్‌ను రాబట్టడంతో పాటు నేషనల్ రేంజ్‌లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోన్న ఏకైక షో బిగ్ బాస్. ఇప్పటికే ఆరు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకుంది. దీంతో ఎన్నో రికార్డులను కూడా క్రియేట్ చేసింది.

Recommended Video

బిగ్ బాస్ విజేత Pallavi Prashanth..ఆఖర్లో పిచ్చెక్కించే ట్విస్ట్ .. | FilmiBeat Telugu

అలా ఇప్పుడు ఏడో సీజన్‌ను కూడా పూర్తి చేసుకోడానికి సిద్ధంగా ఉంది. ఇక, నేడే (డిసెంబర్ 17 ఆదివారం) గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌ అంగరంగ వైభవంగా జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఇందులో ఎవరు గెలవబోతున్నారు అనే దానిపై సందీప్ మాస్టర్ భార్య జ్యోతి రాజ్ పోస్ట్ చేసింది. ఆ వివరాలు మీకోసమే!

Aata Sandeep Wife Jyothi Leaks Bigg Boss Telugu 7 Winner Name

చివరి దశకు ఆరుగురు: బిగ్ బాస్ ఏడో సీజన్ ఉల్టా పుల్టా కాన్సెప్టుతో మొదలైంది. పదిహేను వారాల పాటు ప్రేక్షకులకు ఎన్నో రకాలుగా మజాను అందించిన ఈ షో.. ఆదివారంతో ముగియనుంది. ఇక, ఇందులోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లుగా ఎంట్రీ ఇచ్చారు. వారిలో శివాజి, అమర్‌దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్‌లు ఫైనలిస్టులుగా నిలిచిన విషయం తెలిసిందే.

మొదలైపోయిన షూట్: బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17వ తేదీన జరగనుంది. అయితే, దీనికి సంబంధించిన షూటింగ్ మాత్రం శుక్రవారం నుంచే మొదలైంది. ఇందులో పాత కంటెస్టెంట్ల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌లను చిత్రీకరించారు. అసలైన షూటింగ్ శనివారమే ప్రారంభం అయింది. ఇందులో సెలెబ్రిటీల ఎంట్రీతో పాటు కొంత మంది ఎలిమినేషన్‌ను మాత్రమే షూట్ చేశారు.

నలుగురు ఎలిమినేట్: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఫైనలిస్టుగా నిలిచిన ఆరుగురు కంటెస్టెంట్లలో ముగ్గురి ఎలిమినేషన్లను శనివారం ఎపిసోడ్‌లోనే షూట్ చేస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా నలుగురు ఎలిమినేషన్లను జరిపినట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. ఇందులో వరుసగా అంబటి అర్జున్, ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్ (15 లక్షలు తీసుకున్నాడు), శివాజిలు ఎలిమినేట్ అయిపోయారు.

అందుకే ఆపేశారుగా: బిగ్ బాస్ షోలోనే అత్యంత ముఖ్యంగా విజేత పేరును ప్రకటించే ప్రక్రియను సీక్రెట్‌గా ఉంచుతారు. అందుకే ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలేకు సంబంధించిన షూటింగ్‌లో చివరి అంకాన్ని ఆదివారానికి వాయిదా వేశారు. ఇందులో పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి టాప్ 2గా ఉన్నారు. వీళ్లిద్దరిలో ఒకరిని ఈరోజు సాయంత్రం జరిగే షూటింగ్‌లో ప్రకటించబోతున్నారు.

Aata Sandeep Wife Jyothi Leaks Bigg Boss Telugu 7 Winner Name

ప్రశాంత్ గెలుస్తాడని: బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి కామన్ మ్యాన్‌గా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. చక్కని ఆటతీరుతో పాటు మాటతీరును కూడా కనబరిచి టైటిల్ ఫేవరెట్ అయ్యాడు. అందుకు తగ్గట్లే ఇప్పుడు టాప్ 2గా ఉన్నాడు. దీంతో ఈ సీజన్ ప్రశాంత్‌ గెలుస్తాడని జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

Aata Sandeep Wife Jyothi Leaks Bigg Boss Telugu 7 Winner Name

లీక్ చేసిన జ్యోతి రాజ్: బిగ్ బాస్ విజేతగా ప్రశాంత్ నిలిచే ఛాన్స్ ఉందని టాక్ వచ్చిన నేపథ్యంలో సందీప్ మాస్టర్ భార్య జ్యోతి రాజ్ చేసిన పోస్ట్ దీనికి బలం చేకూర్చుతోంది. ఆమె ఇన్‌స్టాలో 'హార్డ్ వర్క్ ఎప్పుడూ ఫెయిల్ కాదు. ఆ దేవుడు నిన్న చల్లగా చూడాలి తమ్ముడు' అని అతడి ఫొటోను షేర్ చేసింది. అందులో స్పై ఫ్యాన్స్ 8.30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోకు వచ్చేయండి అని కూడా ఉంది.

ఆమె చెబితే నిజమే: వాస్తవానికి శనివారం జరిగిన షూటింగ్‌లో సందీప్ మాస్టర్‌తో పాటు జ్యోతి రాజ్ కూడా పాల్గొంది. అలాంటిది ఆమె పల్లవి ప్రశాంత్ గెలుస్తాడని పోస్ట్ పెట్టడంతో ఇది నిజమే అవుతుందని అంతా అనుకుంటున్నారు. సెట్స్‌లో ప్రత్యక్షంగా ఆమె చాలా మందితో చర్చించి ఉంటుందని, కన్ఫార్మ్ కావడం వల్లే ఈ పోస్టు చేసిందని ప్రశాంత్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X