Bigg Boss Elimination: 3వ వారం షాకింగ్ ఎలిమినేషన్.. టాప్ 5 కంటెస్టెంట్ ఔట్.. అసలు కారణం ఆ తప్పే!

తెలుగు బుల్లితెరపై సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తూనే ప్రేక్షకులకు మజాను పంచుతోన్న ఏకైక షో బిగ్ బాస్. సీజన్ సీజన్‌కు సరికొత్త టాస్కులు.. ఊహించని సంఘటనలు.. ఆసక్తిని కలిగించే ఎలిమినేషన్స్ ఇలా ఎన్నో రకాల పరిణామాలతో షో ఆద్యంతం వినోదాన్ని పంచుతూనే ఉంది. అందుకే తెలుగులో ఇది సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌ కూడా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోంది. ఈ నేపథ్యంలో మూడో వారం ఎలిమినేషన్ న్యూస్ తాజాగా లీకైంది. ఆ వివరాలను మీరే చూసేయండి!

మరింత వినోదంతో సీజన్
ఎన్నో అంచనాల నడుమ ప్రారంభం అయిన బిగ్ బాస్ ఎనిమిదో సీజన్ అంతకంతకూ ఆసక్తికరంగా సాగుతోంది. గతంలో ఎన్నడూ చూడని సరికొత్త కంటెంట్‌ను ఇందులో ప్రసారం చేస్తుండడంతో పాటు కొత్త కంటెంట్‌ను చూపిస్తుండడంతో దీనికి ఆదరణ భారీగా వస్తోంది. ఫలితంగా ఈ సీజన్ మరింత రంజుగా మారుతోంది. దీంతో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా అందుతోంది.

Abhay Naveen Eliminated From Bigg Boss Telugu 8 Show In 3rd Week

14 మందిలో వాళ్లు అవుట్

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి ఢీ ఫేం నైనిక, విష్ణుప్రియ భీమనేని, సోనియా ఆకుల, ప్రేరణ కంభం, యష్మి గౌడ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, పృథ్వీరాజ్, నిఖిల్, నబీల్ అఫ్రిది, ఆదిత్య ఓం, శేఖర్ భాష, నాగ మణికంఠ, అభయ్ నవీన్‌లు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో మొదటి వారంలో బేబక్క, రెండో వారంలో శేఖర్ బాషా షో నుంచి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే.

మూడో వారంలో 8 మంది
బిగ్ బాస్ షోలో నామినేషన్స్ టాస్కు ఎంతో ముఖ్యమైనది. అందుకు తగ్గట్లుగానే ఎనిమిదో సీజన్‌లో సైతం ఈ టాస్కుకు భలే రంజుగా సాగుతున్నాయి. ముఖ్యంగా మూడో వారంలో ఇది హై రేంజ్‌లో జరిగింది. ఇలా ఈ వారంలో అభయ్ నవీన్, విష్ణుప్రియ భీమనేని, కిర్రాక్ సీత, యష్మీ గౌడ, నాగ మణికంఠ, పృథ్వీరాజ్ శెట్టి, ప్రేరణ, నైనికలు నామినేషన్‌లోకి వచ్చేశారు.

రంజుగా ఆట.. క్లాస్‌ వరకే

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో టాస్కులు ఆరంభం నుంచే రంజుగా సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా మూడో వారంలో 'ప్రభావతి 2.O' టాస్కును ఇచ్చారు. ఇందులో గుడ్ల కోసం కంటెస్టెంట్లు యమా కొట్టుకున్నారు. ఫలితంగా ఎన్నో తప్పులు జరిగాయి. దీంతో శనివారం ఎపిసోడ్‌లో హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు క్లాస్ పీకడం వరకే చూపించారు. ఫలితంగా ఎవరినీ సేఫ్ చేయలేదు.

అభయ్ నవీన్ బయటకు
ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లో మొదటి ఎలిమినేషన్ అనుకున్నట్లుగానే సాగింది. రెండో వారంలో మాత్రం ఊహించని కంటెస్టెంట్ వెళ్లిపోయాడు. ఫలితంగా మూడో వారం ఎలిమినేషన్‌పై అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ పరిస్థితుల్లో షో నుంచి అభయ్ నవీన్ ఎలిమినేట్ అయినట్లు న్యూస్ లీకైంది. దీంతో అతడి ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.

ఆ త్యాగమే పెద్ద తప్పుగా

వాస్తవానికి గత నామినేషన్స్ సమయంలో అభయ్ నవీన్ చీఫ్‌గా ఉన్నాడు. నిఖిల్‌ లేదా అతడిలో ఒకరు మాత్రమే ఈ వారం నామినేట్ అవ్వాలని బిగ్ బాస్ చెప్పాడు. అప్పుడు అతడే ముందుకు వచ్చి సెల్ఫ్ నామినేట్ చేసుకున్నాడు. అదే ఇప్పుడు అభయ్‌ కొంప ముంచింది. ఆరంభంలో మంచి ఆటతో టాప్ 5 కంటెస్టెంట్ అనిపించుకున్న అతడు.. 3వ వారమే వెళ్లిపోవాల్సి వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X